Showing posts with label Naa Nireekshana. Show all posts
Showing posts with label Naa Nireekshana. Show all posts

Suryuni dharinchi chadhruni meedha nilichi సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి

Song no: 59

    సూర్యుని ధరించి - చంద్రుని మీద నిలిచి
    ఆకాశములో కనుపించే ఈమె ఎవరు?

  1. ఆత్మల భారం - ఆత్మాభిషేకం
    ఆత్మ వరములు - కలిగియున్న
    మహిమ గలిగిన - సంఘమే

  2. జయ జీవితము - ప్రసవించుటకై
    వేదన పడుచు - సాక్షియైయున్న
    కృపలో నిలిచిన - సంఘమే

  3. ఆది అపోస్తలుల - ఉపదేశమునే
    మకుటముగా - ధరించియున్న
    క్రొత్త నిబంధన - సంఘమే

Naa jeevitham nee kamkitham kadavaraku నా జీవితం నీకంకితం కడవరకు సాక్షిగా

Song no: 58

    నా జీవితం - నీకంకితం  -2
    కడవరకు సాక్షిగా - నన్ను నిలుపుమా - ప్రభూ  -2

  1. బీడుబారినా - నా జీవితం -2
    నీ సిలువ జీవ ఊటలు - నన్ను చిగురింపజేసెనే -2॥నా జీవితం॥

  2. పచ్చని ఒలీవనై - నీ మందిరావరణములో -2
    నీ తోనే ఫలించెదా - బ్రతుకు దినములన్నిట -2 ॥ నా జీవితం॥

Seeyonulo naa yesutho simhasanam yedhuta సీయోనులో నా యేసుతో సింహాసనం యెదుట

Song no: 57

    సీయోనులో - నా యేసుతో
    సింహాసనం యెదుట - క్రొత్తపాట పాడెద -2
    ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు -4

  1. సీయోను మూల రాయిగా - నా యేసు నిలిచి యుండగా -2
    ఆత్మసంబంధమైన మందిరముగా -2
    కట్టబడుచున్నాను - యేసుపై -2॥ సీయోను ॥

  2. సీయోను కట్టి మహిమతో - నా యేసు రానై యుండగా -2
    పరిపూర్ణమైన పరిశుద్ధతతో -2
    అతి త్వరలో ఎదుర్కొందును - నా యేసుని -2 ॥ సీయోను ॥

Ascharyakaruda needhu krupa anudhinam anubavinchedha ఆశ్చర్యకరుడా నీదు కృపా అనుదినం అనుభవించెద

Song no: 55

    ఆశ్చర్యకరుడా నీదు కృపా - అనుదినం అనుభవించెద -2
    ఆది అంతము లేనిది - నీ కృప శాశ్వతమైనది -2

  1. ప్రేమతో పిలిచి నీతితో నింపి - రక్షించినది కృపయే -2
    జయ జీవితమును చేసెదను - అమూల్యమైన కృపతో -2 ॥ ఆశ్చర్య ॥

  2. ఆకాశము కంటె ఉన్నతమైనది - నీ దివ్యమైన కృపయే -2
    పలు మార్గములలో స్థిరపరచినది - నవనూతన కృపయే -2 ॥ ఆశ్చర్య ॥

  3. యేసయ్యా - నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను -2
    నీ కృపను గూర్చి పాడెదను - ఆత్మానందముతో -2 ॥ ఆశ్చర్య ॥

Uhalu nadhu utalu naa yesu raja nilone yunnavi ఊహలు నాదు ఊటలునా యేసురాజా నీలోనే యున్నవి

Song no: 53

    ఊహలు - నాదు ఊటలు
    నా యేసురాజా - నీలోనే యున్నవి -2
    ఊహకందవే - నీదు ఆశ్యర్యక్రియలు -2

  1. నీదు కుడి చేతిలోన నిత్యము వెలుగు తారగా -2
    నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు -2  ||ఊహలు||

  2. శత్రువులు పూడ్చినా ఊటలన్నియు త్రవ్వగా  -2
    జలలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు -2  ||ఊహలు||

  3. ఊరు మంచిదే గాని ఊటలన్నియు చెడిపొయెనే -2
    ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయతా నొందెనే -2  ||ఊహలు||

Yuddha veerulam manamu yuddha veerulam యుద్ధ వీరులం మనము యుద్ధ వీరులం

Song no: 56

    యుద్ధ వీరులం - మనము యుద్ధ వీరులం -2
    మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం -2
    భయపడము జడియము -2
    అపవాడిని ఎదిరించే ఆత్మఖడ్గ యోధులం -2
    యుద్ధ వీరులం - మనము యుద్ధ వీరులం

  1. కృపకు ఆధారమగు - ఆత్మ పొందియున్నాము
    పిరికి ఆత్మను పొంది - బానిసలము కాలేదు -2
    బలహీనతలో - మనము బలవంతులమయ్యాము -2
    శక్తిమంతుడగు యేసు - మనలో నిలిచి యుండగా -2
    యుద్ధ వీరులం - మనము యుద్ధ వీరులం -2

  2. విస్వాసమనే డాలు చేతితో పట్టుకొని
    మహిమ శిరస్త్రాణమును - యేసువలన పొందాము -2
    సర్వాంగ కవచమును - ధరించుకొని యున్నాము -2
    స్వీకృత పుత్రాత్మయే - జయం మనకు ఇవ్వగా  -2

    యుద్ధ వీరులం - మనము యుద్ధ వీరులం -2
    మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం -2
    భయపడము జడియము -2
    అపవాడిని ఎదిరించే ఆత్మఖడ్గ యోధులం -2
    యుద్ధ వీరులం - మనము యుద్ధ వీరులం
    హోసన్నా - హోసన్నా - హోసన్నా
    యోధులమై సాగిపోదము