Song no: #77
విజయగీతముల్ పాడరే క్రీస్తునకు జయ విజయగీతముల్ పాడరే వృజిన మంతటి మీఁద విజయ మిచ్చెడు దేవ నిజకుమారుని నామమున్ హృదయములతో భజన జేయుచు నిత్యమున్ ||విజయ||
మంగళముగ యేసుఁడే మనకు అక్షణ శృంగమై మరి నిల్చెను నింగిన్ విడిచి వచ్చెను శత్రుని యుద్ధ రంగమందున గెల్చెను రంగు మీరఁగఁదన రక్తబలము వలనఁ పొంగు నణఁగఁజేసెను సాతానుని బల్ క్రుంగ నలిపి చీల్చెను||విజయ||
పాపముల్...
Showing posts with label Madhura Geethalu. Show all posts
Showing posts with label Madhura Geethalu. Show all posts
Yesu lechenu adhivaramuna yesu lechenu vekuvajamuna యేసు లేచెను ఆదివారమున యేసు లేచెను వేకువజామున యేసు
Song no: 218
యేసు లేచెను ఆదివారమున యేసు లేచెను వేకువజామున యేసు లేచెను||
వేకువజామున చీఁక టుండఁగానే యాకాశదూతలు వీకతో రాఁ గానే ||యేసు||
సమాధిపై రాతిన్ స్వామి దూత లిద్దరు సమముగఁ దీయను స్వామి లేచె నహహ ||యేసు||
మృతులలో సజీవున్ వెతకు టేల నని దూతలు వారితో దాత లేఁడని తెల్పి ||యేసు||
స్త్రీలు వేగ వెళ్లి శిష్యులకుఁ దెల్ప జింత మారిపోయి సందేహము తొల్గ ||యేసు||
పేతురు...
Dhutha pata padudi rakshakun దూత పాట పాడుఁడీ రక్షకున్ స్తుతించుఁడీ
Andhra Kraisthava Keerthanalu, Bilmoria, Charles wesley, Christmas lyrics, Madhura Geethalu, Zion Songs
No comments
Song no: #127 226
దూత పాట పాడుఁడీ రక్షకున్ స్తుతించుఁడీ ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేము నందునన్ భూజనంబు కెల్లను సౌఖ్యసంభ్ర మాయెను ఆకసంబునందున మ్రోగు పాట చాటుఁడీ దూత పాట పపాడుఁడీ రక్షకున్ స్తుతించుఁడీ.
ఊర్ధ్వలోకమందునఁ గొల్వఁగాను శుద్ధులు అంత్యకాలమందున కన్యగర్భమందునబుట్టినట్టి రక్షకా ఓ యిమ్మానుయేల్ ప్రభో ఓ నరావతారుఁడా నిన్ను నెన్న శక్యమా? దూత పాట...
Geethamulu padudi yesuniki గీతములు పాడుఁడీ యేసునికి
Song no: 115
రా – భైరవి
(చాయ: సందియము వీడవె)
తా – త్రిపుట
గీతములు పాడుఁడీ – యేసునికి సం – గీతములు పాడుఁడీ = పాతకులమగు మనల దారుణ – పాతకము తన విమలరక్త – స్నాతులనుగాఁ జేసి పాపను – భాతకులలో నవతరించెను ||గీతములు||
రాజులకు రాజుగా – నేలుచు మోక్ష – రాజ్యమున కర్తగా = బూజలందుచు దూత పరిగణ – పూజితుండౌ ఘనుఁడు తన దగు – తేజ మెల్లను విడిచి యీయిలఁ – దేజహీనులలోనఁ...
Rakshakundudhayinchi nadata manakoraku రక్షకుండుదయించినాఁడఁట మనకొరకుఁ
Andhra Kraisthava Keerthanalu, Bilmoria, Christmas lyrics, Madhura Geethalu, Mocharla Raghavayya
No comments
Bilmoria
Song no: 112
రా – మధ్యమావతి
తా – అట
రక్షకుండుదయించినాఁడఁట – మనకొరకుఁబరమ – రక్షకుం డుదయించి నాఁడఁట = రక్షకుండుదయించినాఁడు – రారె గొల్లబోయలార – తక్షణమనఁ బోయి మన ని – రీక్షణ ఫల మొందుదము ॥రక్షకుండు॥
దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాఁడు = దేవుఁడగు యెహోవా మన – దిక్కుఁ దేరి చూచినాఁడు ॥రక్షకుండు॥
గగనమునుండి డిగ్గి – ఘనుఁడు గబ్రియేలు దూత...
Koniyadadharame ninnu komala hrudhaya కొనియాడఁ దరమె నిన్ను-కోమల హృదయ
Song no: 108
రా – కమాసు
తా – త్రిపుట
కొనియాడఁ దరమె నిన్ను-కోమల హృదయ – కొనియాడఁ దరమె నిన్ను = తనరారు దినకరుఁ – బెనుతారలను మించు – ఘనతేజమున నొప్పు — కాంతిమంతుఁడ వీవు ॥కొనియాడ॥
ఖెరుబులు సెరుపులు – మరి దూతగణములు = నురుతరంబుగఁ గొలువ – నొప్పు శ్రేష్ఠుఁడ వీవు ॥కొనియాడ॥
సర్వలోకంబులఁ – బర్వు దేవుఁడ వయ్యు = నుర్వి స్త్రీ గర్భాన – నుద్భవించితి వీవు...
Vinare yo narulara veenula kimpu meera వినరే యో నరులారా వీనుల కింపు విూర
Andhra Kraisthava Keerthanalu, Christmas lyrics, Madhura Geethalu, Puroshottham Chwodari, Sunandha
No comments
Song no: 104
రా – యదుకులకాంభోజి
తా – ఆది
వినరే యో నరులారా – వీనుల కింపు విూర – మనల రక్షింప క్రీస్తు – మనుజావతారుఁ డయ్యె – వినరే = అనుదినమును దే – వుని తనయుని పద – వనజంబులు మన – మున నిడికొనుచును ॥వినరే॥
నరరూపుఁ బూని ఘోర – నరకుల రారమ్మని – దురితముఁ బాపు దొడ్డ — దొరయౌ మరియా వరపత్రుఁడు = కర మరు దగు క – ల్వరి గిరి దరి కరి -గి రయంబున ప్రభు – కరుణను...
O SadBhakthulaara loka rakshakundu ఓ సద్భక్తులార లోక రక్షకుండు
Andhra Kraisthava Keerthanalu, Bilmoria, Christmas lyrics, Madhura Geethalu, Prederik okeli anu barnard lukas, Zion Songs
No comments
Song no: #126 225
ఓ సద్భక్తులార లోక రక్షకుండు
బెత్లెహేమందు నేడు జన్మించెన్
రాజాధిరాజు ప్రభువైన యేసు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో
సర్వేశ్వరుండు నరరూపమెత్తి
కన్యకు బుట్టి నేడు వేంచెసెన్
మానవ జన్మ మెత్తిన శ్రీ యేసూ
నీకు సమస్కరించి నీకు సమస్కరించి
నీకు సమస్కరించి పూజింతుము
ఓ దూతలార ఉత్సహించి పాడి
రక్షకుండైన్...