Song no:
ఇమ్మానుయేలు దేవుడు
మముకన్న దైవము
మా తోడైయుండి నడిపే నాయకుడు
మా క్షేమము కోరి నడిపే నావికుడు
నా కన్న తల్లితండ్రి నన్ను విడచినా
నా స్నేహితులే నన్ను విడచినా
విడువక నాపై ప్రేమను చూపినది
తన కరములు చాపి
కృపతో నడిపినది
శత్రు సమూహము చుట్టు ముట్టినా
అపజయముతో నే కృంగి యుండగా
సైన్యాధిపతిగా అభయము నిచ్చినది
జయశీలుండై విజయము నిచ్చినది
No comments:
Post a Comment