Showing posts with label Sneha bandham - స్నేహ బంధం. Show all posts
Showing posts with label Sneha bandham - స్నేహ బంధం. Show all posts

Kalavantidhi nee jeevitham kadu swalpa kalamu కలవంటిది నీ జీవితము కడు స్వల్ప కాలము

Song no:

    కలవంటిది నీ జీవితము
    కడు స్వల్ప కాలము
    యువకా అది ఎంతో స్వల్పము

  1. విలువైనది నీ జీవితం
    వ్యర్ధము చేయకుమా
    యువకా వ్యర్ధము చేయకుమా
    బహు విలువైనది నీ జీవితం
    వ్యర్ధము చేయకుమా
    యువతీ వ్యర్ధము చేయకుమా      
    కలవంటిది నీ జీవితము.......

  2. నిన్ను ఆకర్షించే ఈ లోకము
    కాటు వేసే విష సర్పము
    యువకా అది కాలు జారే స్థలము

    నిన్ను ఆకర్షించే ఈ లోకము
    కాటు వేసే విష సర్పము
    యువతీ అది కాలు జారే స్థలము

    ఉన్నావు పాపపు పడగ నీడలో
    నీ అంతము ఘోర నరకము
    యువకా అదియే నిత్య మరణము

    ఉన్నావు పాపపు పడగ నీడలో
    నీ అంతము ఘోర నరకము
    యువతీ అదియే నిత్య మరణము
    కలవంటిది నీ జీవితము.......

  3. నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం
    నూతన సృష్టిగా మార్చును
    పాపం క్షమియించి రక్షించును } 2
    ఆ మోక్షమందు నీవుందువు
    యుగయుగములు జీవింతువు
    నీవు నిత్యము ఆనందింతువు } 2     
    కలవంటిది నీ జీవితము.......


Kalavantidi Nee Jeevithamu
Kadu Swalpa Kaalamu
Yuvakaa Adi Entho Swalpamu (2)
Viluvainadi Nee Jeevitham
Vyardhamu Cheyakumu
Yuvakaa Vyardhamu Cheyakumu
Bahu Viluvainadi Nee Jeevitham
Vyardhamu Cheyakumu
Yuvathi Vyardhamu Cheyakumu        ||Kalavantidi||

Ninnu Aakarshinche Ee Lokamu
Kaatu Vese Visha Sarpamu
Yuvakaa Adi Kaalu Jaare Sthalamu (2)
Unnaavu Paapapu Padaga Needalo
Nee Anthamu Ghora Narakamu
Yuvakaa Adiye Nithya Maranamu (2)        ||Kalavantidi||

Ninnu Preminchu Yesu Nee Jeevitham
Noothana Srushtigaa Maarchunu
Paapam Kshamiyinchi Rakshinchunu (2)
Aa Mokshamandu Neevunduvu
Yugayugamulu Jeevinthuvu
Neevu Nithyamu Aanandinthuvu (2)        ||Kalavantidi||

Yesuni rakadalo ayana mukham chudaga యేసుని రాకడలో ఆయన ముఖం చూడగా

Song no:

    యేసుని రాకడలో ఆయన ముఖం చూడగా
    హా! ఎంతో ఆనందమే (2)

  1. అవనిలో జరుగు క్రియలన్ని - హా ఎంతో సత్యమేగా (2)
    వేదవాక్యం నేరవేరు చుండ - యిక మీకు చింతయే లేదా (2)

    2. లోకజ్ఞానం పెరుగుచుండె - అనుదినం జనములలో (2)
    అది ప్రేమ చల్లారేనుగా - యివే రాకడ సూచనల్గా (2)

    3. విన్నవాక్యం నీలో ఫలింపచేసి–సిద్దపడుము(2)
    ప్రాణాత్మ దేహం సమర్పించుము - ప్రార్ధనలో మేల్కొనుము (2)

