Song no:
ఏమి ఇచ్చి ఋణము
తీర్చగలను స్వామీ
ఎలాగ నిన్ను నేను
సేవించగలను స్వామీ
నాకున్న సర్వం ఇచ్చిన
ఋణము తీరదే
నాకున్న సర్వం ఇచ్చిన అర్పణ తీరదే
నా పాప శిక్షణంత నీవే మోసితివే
నాకొరకై క్రయధనముగా
నీ ప్రాణము నిచ్చితివే
నీలాంటి ప్రేమను
ఎవ్వరు చూపనే లేదు
నీలా ప్రేమించెవారు కనబడనే లేదు
ఎక్కడ వెదికినను దొరకనే లేదు
పలుచోట్ల వెదకినను కనబడనేలేదు
వెండి బంగారములతో
విమోచెనే లేదు కోడెల రక్తముతోనైన
పరిశుద్ధతే లేదు
పరిశుద్ధ రక్తం నాకై చిందించిన దేవా
అమూల్య రక్తముతో విమోచించినావే
ఎక్కడ వెదికినను దొరకనే లేదు
పలుచోట్ల వెదకినను కనబడనే లేదు
No comments:
Post a Comment