Akasam amrutha jallulu kuripinchindhi ఆకాశం అమృత జల్లులు కురిపించింది

ఆకాశం అమృత జల్లులు కురిపించింది
ఈ లోకం ఆనందమయమై మురిసింది (2)
అంతు లేని ఈ అనంత జగతిలో
శాంతి కొరవడి మసలుచుండగా (2)
రక్షణకై నిరీక్షణతో (2)
వీక్షించే ఈ అవనిలో (2)
శాంతి సమతల కధిపతి నేడు జన్మించినాడనీ           ||ఆకాశం||
పొంతన లేని వింత జగతిలో
పాపాంధకారం ప్రబలి యుండగా (2)
సమ్మతిని మమతలను (2)
పెంచుటకై ఈ పృథివిపై (2)
ఆది దేవుడే ఆదరంబున ఉదయించినాడనీ             ||ఆకాశం||

No comments:

Post a Comment