ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే } 2
నీ కృప... నీ కృప... నీ కృప ... ఇదీ నీ కృపా } 2
- కష్టకాలమందు నా చెంత చేరి
కన్నీళ్లు తుడచి నన్నాదరించినది } 2
నీ కృప... నీ కృప... నీ కృప... ఇది నీ కృపా } 2 || ఈ స్థితిలో ||
- మూర్కులగు ఈ తరముకు నన్ను వేరుచేసి
పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది } 2
నీ కృపా... నీ కృపా... నీ కృపా ... ఇది నీ కృపా } 2 || ఈ స్థితిలో ||
- దేవ దూతలే చేయని ఈ దివ్య సేవను
అల్పుడనైనా నాకు అప్పగించినది
నీ కృప... నీ కృపా... నీ కృప ... ఇది నీ కృపా } 2 || ఈ స్థితిలో ||

ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ } 2
యేసయ్య నీ ప్రేమానురాగం
నను కాయును అనుక్షణం } 2 || ఎడబాయని ||
- శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో
కడలేని కడలిలో నిరాశ నిసృహలో } 2
అర్ధమేకాని ఈ జీవితం
ఇక వ్యర్థమని నేననుకొనగ } 2
కృపా కనికరం గల దేవా
నా కష్టాల కడలిని దాటించితివి } 2 || ఎడబాయని ||
- విశ్వాస పోరాటంలో ఎదురాయె శోధనలు
లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో } 2
దుష్టుల క్షేమమునేచూచి
ఇక నీతి వ్యర్థమని అనుకొనగ } 2
దీర్ఘశాంతముగల దేవా
నా చేయి విడువక నడిపించితివి } 2 || ఎడబాయని ||
- నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో
నా బలమును చూచుకొని నిరాశ చెందితిని } 2
భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగ } 2
ప్రధాన యాజకుడా యేసు
నీ అనుభవాలతో బలపరిచితివి } 2 || ఎడబాయని ||