Song no: 112
నేను యేసుని చూచే సమయం బహు సమీపమాయెనే....
శుభప్రదమైన యీ నిరిక్షణతో శృతి చేయబడెనే నా జీవితం.... } 2 || నేను యేసుని ||
- అక్షయ శరీరముతో ఆకాశ గగనమునా } 2
ఆనందభరితనై ప్రియ యేసు సరసనే పరవశించెదను. . . . } 2 || నేను యేసుని ||
- రారాజు నా యేసుతో.... వెయ్యండ్లు పాలింతును.... } 2
గొర్రెపిల్ల.... సింహము.... ఒక చోటే కలసి విశ్రమించును } 2 || నేను యేసుని ||
- అక్షయ కిరీటముతో ఆలంకరింపబడి } 2
నూతన షాలేములో.... నా ప్రభు యేసుతో ప్రజ్వరిల్లెదను } 2 || నేను యేసుని ||
Song no: 113
వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడినవారమై
నీతిమంతులమై మొవ్వు వేయుదము
యేసురక్తములోనే జయము మనకు జయమే
స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే
- యెహోవా మందిర ఆవరణములో ఎన్నోన్నె మేళ్ళు గలవు
ఆయన సన్నిధిలోనే నిలిచి - అనుభవింతుము ప్రతిమేలును || వర్ధిల్లెదము ||
- యేసయ్య సిలువ బలియాగములో అత్యున్నత ప్రేమ గలదు
ఆయన సముఖములోనే నిలిచి - పొందెదము శాశ్వత కృపను || వర్ధిల్లెదము ||
- పరిశుద్ధాత్ముని అభిషేకములో ఎంతో ఆదరణ కలదు
ఆయన మహిమైశ్వర్యము మన - దుఃఖము సంతోషముగ మార్చును || వర్ధిల్లెదము ||
Song no: 90
నా మార్గము నకు దీపమైన
నా యేసుతో సదా సాగెద
- గాఢాంధకారపు లోయలలో మరణ భయము నన్ను కమ్మినను } 2
ఆత్మయందు నే కృంగిపోవక అనుదినం ఆనందింపజేయునట్టి
ఆత్మనాధునితో సాగెదను } 2 || నా మార్గ ||
- నాయొక్క ప్రయత్నములన్నియును నిష్పలముగ అవి మారినను } 2
నా యొక్క ఆశలు అన్నియును నిరాశలుగా మారిపోయినను
నిరీక్షణతో నే సాగెదను } 2 || నా మార్గ ||
- సమస్తమైన నా భారములు సంపూర్ణముగా ప్రభు తీర్చునుగా } 2
నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని సెలవిచ్చిన
నా దేవునితో సాగెదను } 2 || నా మార్గ ||
- ప్రతి ఫలము నేను పొందుటకు నిరీక్షణతో నున్న ధైర్యమును
పలు శ్రమలందును విడవకుండ ప్రాణాత్మ దేహము సమర్పించి
ప్రియుని ముఖము చూచి సాగెదను || నా మార్గ ||
Song no: 79
హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలము పాడెదను... హల్లెలూయా....
- ఆనందం మానంద మానందమే శాశ్వత ప్రేమచే నన్ను ప్రేమించి !!2!!
సొంత పుత్రునిగా మార్చినది నా జీవిత భాగ్యమే. . . . || హల్లెలూయా ప్రభు యేసుకే ||
- ఆనందం మానంద మానందమే ఆనంద తైలంతో అభిషేకించి !!2!!
అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే నా జీవిత భాగ్యమే. . . . || హల్లెలూయా ప్రభు యేసుకే ||
- ఆనందం మానంద మానందమే జ్యోతియైన సీయోన్ నివాసమే } 2
తండ్రి కుడిపార్స్య నిరీక్షణయే నా జీవిత భాగ్యమే. . . . } 2 || హల్లెలూయా ప్రభు యేసుకే ||
Song no: 55
ఆశ్చర్యకరుడా నీదు కృపా - అనుదినం అనుభవించెద -2
ఆది అంతము లేనిది - నీ కృప శాశ్వతమైనది -2
- ప్రేమతో పిలిచి నీతితో నింపి - రక్షించినది కృపయే -2
జయ జీవితమును చేసెదను - అమూల్యమైన కృపతో -2 ॥ ఆశ్చర్య ॥
- ఆకాశము కంటె ఉన్నతమైనది - నీ దివ్యమైన కృపయే -2
పలు మార్గములలో స్థిరపరచినది - నవనూతన కృపయే -2 ॥ ఆశ్చర్య ॥
- యేసయ్యా - నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను -2
నీ కృపను గూర్చి పాడెదను - ఆత్మానందముతో -2 ॥ ఆశ్చర్య ॥
Song no: 03
నూతన - యెరూషలేము పట్టణము
పెండ్లికై- అలంకరింపబడుచున్నది
- దైవనివాసము మనుషులతో- కూడా ఉన్నది
వారాయనకు - ప్రజలై యుందురు
ఆనంద - ఆనంద - ఆనందమే
౹౹నూతన౹౹
- ఆదియు నేనే - అంతము నేనై యున్నాను
దుఃఖము లేదు - మరణము లేదు
ఆనంద - ఆనంద - ఆనందమే
౹౹నూతన౹౹
- అసహ్యమైనది - నిషిద్ధమైనది చేయువారు
ఎవ్వరు దానిలో - లేనేలేరు
ఆనంద - ఆనంద - ఆనందమే
౹౹నూతన ౹౹
- దేవుని దాసులు - ఆయనను సేవించుదురు
ముఖ దర్శనము - చేయుచునుందురు
ఆనంద - ఆనంద - ఆనందమే
౹౹ నూతన౹౹
- సీయోనులో - గొర్రెపిల్లయే మూలరాయి
సీయోను పర్వతము - మీదయు ఆయనే
ఆనంద - ఆనంద - ఆనందమే
౹౹నూతన౹౹
Song no: 43
ప్రభువా - నీ సముఖము నందు
సంతోషము - కలదు
హల్లెలూయా సదా - పాడెదన్
హల్లెలూయా సదా - పాడెదన్
ప్రభువా - నీ సముఖము నందు
- పాపపు ఊబిలో - నేనుండగా
ప్రేమతో - నన్నాకర్షించితిరే -2
కల్వారి రక్తంతో - శుద్ధి చేసి -2
రక్షించి పరిశుద్ధులతో - నిల్పి ॥ ప్రభువా ॥
- సముద్ర - తరంగముల వలె
శోధనలెన్నో- ఎదురైనను -2
ఆదరణ కర్తచే - ఆదరించి -2
నీ నిత్య కృపలో - భద్రపరచి ॥ ప్రభువా ॥
3. సౌందర్య సీయోన్ని - తలంచగా
ఉప్పొంగుచున్న - హృదయముతో -2
ఆనందమానంద - మానందమాని -2
ప్రియునితో నేను పాడెదను ॥ ప్రభువా ॥