Song no: 131
నీ వైపు చూస్తూ నిన్నే సేవించనీ
నిన్ననుసరిస్తూ నీకై జీవించనీ
నీలోనే నను నిలిపి ఫలియించనీ
నీ సేవలో గడిపి తరియించనీ {నీ వైపు చూస్తూ}
- నీ సహవాసము ఆనందమయము
నీ సన్నిధిలో లేదే భయము } 2
నీ ఆలోచన నాకెంతో ప్రియము
నీయందే నా అతిశయము
నీ కృపకంటే మించినదే లేదయ్యా
నీ దయ ఉంటే చాలు కదా యేసయ్యా } 2 {నీ వైపు చూస్తూ}
- నీ చేతికార్యము ఆశ్చర్యకరము
నీ నీతివాక్యము ఎంతో స్థిరము
నీ కనికరము ధరణికి వరము
నీ ప్రేమ నిలుచు నిరంతరము {నీ కృపకంటే}
- నీ జీవమార్గము చేర్చును స్వర్గము
నీ కుడిహస్తము కూర్చును సౌఖ్యము
నీ నామమందే రక్షణ భాగ్యము
నీ దీవెనొందే బ్రతుకు ధన్యము {నీ కృపకంటే}
Song no: 132
ప్రయాసతో పరుగులెత్తినా - పొందాలని ఆశించినా } 2
కరుణించు దేవా నీ కృపచేతనే } 2
కార్యాలు నెరవేరను - కోరికలన్నీ తీరును } 2
- కన్నీటితో నీకు మొరపెట్టినా
ఉపవాసపు దీక్షపట్టి కనిపెట్టినా } 2
ప్రార్ధన విను దేవా నీ కృపచేతనే } 2
మనవులు సన్నిధిని చేరును - త్వరగా జవాబు దొరుకును {ప్రయాసతో}
- కుడి ప్రక్కన పదివేలమంది కూలినా
హతమార్చాను శత్రువులు చుట్టు చేరినా } 2
రక్షించు దేవా నీకృపచేతనే } 2
అపాయములు తొలగిపోవును - క్షేమము నెమ్మదియు కలుగును {ప్రయాసతో}
- తెలివితేటలెన్నో ఉపయోగించినా
బలశౌర్యములన్నీ ప్రయోగించినా } 2
దీవించు దేవా నీ కృపచేతనే } 2
చేతిపనుల ఫలితముండును - ధ్యానముతో కొట్లు నిండును {ప్రయాసతో}