Showing posts with label A.B. Masilamani. Show all posts
Showing posts with label A.B. Masilamani. Show all posts

Devuni goppa premanu kalambu దేవుని గొప్ప ప్రేమను కలంబు

Song no: #65
  1. దేవుని గొప్ప ప్రేమను కలంబు తెల్పజాలదు అత్యున్నత నక్షత్రమున్ అధోగతిన్ అవరించున్ నశించు జాతిన్ రక్షింపన్ సుతుని బంపెను పాపంబు నుండి పాపికి విశ్రాంతి జూపెను
      ||దేవుని ప్రేమ సంపద అపారమైనది నిరంతరంబు నిల్చును ప్రేమ సంగీతము||
  2. యుగాంతకాల మందున భూరాజ్యముల్ నశించగా యేసున్ నిరాకరించువారు చావును కోరు వేళను దేవుని ప్రేమ గెల్చును అనంత జీవము నశించు వారి కాశ్రయంబు ప్రేమ సందేశము.
  3. సముద్రమును సిరాతో నిండి ఆకాశమె కాగితమై కొమ్మల్లె కలంబులె ప్రతి నరుండు కరణమై దేవుని ప్రేమన్ చిత్రింపన్ సంద్రంబు యింకును ఆకాశ వ్యాప్తి యంతయు చాలక పోవును.

Devaa vembadinchithi nee namamun దేవా! వెంబడించితి నీ నామమున్

Song no: 367

    దేవా! వెంబడించితి నీ నామమున్ జీవితేశ్వర నా జీవితాశ నీవే
    రావె నా భాగ్యమా యేసువా ||దేవా||

  1. యేసూ! నీదు ప్రేమను నే వింటిని భాసురంబగు నీ సిలువ నే గంటిని
    యేసువాడను నే నంటిని ||దేవా||

  2. ప్రభో! ప్రారంభించితి ప్రయాణమున్ పరలోక యెరూషలేము
    పురికిన్ పావనా జూపుము మార్గము ||దేవా||

  3. నాధా! ఈదలేను ఈ ప్రవాహమున్ నీదరిన్ గాన నీ కెరటాలధాటిచే
    నావికా రమ్ము నన్ బ్రోవుము ||దేవా||

  4. స్వామి! నీదు ప్రేమకు నే సాక్షిని సంఘమందున నా పొరుగువారికి నీ
    సత్య సువార్త నే జాటుదున్ ||దేవా||

  5. రాజా! నీదు రాజ్యములో జేరితి రమ్యమౌ రాజ్యమందున నన్ వాడుము
    రక్షణానందము గూర్చుము ||దేవా||

Madhura madhura madhuraseva yesu prabhu seva మధుర మధుర మధురసేవ యేసు ప్రభు సేవ

Song no: 698

మధుర మధుర మధురసేవ – యేసు ప్రభు సేవ
1. దేవదూతకును లేని దైవజనుని సేవ – దేవసుతిని సంఘ సేవ దివ్యమౌ సువార్త సేవ

2. పరిశుద్ధాత్మ ప్రోక్షణముచే ప్రజ్వరిల్లుసేవ – పరిమళించువాక్య సేవ ప్రతిఫలించు సాక్ష్య సేవ

3. ప్రభుని పేర ప్రజల యెదుట ప్రవచనాల సేవ – ప్రజల పేర ప్రభుని యెదుట ప్రార్ధనలువచించు సేవ

4. భాగ్యభోగనిధులు లేని భారభరితసేవ – బాష్పసిరులలోన మెలగి బాధలను వరించు సేవ

5. సిలువమూర్తి కృపలు జాట సిగ్గుపడని సేవ – సిలువనిందలను భరింప శిరమువంచి మరియు సేవ

6. లోకజ్ఞానియపహశించు శోకమూర్తి సేవ – లోకులను దీవించు సేవ లోకమును జయించు సేవ

7. దైవజనుడ మరువకోయి దైవపిలుపునోయి – దైవనీతివదలకోయి దేవుడు దీవించునోయి

Parimala sumamulu pusenu prabhu పరిమళ సుమములు పూసెను ప్రభుదయ ధర విరబూసెను

Song no:
    పరిమళ సుమములు పూసెను } 2
    ప్రభుదయ ధర విరబూసెను " పరిమళ "

  1. అరుణోదయముగ మారెను రాత్రి
    కరుణా వరములు కురిసెను ధాత్రి } 2
    పరమ రహాస్యము ప్రేమతో
    ప్రసరించెను ప్రభు జన్మతో } 2

