Showing posts with label Jesus my life. Show all posts
Showing posts with label Jesus my life. Show all posts

Viswasa veerulam Kreesthu sishyulam devunike mem విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం దేవునికే మేం వారసులం

Song no:

    విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం - దేవునికే మేం వారసులం
    పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం - దైవ రాజ్యపు యాత్రికులం
    వెలి చూపుతో కాదు విశ్వాసంతో - మేం నడచెదం ఎప్పుడూ
    విశ్వాసపు మంచి పోరాటమే - పోరాడేదం ఇప్పుడు
    జీసస్ ఈస్ అవర్ హీరో - జీసస్ ఈస్ అవర్ హీరో
    ...........
    విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం - దేవునికే మేం వారసులం
    పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం - దైవ రాజ్యపు యాత్రికులం

  1. అబ్రహామును దేవుడు పిలిచెను -అశీర్వాదపు వాగ్ధాన మిచ్చెను
    అబ్రహామును దేవుని నమ్మెను - దేవుడతని కది నీతిగా ఎంచెను
    ప్రభువు పిలువగనే ఎందుకో తెలియకనే - కదిలెనుగా అబ్రహాము
    యెహోవ యీరే అని కొడుకును లేపునని - అర్పించి పొందెనబ్రహాము
    విశ్వాసులకు తండ్రయ్యాడు - దేవునికే స్నేహితుడై పేరొందాడు
    విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం - దేవునికే మేం వారసులం
    పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం - దైవ రాజ్యపు యాత్రికులం

  2. యోసేపుకు దేవుడు కల లిచ్చెను - ఫలించు కొమ్మగా అశీర్వదించెను
    యోసేపు దేవుని ప్రేమించెను - అన్ని వేళల ప్రభు వైపే చూచెను
    గుంటలో త్రోసినను అన్నలు అమ్మినను -యొసేపు ప్రభునే నమ్మాడు
    ప్రభువే తోడుండా శోధన జయించి - అధిపతిగా ఎదిగినాడు
    బానిస కాస్త రాజైనాడు - ఫరోకే తండ్రి వలే రాజ్యమేలాడు
    విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం - దేవునికే మేం వారసులం
    పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం - దైవ రాజ్యపు యాత్రికులం

  3. దానియేలుకు దేవుడు వరమిచ్చెను - కలల భావము వివరింప నేర్పెను
    దానియేలు తన దేవుని ఎరిగెను - ప్రత్యేకముగా జీవించి చూపెను
    రాజుకు మ్రొక్కనని ప్రభువే దేవుడని - దేవుని మహిమను చూపాడు
    సింహపు గుహ అయినా ధైర్యముగా దూకి - సింహాల నోళ్లను మూశాడు
    దానియేలు దేవుడే జీవము గల దేవుడని - రాజు చేత రాజ్యమంత చాటించాడు
    విశ్వాస వీరులం క్రీస్తు శిష్యులం - దేవునికే మేం వారసులం
    పరలోక పౌరులం క్రీస్తు సాక్షులం - దైవ రాజ్యపు యాత్రికులం

  4. సౌలును పౌలుగా దేవుడు మార్చెను - దైవ వాక్యపు ప్రత్యక్షత నిచ్చెను
    పౌలు యేసుని అంతట ప్రకటించెను - భులోకమంతా సంచారము చేసెను
    క్రీస్తుని యోధునిగా శ్రమలను సహియించి - దర్శనమును నెరవేర్చాడు
    జీవ వాక్యమును చేత పట్టుకొని - సిలువ సాక్షిగ నిలిచాడు
    తన పరుగును కదా ముట్టించి - విశ్వాసం కాపాడుకొని గెలిచాడు