Showing posts with label Abraham. Show all posts
Showing posts with label Abraham. Show all posts

Neeve krupadharamu thiyeka deva నీవే కృపాదారము త్రియేక దేవా

Song no:
HD
    నీవే కృపాదారము త్రియేక దేవా
    నీవే క్షేమాదారము నా యేసయ్య } 2
    నూతన బలమును నవనూతన కృపను } 2
    నేటి వరకు దయచేయుచున్నావు
    నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
    ఈ స్తోత్రగీతం నీకేనయ్యా || నీవే కృపాదారము ||

  1. ఆనందించితిని అనురాగబంధాల
    ఆశ్రయపురమైన నీలో నేను } 2
    ఆకర్షించితిని ఆకాశముకంటే
    ఉన్నతమైననీ ప్రేమను చూపి } 2
    ఆపదలెన్నో అలుముకున్నను అభయమునిచ్చితివి
    ఆవేదనల అగ్నిజ్వాలలో అండగానిలచితివి
    ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు
    నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా
    ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా
    నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
    ఈ స్తోత్రగీతం నీకేనయ్యా || నీవే కృపాదారము ||

  2. సర్వకృపానిధి సీయోను పురవాసి
    నీ స్వాస్థ్యముకై నన్ను పిలచితివి } 2
    సిలువను మోయుచు నీ చిత్తమును
    నెరవేర్చెదను సహనముకలిగి } 2
    శిధిలముకానీ సంపదలెన్నో నాకైదాచితివీ
    సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి
    సర్వశక్తిగల దేవుడవై నడిపించుచునావు
    నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
    ఈ స్తోత్రగీతం నీకేనయ్యా || నీవే కృపాదారము ||

  3. ప్రాకారములను దాటించితివి
    ప్రార్థన వినెడి పావనమూర్తివి } 2
    పరిశుద్దులతో నన్ను నిలిపితివి
    నీ కార్యములను నూతన పరచి } 2
    పావనమైన జీవనయాత్రలో విజయము నిచ్చితివి
    పరమ రాజ్యమును నిలుపుట కొరకు అభిషేకించితివి
    పావనుడా నా అడుగులు జారక స్థిరపరచినావు
    నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
    ఈ స్తోత్రగీతం నీకేనయ్యా || నీవే కృపాదారము ||   

Parishuddhudavai mahima prabhavamulaku neeve prathrudavu పరిశుద్ధుడవై మహిమప్రభావములకు - నీవే పాత్రుడవు

పరిశుద్ధుడవై మహిమప్రభావములకు - నీవే పాత్రుడవు 
బలవంతుడవై - దీనుల పక్షమై కృప చూపువాడవు 
దయాలుడవై ధారాలముగా నను దీవించిన శ్రీమంతుడా 
ఆరాధన నీకే నా యేసయ్య -2

నీ స్వాస్థ్యమైన నీవారితో కలిసి నిను సేవించుటకు
నీ మహిమ ప్రభావమును కిరీటముగా - ధరింపజేసితివి.
శాశ్వత కాలము వరకు నీ సంగతిపై దృష్టి నిలిపి 
నీ దాసుల ప్రార్ధనలు సఫలపరచితివ

నీనిత్యమైన ఆదరణ చూపి నను స్థిరపరచుటకు
నీ కరుణకటాక్షమును నాపై కురిపించి నను ప్రేమించితివి
నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి
నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి

ఆనందకరమైన దేశములో నేను నిను ఘనపరచుటకు
నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి
మేఘవాహనుడవై వచ్చువరకు నే కనిపెట్టుచుందును నీ కోసము
నీ దాసులా కాంక్షను సంపూర్ణ పరచెదవు