Song no:
ఎవ్వరికి చెప్పాలి నా యేసయ్యా
ఏమని నే చెప్పాలి నాస్థితి నేనయ్యా
లోకమంత దూషించి అపహసించినా
నా చేంత చేరి నన్నాదరించావూ
నీప్రేమను చూపావు
కరుణించి బ్రోచావు
నీ సాక్షిగానే జీవించాలని
నా కున్న ఆశయ్యా
కన్న ప్రేమకన్న
మిన్నయైన ప్రేమ చూపి
కనికరము చూపి కరుణించి బ్రోచావు
నీ ప్రేమ కౌగిలిలో నే నిరతం జీవిస్తూ
నీ సాక్షిగానే జీవించాలని
నా కున్న ఆశయా
ఎవ్వరు ఉన్న లేకున్నా
అమ్మానాన్న వైనావు
ఏమి ఉన్నా లేకున్నా
నా తోడు నిలిచావు
నీ ప్రేమయే చాలు నీవుంటేనే చాలు
నీవే నా ఆశ్రయమై
నీ కృపనే చూపావు
No comments:
Post a Comment