    4. త్వరపడుము రాకడకై - అలస్యము చేయక (2)
    దేవుని బూరధ్వనించు వేళ - ఎంతో ఆసన్న మాయెనుగా (2)

usthaha dwanitho keerthinthunu halleluya patalu ఉత్సాహధ్వనితో కీర్తింతును హల్లెలూయ పాటలు

Song no:

    ఉత్సాహధ్వనితో కీర్తింతును హల్లెలూయ పాటలు పాడెదను } 2
    నజరేతువాడా ప్రేమామయుడా నిరతము నిన్నే కీర్తింతును నిరతము నిన్నే కీర్తింతును

    హల్లెలూయ హల్లెలూయా (3) {ఉత్సాహధ్వనితో}

  1. నాకొండయు నాకోటయు నాఆశ్రయ దుర్గము నీవేకదా (2)
    నీ కృపను బట్టి ఆనంద భరితుడనై సంతోషించెదను (2) {హల్లెలూయ}

  2. నా దాగుచోటు నాకేడెమా శ్రమలోనుండి రక్షించెధవు (2)
    నా ప్రార్థనలను, విఙ్ఞాపనలను నీ వాలకించితివే (2) {హల్లెలూయ}

Kalavamtidhi nee jivitham kadu swalpa kalamu కలవంటిది నీజీవితం కడు స్వల్పకాలము

Song no:

    కలవంటిది నీ జీవితం - కడు స్వల్పకాలము
    యువకా అది ఎంతో స్వల్పము
    విలువైనది నీజీవితం - వ్యర్ధముచేయకుమా
    యువకా వ్యర్ధము చేయకుమా - యువతీ వ్యర్ధముచేయకుమా

  1. నిన్ను ఆకర్షించే ఈలోకము - కాటువేసే విషసర్పము
    యువకా అది కాలు జారే స్థలము -
    ఉన్నావు పాపపు పడగనీడలో నీ అంతము ఘోర నరకము -
    యువకా అదియే నిత్య మరణము

  2. నిన్ను ప్రేమించె యేసు నీ జీవితం - నూతనా సృష్టిగామార్చును పాపం క్షమియించి రక్షించును -
    ఆ మోక్షమందు నీవుందువు యుగయుగములు జీవింతువూ - నీవు నిత్యము ఆనందింతువు } 2 {కలవంటిది}

Devuni premalo konasaguma o sodhara o sodhari దేవుని ప్రేమలో కొనసాగుమా ఓ సోదరా ! ఓసోదరీ

Song no:

    దేవుని ప్రేమలో కొనసాగుమా - ఓ సోదరా ! ఓసోదరీ !!
    విశ్వాసములో జీవించుమా....ఓ సోదరా ! ఓసోదరీ !!

    నీతిమంతుడు నిత్య దేవుడు నీతో వుండును ఎల్లప్పుడూ...} 2 "దేవుని"

  1. కష్టములు నిను తొందర పెట్టినా - నిందలే నిను బాదించినా
    నీతిమంతుడు నిత్య దేవుడు నీతో వుండును ఎల్లప్పుడూ...
    అగ్నిశోధన నీకు కల్గిన - కారు చీకటి కమ్మినా
    నీతిమంతుడు నిత్య దేవుడు నీతో వుండును ఎల్లప్పుడూ...
    కష్టములు నిను తొందర పెట్టినా - నిందలే నిను బాదించినా
    అగ్నిశోధన నీకు కల్గిన - కారు చీకటి కమ్మినా
    మరణాంధకారపు లోయలలో నీవు నడిచినను } 2 "దేవుని "

  2. వ్యాధి బాధలు చుట్టిముట్టినా - మరణ వేదనలు కల్గిన
    నీతిమంతుడు నిత్య దేవుడు నీతో వుండును ఎల్లప్పుడూ...
    దుష్టశక్తులు ఆవరించిన - కష్టాల సుడులలో చిక్కిన
    నీతిమంతుడు నిత్య దేవుడు నీతో వుండును ఎల్లప్పుడూ...
    వ్యాధి బాధలు చుట్టిముట్టినా - మరణ వేదనలు కల్గిన
    దుష్టశక్తులు ఆవరించిన - కష్టాల సుడులలో చిక్కిన
    గాఢాందకారపు లోయలలో సంచరించినను } 2 " దేవుని

