Song no: 24
వచ్చె వచ్చె తమ్ముడో - యేసు సామి వచ్చే వేళాయె సూడరో "2"
మేఘాల పీఠమెక్కి - మెరుపోలె నింగికి "2" {వచ్చె వచ్చె}
- ఆళ్ళీళ్ళని లేకుండ ఆయనొంక చూస్తరు "2"
భూజనులేసుని చూసి రొమ్ము కొట్టుకుంటరు "2" {వచ్చె వచ్చె}
- రెక్కల దూతలతో సక్కగ దిగివస్తడు "2"
టక్కరోడు సాతాను కొమ్ములిరగదీస్తడు "2" {వచ్చె వచ్చె}
- భూతాలే కరిగిపోయి భూమి కాలిపోవును "2"
ఆకాశం అంతలోనే ఆవిరిగా మారును "2" {వచ్చె వచ్చె}
- నమ్మి బతికున్నోళ్ళు నింగికెగిరిపోతరు "2"
నమ్మి చనిపోయినోళ్ళు లేచి బయటికొస్తరు "2" {వచ్చె వచ్చె}
Song no: 23
జీవముగల దేవా జీవించుచున్నవాడా "2"
జీవనరాగం జీవితగమ్యం "2"
జీవనజ్యోతివయా
యేసయ్యా - పావనమూర్తివయా "2"
- నను రక్షించిన నిన్ను మరువను
నా శిక్షబాపిన నిన్ను విడువను "2"
నిన్న నేడు మారనిదేవా - కన్నుల నిన్నే నిలుపు కొంటిని "2" {జీవనరాగం}
- నను మార్చిన నిను ఘనపరచెదను
ప్రాణమిచ్చిన నిను కొనియాడెదను
సత్యము నీవే శాంతి ప్రదాతా - నిత్యము నా హృది నీదు నివాసం "2" {జీవనరాగం}
Song no: 22
త్రోవలో నీవుంటివో - త్రోవప్రక్క పడియుటింవో "2"
త్రోవ చూపిన నజరేయుని కనలేని అంధుడవైయుంటింవో "2"
అ.ప. : జీవితపు ఈ యాత్రలో నీ పరిస్థితి తెలుసుకో
జీవమార్గం క్రీస్తులో నిన్ను నీవు నిలుపుకో {త్రోవలో}
- చెరిపివేసుకున్నావు నీదు మార్గమును
చెదిరి ఎన్నుకున్నావు స్వంత మార్గమును "2"
పాపపు అంధకారంతో మార్గం కనరాకయుంటివే
చీటికి దారిన పయనంతో మరణం కొనితెచ్చుకుటింవే {జీవితపు}
- సిద్ధపరచెను యేసు నూతన మార్గమును
బలిగ అర్పణగ చేసి శరీరరక్తమును "2"
సత్యమైన ఆమార్గంలో జీవం క్షేమం ఉందిలే
నిత్యుడు ఆ దేవునిచేరే ధైర్యం కలిగించిందిలే {జీవితపు}
- నడచి వెళ్ళుచున్నావా అరణ్యమార్గమున
గమ్యమెరుగకున్నావా జీవనగమనమున "2"
పర్వతములు త్రోవగ చేసి నీటియొద్దకు చేర్చులే
త్రోవలను తిన్నగ చేసి ఆత్మదాహమును తీర్చులే {జీవితపు}
Song no: 20
సమయము లేదన్నా మరి లేదన్నా
పోతే మరలా తిరిగి రాదన్నా "2"
యేసన్న నేడో రేపో వచ్చెనన్నా"2"
భూమిమీదికి దైవరాజ్యం తెచ్చేనన్నా
- హృదయంలో యేసుని చేర్చుకున్న
పరలోక భాగ్యమే నీదగునన్నా "2"
నీ పాపజీవితం విడువకయున్న "2"
పాతాళగుండమే నీగతియన్నా
రేపన్నది నీది కాదు నిద్ర మేలుకో
నేడన్నది ఉండగానే దారి తెలుసుకో "2"
చేయకాలస్యము - తెరువు నీ హృదయము "2" {సమయము}
