50
Showing posts with label
Panthagani Paradhesi ✍
.
Show all posts
Showing posts with label
Panthagani Paradhesi ✍
.
Show all posts
ఆహా మహాత్మ హా శరణ్య హా విమోచకా
196
క్రీస్తు సిలువమీఁద పల్కిన యేడు మాటలు
రాగం - హిందుస్థానీ కాపీ
తాళం - రూపకము
ఆహా మహాత్మ హా శరణ్య – హా విమోచకా
ద్రోహ రహిత చంపె నిను నా – దోషమే కదా
వీరలను క్షమించు తండ్రి – నేరమేమియున్
కోరిటితుల నిన్ను చంపు – కౄర జనులకై
|| ఆహా ||
నీవు నాతో పరదైసున – నేడే యుందువు
పావనుండ ఇట్లు పలికి – పాపి గాచితి
|| ఆహా ||
అమ్మా నీ సుతుడటంచు మరి-యమ్మతో పలికి
క్రమ్మర నీ జనని యంచు – కర్త నుడితివి
|| ఆహా ||
నా దేవ దేవ యేమి విడ-నాడితి వనుచు
శ్రీ దేవ సుత పలికితివి శ్రమ – చెప్ప శక్యమా
|| ఆహా ||
దప్పిగొనుచున్నానటంచు – చెప్పితివి కదా
యిప్పగిదిని బాధ నొంద – నేమి నీకు హా
|| ఆహా ||
శ్రమ ప్రమాద-ములను గొప్ప – శబ్ద మెత్తి హా
సమాప్తమైనదంచు తెలిపి – సమసితివి కదా
|| ఆహా ||
అప్పగింతు తండ్రి నీకు – నాత్మ నంచును
గొప్ప యార్భాటంబు చేసి – కూలిపోతివా
|| ఆహా ||
Aahaa Mahaathma Haa Sharanya – Haa Vimochakaa
Droha Rahitha Champe Ninu Naa – Doshame Kadaa Aahaa
Veeralanu Kshaminchu Thandri – Neramemiyun
Koritithula Ninnu Champu – Kroora Janulakai Aahaa
|| Aahaa ||
Neevu Naatho Paradaisuna – Nede Yunduvu
Paavanunda Itlu Paliki – Paapi Gaachithi Aahaa
|| Aahaa ||
Ammaa Nee Suthudatanchu Mari-yammatho Paliki
Krammara Nee Janani Yanchu – Kartha Nudithivi Aahaa
|| Aahaa ||
Naa Deva Deva Yemi Vida-naadithi Vanuchu
Shree Deva Sutha Palikithivi Shrama – Cheppa Shakyamaa Aahaa
|| Aahaa ||
Dappigonuchunnaanatanchu – Cheppithivi Kadaa
Yippagidini Baadha Nonda – Nemi Neeku Haa Aahaa
|| Aahaa ||
Shrama Pramaada-mulanu Goppa – Shabda Metthi Haa
Samaapthamainadanchu Thelipi – Samasithivi Kadaa Aahaa
|| Aahaa ||
Appaginthu Thandri Neeku – Naathma Nanchunu
Goppa Yaarbhaatambu Chesi – Koolipothivaa Aahaa
|| Aahaa ||
1. ఆహా మహాత్మ హా శరణ్య హా విమోచకా (Rajaji Prasad)
2. ఆహా మహాత్మ హా శరణ్య హా విమోచకా
3. ఆహా మహాత్మ హా శరణ్య హా విమోచకా (Ravi Kumar)
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)