Kalvari giripai siluva bharamu barinchithiva కల్వరిగిరిపై సిలువ భారము భరించితివా ఓ నా ప్రభువా

Song no:

కల్వరిగిరిపై సిలువ భారము భరించితివా ఓ నా ప్రభువా
నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా

1. తుంటరులంత పట్టి కట్టి తిట్టుచు నిన్ను
కొట్టిర తండ్రీ తిట్టుచు నిన్ను కొట్టిర తండ్రీ
నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా

2. మూడు దినముల్ సమాధిలో ముదముతోడ
నిద్రించితివా ముదముతోడ నిద్రించితివా
నా రక్షణకై సజీవముతో సమాధిన్ గెల్చి లేచిన తండ్రి

3. ఆరోహణమై వాగ్దానాత్మన్ సంఘముపైకి
పంపించితివా ఆదరణాత్మన్ పంపించితివా
నీ రాకడకై నిరీక్షణతో నిందలనెల్ల భరించెదను




Kalvarigiripai siluva baramu barimchitiva O na prabuva
Na papamukai ni raktamunu siluvapaina arpimchitiva

1. Tumtarulamta patti katti tittuchu ninnu
Kottira tamdri tittuchu ninnu kottira tamdri
Na papamukai ni raktamunu siluvapaina arpimchitiva

2. Mudu dinamul samadhilo mudamutoda
Nidrimchitiva mudamutoda nidrimchitiva
Na rakshanakai sajivamuto samadhin gelchi lechina tamdri

3. Arohanamai vagdanatman samgamupaiki
Pampimchitiva adaranatman pampimchitiva
Ni rakadakai nirikshanato nimdalanella barimchedanu



Sree yesu rajunake yellappudu mahima శ్రీ యేసు రాజునకే ఎల్లప్పుడు మహిమా

Song no:

    శ్రీ యేసు రాజునకే ఎల్లప్పుడు మహిమా
    నీ జీవితము ద్వారా కలుగునుగాక....... "2"
    హల్లెలూయ ఆమేన్‌....హల్లెలూయ ఆమేన్‌. "2"
    నీ జీవితము ద్వారా ఎల్లప్పుడు మహిమా.. "2"

  1. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు"2"
    యెహోవ కన్నులు నీ పైన ఉండునుగాక "2" "హల్లెలూయ"

  2. అందకార లోకములో దివిటీవలె నీవు వెలగాలనీ "2"
    వెలుగైయున్న దేవుడు కోరుచున్నాడు "2" "హల్లెలూయ"

Nerppumaya naa yesayya neela kshaminchuta nerppumaya నేర్పుమయా నా యేసయ్యా నీలా క్షమియించుట

Song no:

    నేర్పుమయా నా యేసయ్యా...నీలా క్షమియించుట నేర్పుమయా
    నేర్పుమయా నా రక్షకా...నీలా ప్రేమించుట నేర్పుమయా } 2
    అధిక జ్ఞాన సంపన్నుడా స్తుతి సింహాసనాసీనుడా.... } 2 || నేర్పుమయా ||

  1. ఘోరాతి ఘోరముగా హింసిచీన క్రూరులనూ... } 2
    వీరేమి చేయుచున్నారో వీరెరుగరని క్షమియించీనా మహనీయుడా... } 2 || నేర్పుమయా ||

  2. యోగ్యతలేని నాకోసం పరమును వీడితివీ... } 2
    నిందలనూ బరియించీ నిత్యజీవము నాకొసగిన జయశీలుడా... } 2 || నేర్పుమయా ||