Showing posts with label Parakramashali - పరాక్రమశాలి. Show all posts
Showing posts with label Parakramashali - పరాక్రమశాలి. Show all posts

Naa kentho anandham nee sannidhi prabhuvaa నా కెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా

Song no: 85

    నా కెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా
    నీలో నేనుండుటే అదే నా ధన్యతయే

  1. ఏ అపాయము నను సమీపించక
    ఏ రోగమైనను నా దరికి చేరక } 2
    నీవు నడువు మార్గములో నా పాదము జారక
    నీ దూతలే నన్ను కాపాడితిరా || నా కెంతో ||

  2. నా వేదనలో నిన్ను వేడుకొంటిని
    నా రోదనలో నీకు మొఱ్ఱ పెట్టితిని } 2
    నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా
    నా కన్న తండ్రివై కాపాడుచుంటివా || నా కెంతో ||

Naa vimochakuda yesayya nee jivana ragalalo నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో

Song no: 87

    నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో....
    నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో....
    నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా....

  1. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నను నింపినందునా } 2
    నీవు చూపిన నీ కృప నేమరువలేను } 2 || నా విమోచకుడా ||

  2. జీవ వాక్యము నాలోన నిలిపి జీవమార్గమలో నడిపించి నందునా } 2
    జీవాధిపతి నిన్ను నేవిడువలేను } 2 || నా విమోచకుడా ||

  3. మమతలూరించె వారెవరు లేరని నిరాశల చెరనుండి విడిపించినందునా } 2
    నిన్ను స్తుతించకుండా నేనుండలేను } 2 || నా విమోచకుడా ||

Naa marghamu naku dhipamaina na yesunitho sadha నా మార్గము నకు దీపమైన నా యేసుతో సదా సాగెద

Song no: 90
    నా మార్గము నకు దీపమైన
    నా యేసుతో సదా సాగెద

  1. గాఢాంధకారపు లోయలలో మరణ భయము నన్ను కమ్మినను } 2
    ఆత్మయందు నే కృంగిపోవక అనుదినం ఆనందింపజేయునట్టి
    ఆత్మనాధునితో సాగెదను } 2 || నా మార్గ ||

  2. నాయొక్క ప్రయత్నములన్నియును నిష్పలముగ అవి మారినను } 2
    నా యొక్క ఆశలు అన్నియును నిరాశలుగా మారిపోయినను
    నిరీక్షణతో నే సాగెదను } 2 || నా మార్గ ||

  3. సమస్తమైన  నా భారములు సంపూర్ణముగా ప్రభు తీర్చునుగా } 2
    నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని సెలవిచ్చిన
    నా దేవునితో సాగెదను } 2 || నా మార్గ ||

  4. ప్రతి ఫలము నేను పొందుటకు నిరీక్షణతో నున్న ధైర్యమును
    పలు శ్రమలందును విడవకుండ ప్రాణాత్మ దేహము సమర్పించి
    ప్రియుని ముఖము చూచి సాగెదను || నా మార్గ || 

Veenulaku vindhulu chese yesayya వీనులకు విందులు చేసే యేసయ్య

Song no: 86

    వీనులకు విందులు చేసే యేసయ్య సు చరిత్ర
    వేగిరమే వినుటకు రారండి ఓ సోదరులారా..
    వేగిరమే వినుటకు రారండి || వీనులకు ||

  1. రండి… విన రారండి
    యేసయ్య ఎవరో తెలిసికొన రారండి (2)
    నీ పాప భారమును తొలగించేది యేసయ్యేనండి
    మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి (2)
    రండి… || వీనులకు ||

  2. రండి… వచ్చి చూడండి
    యేసయ్య చేసే కార్యములు చూడండి (2)
    నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి
    శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి (2)
    రండి… || వీనులకు ||

  3. సృష్టి కర్తను మరచావు నీవు
    సృష్టిని నీవు పూజింప దగునా (2)
    భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి
    నిను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి (2)
    రండి… || వీనులకు ||
Veenulaku Vindulu Chese Yesayya Su Charithra
Vegirame Vinutaku Raarandi
O Sodarulaaraa.. Vegirame Vinutaku Raarandi           ||Veenulaku||

Randi… Vina Raarandi
Yesayya Evaro Thelisikona Raarandi (2)
Nee Paapa Bhaaramunu Tholaginchedi Yesayyenandi
Mokshaaniki Maargam Choopinchedi Yesayyenandi (2)
Randi…                                                 ||Veenulaku||

Randi… Vachchi Choodandi
Yesayya Chese Kaaryamulu Choodandi (2)
Nee Vyaadhi Baadhalu Tholaginchedi Yesayyenandi
Shaanthi Sukhamulu Kaliginchedi Yesayyenandi (2)
Randi…                                                 ||Veenulaku||

Srushti Karthanu Marachaavu Neevu
Srushtini Neevu Poojimpa Dagunaa (2)
Bhoomyaakaashalanu Srushtinchindi Yesayyenandi
Ninu Noothana Srushtiga Maarchedi Yesayyenandi (2)
Randi…                                                 ||Veenulaku||


Yesayya naa hrudhaya spandhana neeve kadha యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా

Song no: 84

    యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా (2)
    విశ్వమంతా నీ నామము ఘణనీయము (2) || యేసయ్యా ||

  1. నీవు కనిపించని రోజున
    ఒక క్షణమొక యుగముగా మారెనే (2)
    నీవు నడిపించిన రోజున
    యుగయుగాల తలపు మది నిండెనే (2)
    యుగయుగాల తలపు మది నిండెనే || యేసయ్యా ||

  2. నీవు మాట్లాడని రోజున
    నా కనులకు నిద్దుర కరువాయెనే (2)
    నీవు పెదవిప్పిన రోజున
    నీ సన్నిధి పచ్చిక బయలాయెనే (2)
    నీ సన్నిధి పచ్చిక బయలాయెనే || యేసయ్యా ||

  3. నీవు వరునిగా విచ్చేయి వేళ
    నా తలపుల పంట పండునే (2)
    వధువునై నేను నిను చేరగా
    యుగయుగాలు నన్నేలు కొందువనే (2)
    యుగయుగాలు నన్నేలు కొందువనే || యేసయ్యా ||


    Yesayyaa Naa Hrudaya Spandana Neeve Kadaa (2)
    Vishwamanthaa Nee Naamamu Ghananeeyamu (2)        ||Yesayyaa||
    Neevu Kanipinchani Rojuna
    Oka Kshanamoka Yugamugaa Maarene (2)
    Neevu Nadipinchina Rojuna
    Yugayugaala Thalapu Madi Nindene (2)
    Yugayugaala Thalapu Madi Nindene        ||Yesayyaa||

    Neevu Maatlaadani Rojuna
    Naa Kanulaku Niddura Karuvaayene (2)
    Neevu Pedavippina Rojuna
    Nee Sannidhi Pachchika Bayalaayene (2)
    Nee Sannidhi Pachchika Bayalaayene         ||Yesayyaa||

    Neevu Varunigaa Vichcheyu Vela
    Naa Thalapula Panta Pandune (2)
    Vadhuvunai Nenu Ninu Cheragaa
    Yugayugaalu Nannelu Konduvane (2)
    Yugayugaalu Nannelu Konduvane          ||Yesayyaa||