Showing posts with label Tejomayuda - తేజోమయుడా. Show all posts
Showing posts with label Tejomayuda - తేజోమయుడా. Show all posts

Yesayya kanikarapurnuda manohara premaku nilayuda యేసయ్య కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా

Song no: 177

    యేసయ్య కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా } 2
    నీవేనా సంతోషగానమూ సర్వసంపదలకు ఆధారము } 2

  1. నా వలన  ఏదియు ఆశించకయే ప్రేమించితివి
    నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడిచితివి } 2
    సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి
    శాశ్వత కృపపొంది జీవింతును ఇల నీ కొరకే } 2 || యేసయ్య ||

  2. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయు వాడవు
    దాహయు తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి } 2
    ఆలసినవారి ఆశను తృప్తిపరచితివి
    అనంత కృపపొంది ఆరాధింతును అనుక్షణము } 2 || యేసయ్య ||

  3. నీ వలన బలమునొందిన వారే ధన్యులు
    నీ సన్నిధియైన సీయెనులో వారు నిలిచెదరు } 2
    నిలువరమైన రాజ్యములో నిను చుచుటకు
    నిత్యము కృప పొంది సేవించెదను తుదివరకు } 2 || యేసయ్య ||

    ఆరధనకు యోగ్యుడవు .. ఎల్లవేళలా పూజ్యుడవు ..


    yesayya kanikarapuurNuDaa manoehara preamaku nilayuDaa
    neeveanaa samtoeshagaanamuu sarvasampadalaku aadhaaramu

    1 naa valana  eadiyu aaSimpakayea preamimchitivi
     nanu rakshimchuTaku unnata bhaagyamu viDichitivi (2)
     siluva maanupai raktamu kaarchi rakshimchitivi
    SaaSvata kRpapomdi jeevimtunu ila nee korakea  " yesayyaa  "

    2 naa koraku sarvamu dhaaraaLamugaa dayacheayu vaaDavu
    dahayu teerchuTaku bamDanu cheelchina upakaarivi
    aalasina vaari aaSanu tRpti parachitivi
    anamta kRpa pomdi aaraadhimtunu anukshaNamu  " yesayyaa "

    3 nee valana balamu nomdina vaarea dhanyulu nee sannidhiyaina
     seeyenuloe vaaru nilichedaru
     niluvaramaina raajyamuloe ninu chuchuTaku
    nityamu kRpa pomdi seavimchedanu tudivaraku  " yesayyaa "

    aaradhanaku yoegyuDavu .. ellaveaLalaa puujyuDavu ..


Nammadhagina vadavu sahayudavu yesayya నమ్మదగిన వాడవు సహయుడవు యేసయ్య

Song no: 178

    నమ్మదగిన వాడవు సహయుడవు యేసయ్య 
    ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్య } 2

    చెర నుండి విడిపించి చెలిమితొ బంధించి
    నడిపించినావె మందవలె నీ స్వాస్ద్యమును } 2 || నమ్మదగిన ||

  1. నీ జనులకు నీవు న్యాయధిపతివైతివే
    శత్రువుల కోటలన్ని కూలిపోయెను
    సంకేళ్ళు సంబరాలు  ముగబోయెను } 2
    నీరిక్షణ కర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు
    నిత్యానందభరితులే సియోనుకు తిరిగివచ్చెను } 2 || నమ్మదగిన ||

  2. నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి
    జఠిలమైన త్రోవలన్ని దాటించితివి
    సమృద్ధి జీవముతో పోషించితివి } 2
    ఆలోచన కర్తవైన నీ స్వరమే వినగా
    నిత్యాదరణను పొంది నీ క్రియలను వివరించెను } 2 || నమ్మదగిన ||

  3. నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివి
    యోగ్యమైన దాసునిగ మలచుకొంటివి
    అర్హమైన పాత్రగనను నిలుపుకొంటివి } 2
    ఆదరణ కర్తవై విడువక తోడైనిలిచి
    సర్వోత్తమమైన మార్గములో నడిపించుము } 2 || నమ్మదగిన ||


    nammadagina vaaDavu sahayuDavu yesayyaa
    aapatkalamuloe aaSrayamainadi neeveanayyaa

    chera numDi viDipimchi chelimitoe mamdhimchi
    naDipimchinaavea mamdavale nee svaasdhyamunu

    1 nee janulaku neevu nyayaadhipativaitivea Satruvula koeTalanni  kuulipoyenu
     samkeLL sambaraalu muugaboeyenu
    nee janulaku neevu nyaayadhipativaitivea
    neerikshaNa kartavaina ninnea nammina prajalu
    nityanamda bharitulai seeyoenu ku tirigi vachchenu

