Showing posts with label Nee charanamule. Show all posts
Showing posts with label Nee charanamule. Show all posts

యెహొవ నా మొర లాలి౦చెను దన మహా దయను నను

16 యెహోవా ప్రేమ
రాగం - శంకరాభరణము తాళం - ఆది

నన్ను గన్నయ్య రావె నా యేసు నన్ను గన్నయ్య రావె నా ప్రభువా

377 క్రీస్తునందలి అభయముు
రాగం - హుసేని తాళం - అట

Thrahimam kreesthu nadha త్రాహీ మాం క్రీస్తు నాధ దయ చూడ రావే

Pilli
Kamalakar
M. D. Shikha Mani
Nithya Santhoshini
Bilmoria
Song no: 313

త్రాహి మాం క్రీస్తు నాధ దయఁ జూడ రావే నేను దేహి యనుచు నీ పాదములే దిక్కుగాఁ జేరితి నిపుడు ||త్రాహి||

గవ్వ చేయురాని చెడ్డ కర్మేంద్రియాధీనుఁడనై రవ్వ పాలై నే నెంతో నెవ్వఁ బొందితిఁ త్రవ్వుచున్న కొలఁదిఁ పెరుఁగుఁ దరగదు నా పాప రాశి యివ్విధమునఁ జెడిపోతినినే నేమి సేతు నోహోహోహో ||త్రాహి||

నీ యందు భయభక్తులు లేని నిర్లజ్జాచిత్తముఁ బూని చేయరాని దుష్కర్మములు చేసినాఁడను దయ్యాలరాజు చేతిలోఁ జేయి వేసి వాని పనులఁ జేయ సాగి నే నిబ్భంగిఁ జెడిపోయితి నే నయ్యయ్యయ్యొ ||త్రాహి||

నిబ్బర మొక్కించుకై నిజము రవ్వంతైన లేక దబ్బర లాడుటకు ము త్తా నైతిని అబ్బురమైన ఘోర పా పాంధకార కూపమందు దబ్బున బడిపోతి నయ్యో దారి చెడి నేనబ్బబ్బబ్బా ||త్రాహి||

నిన్నుఁ జేరి సాటిలేని నిత్యానంద మందఁబోవు చున్నప్పుడు నిందలు నా కెన్ని చేరినా విన్నదనము లేకుండ నీ వే నా మదికి ధైర్యమిచ్చి యన్నిట రక్షించి తివి నా యన్న నీకు స్తోత్ర మహాహా ||త్రాహి||





Nee charanamule nammithi nammithi నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి

Song no: 393

    నీ చరణములే నమ్మితి నమ్మితి
    నీ పాదములే పట్టితి (2) ||నీ చరణములే||

  1. దిక్కిక నీవే చక్కగ రావే (2)
    మిక్కిలి మ్రొక్కుదు మ్రొక్కుదు మ్రొక్కుదు ||నీ చరణములే||

  2. ఐహిక సుఖము – నరసితి నిత్యము (2)
    ఆహాహా ద్రోహిని ద్రోహిని ద్రోహిని ||నీ చరణములే||

  3. న్యాయము గాని – నా క్రియలన్ని (2)
    రోయుచు ద్రోయకు త్రోయకు త్రోయకు ||నీ చరణములే||

  4. భావము మార్చి – నావెత దీర్చి (2)
    దేవర ప్రోవవే ప్రోవవే ప్రోవవే ||నీ చరణములే||

  5. చంచల బుద్ధి – వంచన యెద్ది (2)
    ఉంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే ||నీ చరణములే||

  6. చుర్రుకొని యున్న – శోధనలున్న (2)
    పట్టు విడ గొట్టవే కొట్టవే కొట్టవే ||నీ చరణములే||

  7. నాచు పిశాచి – నరుకుట గాచి (2)
    కాచుకో దాచవే దాచవే దాచవే ||నీ చరణములే||

  8. యేసుని తోడ – నెవ్వరు సాటి (2)
    దోసము బాపును బాపును బాపును ||నీ చరణములే||



  9. Nee Charanamule Nammithi Nammithi
    Nee Paadamule Pattithi (2)        ||Nee Charanamule||
    Dikkika Neeve Chakkaga Raave (2)
    Mikkili Mrokkudu Mrokkudu Mrokkudu        ||Nee Charanamule||
    Aihika Sukhamu – Narasithi Nithyamu (2)
    Aahaahaa Drohini Drohini Drohini        ||Nee Charanamule||
    Nyaayamu Gaani – Naa Kriyalanni (2)
    Royuchu Droyaku Throyaku Throyaku        ||Nee Charanamule||
    Bhaavamu Maarchi – Naavetha Deerchi (2)
    Devara Provave Provave Provave        ||Nee Charanamule||
    Chanchala Buddhi – Vanchana Yeddi (2)
    Unchaka Thrunchave Thrunchave Thrunchave        ||Nee Charanamule||
    Churrukoni Yunna – Shodhanalunna (2)
    Pattu Vida Gottave Kottave Kottave        ||Nee Charanamule||
    Naachu Pishaachi – Narukuta Gaachi (2)
    Kaachuko Daachave Daachave Daachave        ||Nee Charanamule||
    Yesuni Thoda – Nevvaru Saati (2)
    Dosamu Baapunu Baapunu Baapunu        ||Nee Charanamule||