- ఆకాశం పట్టజాలని దేవుడన్నా
కన్య మరియ గర్భమందు పుట్టాడన్నా "2"
లోక పాపమంత వీపున మోసాడన్నా
మానవాళి శాపం రూపుమాపాడన్నా "2"
నీ హృదయపు వాకిట నిలుచున్నాడు
నిరంతరం ఆ తలుపు తడుతున్నాడు "2"
చేయకాలస్యము-తెరువు నీ హృదయము "2" {సమయము}
- యేసయ్య రెండవ రాకకు సూచనలెన్నో
నీ చుట్టూ జరుగుచున్నవి గమనించన్నా "2"
గడ్డిపువ్వు లాంటిది నీ జీవితమన్నా
ఎపుడు ముగిసి పోతుందో తెలియదన్నా "2"
భూరధ్వనితో ఆర్భాటంతో మేఘారూఢుడై
తీర్పుతీర్చ యేసురాజు రానున్నాడు "2"
చేయకాలస్యము- తెరువు నీ హృదయము "2" {సమయము}
Song no: 21
మరువకురా మరువకురా దేవుని ప్రేమను మరువకురా
విడువకురా విడువకురా ఆప్రభు సన్నిధి విడువకురా
అ.ప. : ఆప్రేమే నిత్యమురా - ప్రభు సన్నిధి మోక్షమురా {మరువకురా}
- పరమును చేరే మార్గము ఇరుకని
శ్రమలుంటాయని ఎరుగుమురా "2"
నశించు సువర్ణము అగ్నిపరీక్షలో
శుద్దియగుననిగమనించరా "2" {ఆప్రేమే}
- లోక సంద్రాములో ఎదురీదాలని
సుడులుంటాయని ఎరుగుమురా "2"
తీరము చేరిన మెప్పును మహిమ
ఘనత కలుగునని గమనించరా "2" {ఆప్రేమే}
- విశ్వాసపరుగులో శోధానవలన
దుఃఖముందాని ఎరుగుమురా "2"
కడముట్టించిన నిత్యానందము
బహుమానముందని గమనించరా "2" {ఆప్రేమే}
Song no: 19
యేసు నీ సాక్షిగా నను నిల్పినావయా
గురిలేని నాబ్రతుకు దరిచేర్చినావయా
నీసేవచేయగా - నీసిల్వమోయగా "2" {యేసు నీ సాక్షిగా}
- ఎండిపోయిన గుండెలకు జీవనదివని ప్రకటింప "2"
మంటిని మహిమకు చేర్చే వారధివని చాటింప
- సత్యం జీవం మార్గం నీవేయని ప్రచురింప "2"
నిత్యం స్తుతి నొందదగిన నీనామము ప్రణుతింప "2" {యేసు నీ సాక్షిగా}
- నాలోనీ సిల్వప్రేమ లోకానికి చూపింప "2"
రాకడకై కనిపెట్టుచు నీకొరకే జీవింప "2" {యేసు నీ సాక్షిగా}
Song no: 17
స్తుతియించెదాను స్తుతిపాత్రుడ నిను
భజియించెదను భయభక్తితోను
అ.ప. : వందానమయ్యా యేసయ్యా
నీకేప్రణుతులు మెస్సీయా
- నీగుణగణములు పొగడనుతరమా
నీఘనకీర్తిని పాడనావశమా "2"
పరలోకసైన్యపు స్తుతిగానములతో "2"
దీనుడనాస్తుతి అంగీకరించుమా "2" {వందానమయ్యా}
- నీఉపకారములు లెక్కింపగలనా
నీమేలులన్నియు వర్ణింపనగునా "2"
నాహృదిగదిలో నివసింపగోరిన
నజరేయుడా నిను హెచ్చింతునయ్యా "2" {వందానమయ్యా}
- నీసిల్వప్రేమను వివరింపశక్యమా
నీసన్నిధిలేక జీవింపసాధ్యమా "2"
ఆరాధించెదఆత్మతోనిరతం
నీక్షమముతో నింపుమాసతతం "2" {వందానమయ్యా}