Song no:
ఏమివ్వ గలనయ్యా నీ ప్రేమకూ
వర్ణించలేనయా ఆ ప్రేమను
ప్రేమ నీ ప్రేమ శాశ్వతమైనది
ప్రేమ నీ ప్రేమ కొలతలు లేనిది
ఆకాశము కంటే ఎతైనది
సముద్రము కంటే లోతైనది
వేయినదుల కంటే విస్తారమైనది
చిటుటకు నే సరిపోగలనా
దారి తొలగి తిరిగితిని
నీ మాటను నేను విననైతిని
నీ కిష్టమైన పాత్రను చేయ
విడువక నాపై కృపను చూపినది
తల్లి బిడ్డను మరచినను
తనయుల ప్రేమ మారినను
తన రూపులో నన్ను చెక్కిన ప్రేమ
తన పోలిక నాకు ఇచ్చిన ప్రేమ
No comments:
Post a Comment