  2. దరిసెన మాయెను వరదును నీతి
    విరమణమాయెను నరకపు భీతి } 2
    విరిసె క్షమాపణ హాయిగా
    మరియ కిశోరుని జన్మగా } 2

  3. మెరిసెను మనమున వరుని సుహాసం
    పరిచయమాయెను పరమ } 2
    నివాసం మురిసెను హృదయము కొల్లగా
    అరుదెంచగ ప్రభు చల్లగా } 2

Prabhu yesuni vadhanamulo na devudu kanipinche ప్రభుయేసుని వదనములో నాదేవుడు కనిపించె

Song no: 675
    ప్రభుయేసుని వదనములో – నాదేవుడు కనిపించె (2)
    పాపాత్ములబ్రోచుటకై – కృపలొలికినకలువరిలో (2)
    పరలోకముకై – చిరజీవముకై (2)
    ప్రార్ధించెనునాహృదయం ||ప్రభుయేసుని||

  1. దిశలన్నియుతిరిగితిని – నాపాపపుదాహముతో (2)
    దౌష్ట్యములోమసలుచును – దౌర్జన్యముచేయుచును (2)
    ధనపీడనతో – మృగవాంఛలతో (2)
    దిగాజారితిచావునకు ||ప్రభుయేసుని||

  2. యేసునీరాజ్యములో – భువికేతెంచెడిరోజు (2)
    ఈపాపినిక్షమియించి – జ్ఞాపకముతోబ్రోవుమని (2)
    ఇలవేడితిని – విలపించుచును (2)
    ఈడేరెనునావినతి ||ప్రభుయేసుని||

  3. పరదైసున ఈదినమే – నాఆనందములోను (2)
    పాల్గొందువునీవనుచు – వాగ్ధానముచేయగనే (2)
    పరలోకమేనా – తుదిఊపిరిగా (2)
    పయనించితిప్రభుకడకు ||ప్రభుయేసుని||

Randi suvartha sunadhamutho ramjilu siluva రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ నినాదముతో

Song no: 135

రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ నినాదముతో తంబుర సితార నాదముతో ప్రభుయేసు దయానిధి సన్నిధికి

యేసే మానవ జాతి వికాసం యేసే మానవ నీతి విలాసం యేసే పతిత పావన నామం భాసర క్రైస్తవ శుభనామం ||రండి||

యేసే దేవుని ప్రేమ స్వరూపం యేసే సర్వేశ్వర ప్రతిరూపం యేసే ప్రజాపతి పరమేశం ఆశ్రిత జనముల సుఖవాసం ||రండి||

యేసే సిలువను మోసిన దైవం యేసే ఆత్మల శాశ్వత జీవం యేసే క్షమాపణ అధికారం దాసుల ప్రార్థన సహకారం ||రండి||

యేసే సంఘములో మనకాంతి యేసే హృదయములో ఘనశాంతి యేసే కుటుంబ జీవన జ్యోతి పసిపాపల దీవెన మూర్తి ||రండి||

యేసే జీవన ముక్తికి మార్గం యేసే భక్తుల భూతల స్వర్గం యేసే ప్రపంచ శంతికి సూత్రం వాసిగ నమ్మిన జనస్తోత్రం. ||రండి||

Randi Suvaartha Sunaadamutho
Ranjilu Siluva Ninaadamutho
Thambura Sithaara Naadamutho
Prabhu Yesu Dayaanidhi Sannidhiki (2)       ||Randi||

Yese Maanava Jaathi Vikaasam
Yese Maanava Neethi Vilaapam
Yese Patheetha Paavana Naamam
Bhaasura Kraisthava Shubha Naamam          ||Randi||

Yese Devuni Prema Swaroopam
Yese Sarveshvara Prathiroopam
Yese Prajaapathi Paramesham
Aashritha Janamula Sukhavaasam            ||Randi||

Yese Siluvanu Mosina Daivam
Yese Aathmala Shaashwatha Jeevam
Yese Kshamaapana Adhikaaram
Daasula Praardhana Sahakaaram           ||Randi||

Yese Sanghamulo Mana Kaanthi
Yese Hrudayamulo Ghana Shaanthi
Yese Kutumba Jeevana Jyothi
Pasipaapala Deevena Moorthy            ||Randi||

Yese Jeevana Mukthiki Maargam
Yese Bhakthula Boothala Swargam
Yese Prapancha Shaanthiki Soothram
Vaasiga Nammina Jana Sthothram           ||Randi||


Devuni varasulam prema nivasulamu దేవుని వారసులం ప్రేమ నివాసులము