Song no: నాలో నివసించే నా యేసయ్య - మనోహర సంపాద నీవేనయ్యా } 2
మారని మమతల మహనీయుడ } 2
కీర్తించి నిన్నే ఘనపరతునయ్య - మనసార నిన్నే ప్రేమింతునయ్య } 2 || కీర్తించి నిన్నే ||
మధురమైనది నీ స్నేహబంధం - మహిమగా నన్ను మార్చిన వైనం } 2
నీ చూపులే నన్ను కాచెను - నీ బాహువే నన్ను మోసేను } 2
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను } 2 || కీర్తించి నిన్నే ||
వినయ భావము ఘనతకు మూలము - నూతన జీవములో నడుపు మార్గం
నా విన్నపం విన్నవులే - అరుదేంచేనే నీ వరములే
ఏమని వర్ణింతును నీ కృపలను || కీర్తించి నిన్నే ||
మహిమ గలది నీ దివ్య రాజ్యం - తేజోవాసుల పరిశుద్ద స్వాస్థ్యం } 2
సియోనులో చేరాలనే నా ఆశయం నెరవేర్చుము యేసయ్య నిన్ను చూచి హర్షింతును } 2
భువినేలు రాజ నీ నా వందనం - దివినేలు రాజ వేలాది వందనం || కీర్తించి నిన్నే ||
Song no: నీ ప్రేమ నాలో మధురమైనది
అది నా ఊహకందని క్షేమ శిఖరము (2)
ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను
పరవశించి నాలో మహిమపారతు నిన్నే
సర్వ కృపనిధి నీవు – సర్వాధికారివి నీవు
సత్యా స్వరూపివి నీవు – ఆరాధింతును నిన్నే || నీ ప్రేమ నాలో ||
చేరితిని నిన్నే విరిగిన మనస్సుతో - కాదనలేదే నా మనవును నీవు (2)
హృదయం నిండిన గానం – నను నడిపే ప్రేమ కావ్యం
నిరతము నాలో నీవే – చెరగని దివ్య రూపం (2)
ఇది నీ బహు బంధాల అనుబంధమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే (2) || నీ ప్రేమ నాలో ||
నా ప్రతి పదములో జీవము నీవే
నా ప్రతి అడుగులో విజయము నీవే (2)
ఎన్నడు విడువని ప్రేమ – నిను చేరే క్షణము రాధా
నీడగా నాతో నిలిచే – నీ కృపాయే నాకు చాలును (2)
ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే (2) || నీ ప్రేమ నాలో ||
నీ సింహాసనము నను చేర్చుటకు
సిలువను మోయుట నేర్పించితివి (2)
కొండలు లోయలు దాటే – మహిమాత్మతో నింపినావు
దయగల ఆత్మతో నింపి – సమాభూమిపై నడిపినావు
ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
నా యేసురాజా ఆరాధన నీకే (2) || నీ ప్రేమ నాలో ||
Song no: Nee Prema Naalo Madhuramainadi
Adi Naa Oohakandani Kshema Shikharamu (2)
Eri Korukunnaavu Prema Choopi Nannu
Paravashinchi Naalo Mahimaparathu Ninne
Sarvakrupaanidhi Neevu – Sarvaadhikaarivi Neevu
Sathya Swaroopivi Neevu – Aaraadhinthunu Ninne || Nee Prema ||