Song no:
స్వస్థత పరచు యెహోవా నీవే
నీ రక్తంతో మమ్ము కడుగు యేసయ్యా } 2
మా ఆరోగ్యం నీవే ఆదరణ నీవే ఆనందం నీవెగా } 2 || స్వస్థత ||
ఒక్క మాట మాత్రం నీవు సెలవిమ్ము
వదలిపోవును వ్యాధి బాధలన్ని
శ్రమ పడువారిని సేదదీర్చి
సమకూర్చుము వారికి ఘన విజయం || స్వస్థత ||
పాపపు శాపము తొలగించుము
అపవాది కట్లను తెంచివేయుము
క్రీస్తుతో నిత్యము ఐక్యముగా
నీ మహిమలో నిత్యము వసింపనిమ్ము || స్వస్థత ||
Swasthata paracu yehōvā nīvē
nī raktantō mam'mu kaḍugu yēsayyā} 2
mā ārōgyaṁ nīvē ādaraṇa nīvē ānandaṁ nīvegā} 2 || svasthata ||
okka māṭa mātraṁ nīvu selavim'mu
vadalipōvunu vyādhi bādhalanni
śrama paḍuvārini sēdadīrci
samakūrcumu vāriki ghana vijayaṁ || svasthata ||
pāpapu śāpamu tolagin̄cumu
apavādi kaṭlanu ten̄civēyumu
krīstutō nityamu aikyamugā
nī mahimalō nityamu vasimpanim'mu || svasthata ||
Song no:
సోలిపోయిన మనసా నీవు
సేదదీర్చుకో యేసుని ఒడిలో
కలత ఏలనో కన్నీరు ఏలనో
కర్త యేసే నీతో ఉండగా
ప్రభువు నీ చేయి వీడడు ఎన్నడు } 2
యేసులో నీ కోరిక తీరునుగా || సోలిపోయిన ||
యేసు ప్రేమను నీవెరుగుటచే
దూరమైన నీ వారే } 2
కన్న తల్లే నిను మరచిననూ
యేసు నిన్ను మరువడెన్నడు } 2
శ్రమకు ఫలితం కానలేక
సొమ్మసిల్లితివా మనసా } 2
కోత కాలపు ఆనందమును
నీకొసగును కోతకు ప్రభువు } 2
ఎంత కాలము కృంగిపోదువు
నీ శ్రమలనే తలచుచు మనసా } 2
శ్రమపడుచున్న ఈ లోకమునకు
క్రీస్తు నిరీక్షణ నీవై యుండగ } 2
సోలిపోకుము ఓ ప్రియ మనసా
సాగిపో ఇక యేసుని బాటలో
కలత వీడు ఆనందించు
కర్త యేసే నీతో ఉండగా
కలతకు ఇక చావే లేదు } 2
యేసు కోరికనే నెరవేర్చు || సోలిపోయిన ||
Solipoyina Manasaa Neevu
Sedadeerchuko Yesuni Odilo
Kalatha Elano Kanneeru Elano
Kartha Yese Neetho Undagaa
Prabhuvu Nee Cheyi Veedadu Ennadu } 2
Yesulo Nee Korika Theerunugaa || Solipoyina ||
Yesu Premanu Neeverugutache
Dooramaina Nee Vaare } 2
Kanna Thalle Ninu Marachinanu
Yesu Ninnu Maruvadennadu } 2
Shramaku Phalitham Kaanaleka
Sommasillithivaa Manasaa } 2
Kotha Kaalapu Aanandamunu
Neekosagunu Kothaku Prabhuvu } 2
Entha Kaalamu Krungipoduvu
Nee Shramalane Thalachuchu Manasaa } 2
Shramapaduchunna Ee Lokamunaku
Kreesthu Nireekshana Neevai Yundaga } 2
Solipokumu O Priya Manasaa
Saagipo Ika Yesuni Baatalo
Kalatha Veedu Aanandinchu
Kartha Yese Neetho Undagaa
Kalathaku Ika Chaave Ledu } 2
Yesu Korikane Neraverchu || Solipoyina ||
Telugu
English
Song no:
ఈ దినం సదా నా యేసుకే సొంతం
నా నాధుని ప్రసన్నత నా తోడ నడచును } 2
రానున్న కాలము – కలత నివ్వదు } 2
నా మంచి కాపరీ సదా – నన్ను నడుపును || ఈ దినం ||
ఎడారులు లోయలు ఎదురు నిలచినా
ఎన్నడెవరు నడువని బాటయైనను } 2
వెరవదెన్నడైనను నాదు హృదయము } 2
గాయపడిన యేసుపాదం అందు నడచెను } 2 || ఈ దినం ||
ప్రవాహం వోలె శోదకుండు ఎదురు వచ్చినా
యుద్ధకేక నా నోట యేసు నామమే
విరోదమైన ఆయుధాలు యేవి ఫలించవు
యెహోవా నిస్సియే నాదు విజయము || ఈ దినం ||
Song no:
Ee Dinam Sadaa Naa Yesuke Sontham
Naa Naadhuni Prasannatha Naa Thoda Nadachunu } 2
Raanunna Kaalamu – Kalatha Nivvadu } 2
Naa Manchi Kaapari Sadaa – Nannu Nadupunu } 2 || Ee Dinam ||
Edaarulu Loyalu Eduru Nilachinaa
Ennadevaru naduvani Baatayainanu } 2
Veravadennadainanu Naadu Hrudayamu } 2
Gaayapadina Yesu Paadam Andu Nadachenu } 2 || Ee Dinam ||
Pravaaham Vole Shodhakundu Eduru Vachchinaa
Yuddha Keka Naa Nota Yesu Naamame } 2
Virodhamaina Aayudhaalu Yevi Phalinchavu } 2
Yehovaa Nissiye Naadu Vijayamu } 2 || Ee Dinam ||