-->
Showing posts with label
Prabhu Geetharadhana - ప్రభు గీతారాధన .
Show all posts
Showing posts with label
Prabhu Geetharadhana - ప్రభు గీతారాధన .
Show all posts
Song no: 122
నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్య } 2
నీవే మార్గము సత్యము నీవే నిత్యజీవము నీవేగదయ్య } 2
ఘోరపాపముతో నిండిన నా హృదిని
మార్చితివే నీదరి చేర్చితివే } 2
హత్తుకొని ఎత్తుకొని
తల్లివలె నన్ను ఆదరించితివే } 2 || నీవుగాక ||
అడుగులు తడబడిన నా బ్రతుకుబాటలో
వెదకితివే నావైపు తిరిగితివే } 2
స్థిరపరచి బలపరచి
తండ్రివలె నాకు ధైర్యమిచ్చితివే } 2 || నీవుగాక ||
Song no: 120
నా యేసయ్య - నీ దివ్య ప్రేమలో నా జీవితం - పరిమళించెనే } 2
ఒంటరిగువ్వనై - విలపించు సమయాన ఓదర్చువారే - కానరారైరి } 2 ఔరా! నీచాటు నన్ను దాచినందున - నీకే నా స్తోత్రర్పణలు } 2 || నా యేసయ్య ||
పూర్నమనసుతో - పరిపూర్ణఆత్మతో
పూర్ణబలముతో - ఆరాధించెద } 2
నూతనసృష్టిగా - నన్ను మార్చినందున - నీకే నా స్తోత్రర్పనలు } 2 || నా యేసయ్య ||
జయించిన నీవు - నా పక్షమైయుండగా
జయమిచ్చు నీవు - నన్ను నడుపుచుండగా } 2
జయమే నా ఆశ - అదియే నీ కాంక్ష - నీకే నా స్తోత్రర్పనలు } 2 || నా యేసయ్య ||
Song no: 119
నిత్యాశ్రయదుర్గమైన యేసయ్య
తరతరములలో నీవు మాకు చేయనివేమున్నవి } 2
ప్రణమిల్లేదను ప్రణుతించెదను పరవసించెద నీలోనే } 2 || నిత్యా ||
నా నీతిసూర్యుడా నీ నీతికిరణాలు
నీ మార్గములలో నన్ను నడిపించెనే } 2
నా నిత్యరక్షణకు కారణజన్ముడా
నీకే సాక్షిగా తేజరిల్లేదనయ్య } 2 || నిత్యా ||
నా అభిషిక్తుడా నీ కృపావరములు సర్వోత్తమమైన మార్గము చూపెనే } 2
మర్మములన్నియు బయలుపరుచువాడా
అనుభవజ్ఞానముతో నేనడిచెదనయ్య } 2 || నిత్యా ||
Song no: 117
నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే
నా ఆవేదనలలో జనించెనే నీ కృపాదారణ – (2) || నా గీతా ||
నీ కృప నాలో వ్యర్ధము కాలేదు – నీ కృపా వాక్యమే
చేదైన వేరు ఏదైన నాలో – మొలవనివ్వలేదులే (2)
నీ కృప నాలో అత్యున్నతమై
నీతో నన్ను అంటు కట్టెనే (2) || నా గీతా ||
చేనిలోని పైరు చేతికి రాకున్నా – ఫలములన్ని రాలిపోయినా
సిరి సంపదలన్ని దూరమై పోయినా – నేను చలించనులే (2)
నిశ్చలమైన రాజ్యము కొరకే
ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే (2) || నా గీతా ||
ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో – నిండుగా కుమ్మరించెనే
ఆత్మ ఫలములెన్నో మెండుగ నాలో – ఫలింపజేసెనే (2)
ఆత్మతో సత్యముతో ఆరాధించుచు
నే వేచియుందునే నీ రాకడకై (2) || నా గీతా ||
Song no: 119
ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తం
పాపములన్నియు కడుగుచున్నది } 2
పరమతండ్రితో సమాధానము కలిగించుచున్నది } 2
దుర్ణీతి నుండి విడుదలచేసి
నీతిమార్గాన నిను నడిపించును } 2
యేసురక్తము క్రయధనమగును
నీవు ఆయన స్వస్థమౌదువు } 2 || ప్రవహించుచున్నది ||
దురభిమానాలు దూరముచేసి
యథార్థ జీవితం నీకనుగ్రహించును } 2
యేసురక్తము నిర్దోషమైనది
నీవు ఆయన ఎదుటే నిలిచెదవు } 2 || ప్రవహించుచున్నది ||
జీవజలముల నది తీరమున
సకలప్రాణులు బ్రతుకుచున్నవి } 2
యేసురక్తము జీవింపజేయును
నీవు ఆయన వారసత్వము పొందెదవు } 2 || ప్రవహించుచున్నది ||
Song no: 123
ఎవరూ సమీపించలేని
తేజస్సులో నివసించు నా యేసయ్యా (2)
నీ మహిమను ధరించిన పరిశుద్ధులు
నా కంటబడగానే (2)
ఏమౌదునో నేనేమౌదునో (2) || ఎవరూ ||
ఇహలోక బంధాలు మరచి
నీ యెదుటే నేను నిలిచి (2)
నీవీచుచు బహుమతులు నే స్వీకరించి
నిత్యానందముతో పరవశించు వేళ (2) || ఏమౌదునో ||
పరలోక మహిమను తలచి
నీ పాద పద్మములపై ఒరిగి (2)
పరలోక సైన్య సమూహాలతో కలసి
నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2) || ఏమౌదునో ||
జయించిన వారితో కలిసి
నీ సింహాసనము నే చేరగా (2)
ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో
నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ (2) || ఏమౌదునో ||
Evaru Sameepinchaleni
Thejassulo Nivasinchu Naa Yesayyaa (2)
Nee Mahimanu Dharinchina Parishuddhulu
Naa Kantabadagaane (2)
Emauduno Nenemauduno (2)
Iehaloka Bandhaalu Marachi
Nee Yedute Nenu Nilichi (2)
Neevichchu Bahumathulu Ne Sweekarinchi
Nithyaanandamutho Paravashinchu Vela (2) ||Emauduno||
Paraloka Mahimanu Thalachi
Nee Paada Padmamula Pai Origi (2)
Paraloka Sainya Samoohaalatho Kalasi
Nithyaaraadhana Ne Cheyu Prashaantha Vela (2) ||Emauduno||
Jayinchina Vaaritho Kalisi
Nee Simhaasanamu Ne Cheragaa (2)
Evariki Theliyani O Krottha Perutho
Nithya Mahimalo Nanu Piliche Aa Shubha Vela (2) ||Emauduno||