- యేసుని కొరకై యిల జీవించెద భాసురముగ నే ననుదినము దోసములన్నియు బాపెను మోక్ష ని వాసమున ప్రభు జేర్చునుగా ||యేసుని||
- నాశనకరమగు గుంటలోనుండియు మోసకరంబగు యూబినుండి నాశచే నిలపై కెత్తెను నన్ను పి శాచి పథంబున దొలగించెన్ ||యేసుని||
- పలువిధముల పాపంబును జేసితి వలదని ద్రోసితి వాక్యమును కలుషము బాపెను కరుణను బిలిచెను సిలువలో నన్నాకర్షించెను ||యేసుని||
- అలయక సొలయక సాగిపోదును వెలయగ నా ప్రభు మార్గములన్ కలిగెను నెమ్మది కలువరిగిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు ||యేసుని||
- శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొనును నా ప్రభువనిశం వ్యాధులు లేములు మరణము వచ్చిన నాధుడే నా నిరీక్షణగున్ ||యేసుని||
- బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు గుప్తమై యున్నవి ప్రభునందు అద్భుతముగ ప్రభు వన్నియునొసగి దిద్దును నా బ్రతుకంటిని ||యేసుని||
- అర్పించెను దన ప్రాణమునాకై రక్షించెను నా ప్రియ ప్రభువు అర్పింతును నా యావజ్జీవము రక్షకు డేసుని సేవింప ||యేసుని||
- ప్రభునందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో విభుడే దీర్చునుయిలనా చింతలు అభయముతో స్తుతియింతు ప్రభున్ ||యేసుని||
- యౌవన జనమా యిదియే సమయము యేసుని చాటను రారండి పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింపన్ ||యేసుని||
Showing posts with label Raavi john Sundhararao. Show all posts
Showing posts with label Raavi john Sundhararao. Show all posts
Yesuni korakai yila jeevinchedha bhasuramuga ne యేసుని కొరకై యిల జీవించెద భాసురముగ నే
lyOctober 31, 2018Andhra Kraisthava Keerthanalu, Hema John, Kalvari Kiranaalu - కల్వరి కిరణాలు, Raavi john Sundhararao
No comments
Song no:474











