Showing posts with label Chetti Bhanumurthi. Show all posts
Showing posts with label Chetti Bhanumurthi. Show all posts

Iedhigo neethi bhaskarundu udhayamaye ఇదిగో నీతిభాస్కరుండు ఉదయమాయె

Song no: #84
    ఇదిగో నీతిభాస్కరుండు ఉదయమాయె నతని నీతి హృదయ కమలమునను నిలిచి మది తమోగుణంబులణపె సదమల జ్ఞానంబు నొసఁగె ||ఇదిగో||

  1. ఎవని జ్ఞానమహిమ విభవ మెవనినీతి బలప్రకాశ మెవని మనుజ రూపమాయె నవనీత సత్యవర్తి రవినిమించు తేజమూర్తి ||ఇదిగో||
  2. నరజనముల నీతియెవడో ధరణిపతుల దీప్తియెవడో దురితఋణము దీర్చునెవఁడో పరమపురుష డేసుఁడతఁడె నిరతజీవ మొసగునిపుడె ||ఇదిగో||
  3. కలుష మెల్ల బాపదలఁచి కలువరి గిరివరకు నడచి యలవికాని ముక్తి గూర్చన్ సిలువమీద బలియై మరణ బలముణఁచి తిరిగిలేచె ||ఇదిగో||
  4. మదితమం బదెచటికరిగె యెదను కఠినతము కరిగె హృదయరసము లతిశయించి సాధుగుణముగలిగి యేసు పాదములను గొలుతు నిపుడె ||ఇదిగో||
  5. జనగణముల జీవమతఁడె ధనఘనముల దాతయతఁడె యనుభవమున నెఱుఁగుమతని యనుపమ ప్రేమా మృతంబు ననవరతా నందకరము ||ఇదిగో||

Sarvaloka sampoojya namo namo సర్వ లోక సం పూజ్యా నమోనమో

Song no: #87

    సర్వ లోక సం పూజ్యా నమోనమో
    సర్వ జ్ఞాన సంపూర్ణా నమోనమో
    సర్వ సత్య సారాంశా నమోనమో
    దేవా గావో || 4

  1. దీన భక్త మందారా నమోనమో
    దోష శక్తి సంహారా నమోనమో
    దేవా యేసావతార నమోనమో
    దేవా గావో || 4

  2. దేవలోక ప్రదీపా నమోనమో
    భావలోక ప్రతాపా నమోనమో
    పావనాత్మ స్వరూపా నమోనమో
    దేవా గావో || 4

  3. వేదవాక్యాదర్శ మీవె నమోనమో
    వేద జీవమార్గం బీవె నమోనమో
    వేదవాక్కును నీవే నమోనమో
    దేవా గావో || 4

  4. శాపగ్రహివైతివి నాకై నమోనమో
    ప్రాణత్యాగివైతివి. నాకై నమోనమో
    ప్రాయశ్చిత్తమైతివి నాకై నమోనమో
    దేవా గావో || 4

Kalavari mettapai kalavara mettidho కలవరి మెట్టపై కలవర మెట్టిదొ

Song no: #201

    కలవరి మెట్టపై కలవర మెట్టిదొ సిలువెటులోర్చితివో పలుశ్రమ లొందినీ ప్రాణము బెట్టితి ||కల||

  1. తులువలుజేరినిన్ తలపడి మొత్తిరో అలసితి సొలసితి నాత్మను గుందితి ||కల||

  2. పాపులకొరకై ప్రాణముబెట్టితి ప్రేమ ది యెట్టిదో నామదికందదు ||కల||

  3. దారుణ పాప భారము మోసితి దీనుల రక్షణ దానమైతివి గద ||కల||

  4. జనకున భీష్టమున్ జక్కగ దీర్చితి జనముల బ్రోవనీ జీవము నిచ్చితి ||కల||

  5. శాంతిని గోరి ది శాంతముల్దిరిగిన భ్రాంతియె గాని వి శ్రాంతెవరిత్తురు? ||కల||

Prabalamugane prastuthinchedha prabhuni krupalanni ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్ని

9
రాగం - (చాయ: ) తాళం -

Siluve na saranayenu ra nee siluve సిలువే నా శరణాయెను రా నీ సిలువే

Song no: 198

    సిలువే నా శరణాయెను రా నీ సిలువే నా శర ణాయెను రా సిలువ యందే ముక్తి బలముఁ జూచితి రా ||నీ సిలువే||

  1. సిలువను వ్రాలి యేసు పలికిన పలుకు లందు విలువలేని ప్రేమామృతముఁ గ్రోలితి రా ||నీ సిలువే||

  2. సిలువను జూచుకొలఁది శిలసమానమైన మనసు నలిగి కరిగి నీరగు చున్నది రా ||నీ సిలువే||

  3. సిలువను దరచి తరచితి విలువ కందఁగ రాని నీ కృప కలుష మెల్లనూ బాపఁగఁ జాలును రా ||నీ సిలువే||

  4. పలు విధ పథము లరసి ఫలిత మేమి గానలేక సిలువయెదుటను నిలచినాఁడను రా ||నీ సిలువే||

  5. శరణు యేసు శరణు శరణు శరణు శరణు నా ప్రభువా దురిత దూరుఁడ నీ దరిఁ జేరితి రా ||నీ సిలువే||

Rare chuthumu rajasuthudi రారె చూతము రాజసుతుడీ

Song no: 116
రా – హిందుస్థాని తోడి
తా – ఆది
    రారె చూతము – రాజసుతుడీ – రేయి జనన మాయెను = రాజులకు రా – రాజు మెస్సియ – రాజితంబగు తేజమదిగో ॥రారె॥

  1. దూత గణములన్ – దేరి చూడరే – దైవ వాక్కులన్ – దెల్పగా = దేవుడే మన – దీనరూపున – ధరణి కరిగెనీ – దినమున ॥రారె॥

  2. కల్లగాదిది – కలయు గాదిది – గొల్ల బోయల – దర్శనం = తెల్లగానదె – తేజరిల్లెడి – తారగాంచరె – త్వరగ రారే ॥రారె॥

  3. బాలు డడుగో – వేల సూర్యుల – బోలు సద్గుణ – శీలుడు = బాల బాలికా – బాలవృద్ధుల నేల గల్గిన – నాధుడు ॥రారె॥

  4. యూద వంశము – ను ద్ధరింప దా – వీదుపురమున – నుద్భవించె సదమలంబగు – మదిని గొల్చిన – సర్వ జనులకు సార్వభౌముడు ॥రారె॥