    2 nee priyulanu neevu kaapaaDea mamchi kaapari
    jaThilamaina troevalanni daaTimchitivi
    samRddhi jeevamutoe poeshimchitivi
    aaloechana kartavaina nee svaramea vinagaa
    nityaadaraNanu pomdi nee kriyalanu vivarimchenu

    3 naa balaheenatayamdu SreashTamaina kRpa nichchitivi
    yoegyamaina daasuniga malachukomTivi
    arhamaina paatragananu nilupukomtivi
    aadaraNa kartavai viDuvaka toeDainilichi
    sarvoettamamaina maargamuloe naDipimchumu
|| నమ్మదగిన ||

Naa athmiya yathralo aranya margamulo నా ఆత్మియా యాత్రలో ఆరణ్య మార్గములో

Song no: 179

    నా ఆత్మీయ యాత్రలో ఆరణ్య మార్గములో
    నాకు తోడైన యేసయ్యా నిను ఆనుకొని జీవించెద
    నేనేల భయపడను నా వెంట నీవుండగా
    నేనెన్నడు జడియను నా ప్రియుడా నీవుండగా || నా ఆత్మీయ ||

  1. శ్రేష్టమైన  నీ మార్గములో నిత్యమైన నీ బాహువుచాపి
     సమృద్ధి జీవము నాకనుగ్రహించి నన్ను బలపరచిన యేసయ్య } 2
    నిన్ను హత్తుకొనగా నేటివరకు నేను సజీవుడను } 2 || నేనేల ||

  2. పక్షిరాజువలె పైకెగురుటకు నూతన బలముతో నింపితిని
     జేష్ఠుల  సంఘములో నను చేర్చి పరిశుద్ద పరిచే యేసయ్యా } 2
     అనుదినము నిన్ను స్తుతించుటకు నేని జీవింతును || నేనేల ||  } 2

  3. సేయోను దర్శనము పొందుటకు  ఉన్నత పిలుపుతో పిలిచితిని
     కృపావరముతో నను నింపి అలంకరిస్తున్న యేసయ్యా } 2
     నీ రాక కొరకు  వేచియుంటిని త్వరగా దిగిరమ్ము || నేనేల ||  } 2


    naa aatmiyaa yaatraloe aaraNya maargamuloe
    naaku toeDaina yeasayyaa ninu aanukoni jeevimcheda
    neaneala bhayapaDanu naa vemTa neevumDagaa
    neanennaDu jaDiyanu naa priyuDaa neevumDagaa

    1 SreashTamaina  nee maargamuloe neetyamaina nee baahuvuchaapi
     samRddhi jeevamu naakanugrahimchi nannu balaparachina yesayyaa
    ninnu hattukonagaa neaTivaraku neanu sajeevuDanu  " neaneala " " naa aatma "

    2 pakshiraajuvale paikeguruTaku nuutana balamutoe nimpitini
     jeashThula  samGamuloe nanu chearchi pariSudda parichea yeasayyaa
     anudinamu ninnu stutimchuTaku neani jeevimtunu  " neaneala " " naa aatma " 

    3 seayoenu darSanamu pomduTaku  unnata piluputoe pilichitini
     kRpaavaramutoe nanu nimpi alamkaristunna yeasayyaa
     nee raakakoraku  veachiyumTini tvaragaa digirammu  " neaneala " " naa aatma "
|| నేనేల ||

Madhuram madhuram na priya yesuni charitham madhuram మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం

Song no: 180

    మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం
    శాశ్వతం  శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం !!2!!

    దీనమనస్సు దయగల  మాటల సుందరవదనం తేజోమయుని రాజసం !!2!!
    మధురం మధురం నా ప్రియ యేనుని చరితం మధరం

  1. ఆశ్చర్యకరమైన వేలుగై దిగివచ్చి చీకటిలో
    నున్నవారిని బందింపబడియున్న వారిని విడుదల చేయుటకు!!2!!
    నీరీక్షణ కలిగించి వర్దిల్లజేయుటకు           
    యేసే సకిపాటి నా యేసే పరివారి!!2!! || మధురం ||

  2. పరవుర్ణమైన నేమ్మదినిచ్ఛుటకు  చింతలన్నియు బాపుటకు
    ప్రయసపడువారి బారము  తోలగించుటకు!!2!!
    ప్రతిపలమునిచ్ఛి ప్రగతిలో నడుపుటకు
    యేసే సరిపాటి నా యేనే పరివారి!!2!! || మధురం ||

  3. కలవరపరచే  శోధనలెదురైన కృంగదిసే భయములైనను
    ఆప్యాయతలు కరవైన ఆత్మీయులు దూరమైన!!2!!
    జడియకు నీవు మహిమలో నిలుపుటకు
    యేసే సరిపాటి నా యేసే పరిహరి!!2!! || మధురం ||