Showing posts with label Neethi Sathyam. Show all posts
Showing posts with label Neethi Sathyam. Show all posts

Meghala paina mana yesu thwaralone manakai vacchuchunnadu మేఘాల పైన మన యేసు త్వరలోనే మనకై వచ్చుచున్నాడు

Song no:

    మేఘాల పైన మన యేసు
    త్వరలోనే మనకై వచ్చుచున్నాడు (2)
    సిద్ధపడుమా ఉల్లసించుమా
    నీ ప్రియుని రాకకై (2) ||మేఘాల||

  1. ఏ ఘడియో ఏ వేళయో – తెలియదు మనకు
    బుద్ధి కలిగిన కన్యకలు వలె – సిద్ధపడియుండు (2)
    బూర శబ్దం మ్రోగగా
    ప్రభుని రాకడ వచ్చును
    రెప్ప పాటున పరిశుద్ధులు
    కొనిపోబడుదురు ప్రభువుతో ||మేఘాల||

  2. పాపం వలన వచ్ఛు జీతం – మరణమే కాదా
    దేవుని కృపయే క్రీస్తు యేసులో – నిత్య జీవమే (2)
    వినుట వలన విశ్వాసం
    కలుగును సోదరా
    దేవుని ఆజ్ఞకు లోబడితే
    పొందెదవు పరలోకం ||మేఘాల||

  3. స్తుతియు మహిమ ఘనత ప్రభావం
    యేసుకే చెల్లు గాక
    తర తరములకు యుగయుగములు
    యేసే మారని దైవం (2)
    నిత్యము ఆనందమే ప్రభువా నీతో నుండుట
    నూతన యెరూషలేము చేరుకోనుటే నిరీక్షణ ||మేఘాల||
Meghaala Paina Mana Yesu Thvaralone Manakai Vachchuchunnaadu (2)
Siddhapadumaa Ullasinchumaa Nee Priyuni Raakakai (2) ||Meghaala||

 Ae Ghadiyo Ae Velayo – Theliyadu Manaku Buddhi Kaligina Kanyakala Vale – Siddhapadiyundu (2)
Boora Shabdam Mrogagaa Prabhuni Raakada Vachchunu Reppa Paatuna Parishuddhulu Konipobaduduru Prabhuvutho ||Meghaala||

 Paapam Valana Vachchu Jeetham – Maraname Kaadaa Devuni Krupaye Kreesthu Yesulo – Nithya Jeevame (2)
Vinuta Valana Vishwaasam Kalugunu Sodaraa Devuni Aagnaku Lobadithe Pondedavu Paralokam ||Meghaala||

 Sthuthiyu Mahima Ghanatha Prabhaavam Yesuke Chellu Gaaka Thara Tharamulaku Yugayugamulaku Yese Maarani Daivam (2)

Nithyamu Aanandame Prabhuvaa Neetho Nunduta Noothana Yerushalemu Cherukonute Nireekshana ||Meghaala||