Showing posts with label Sharon Sisters. Show all posts
Showing posts with label Sharon Sisters. Show all posts

Yesu devuni asrayinchuma sodhara sodhari యేసు దేవుని ఆశ్రయించుమా సోదరా సోదరీ

Song no:
HD
    యేసు దేవుని ఆశ్రయించుమా సోదరా సోదరీ ఈ క్షణమే
    విశ్వసించుమా తండ్రిని వేడుమా గొప్పకార్యాలు జరుగును నీ యెదుటే
    స్వస్థత లేక సహాయము లేక సాలిపోయావా

    యేసు నామములోనే స్వస్థత యేసు కృపలోనే భద్రత
    యేసు రక్తములోనే విమోచన యేసే నడిపించును జీవమార్గాన

  1. రోగియైన దాసుని కొరకు శతాధిపతి యేసు ప్రభుని వేడుకొనెను
    మాట మాత్రం సెలవిమ్మనగా విశ్వసించిన ప్రకారమే స్వస్థతను పొందెను
    విశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును } 2
    యేసు నందు విశ్వాసముంచుము } 2

    యేసు నామములోనే స్వస్థత యేసు కృపలోనే భద్రత
    యేసు రక్తములోనే విమోచన యేసే నడిపించును జీవమారాన

  2. దు:ఖ స్థితిలో హన్నా తన ఆత్మను దేవుని సన్నిధిని కుమ్మరించుకొనెను
    మొక్కుబడి చేసి ప్రార్థించెను దీవింపబడెను కుమారుని పొందెను
    నీవు అడుగుము నీకివ్వబడును } 2
    యేసుని ప్రార్థించుము } 2

    యేసు నామములోనే స్వస్థత యేసు కృపలోనే భద్రత
    యేసు రక్తములోనే విమోచన యేసే నడిపించును జీవమారాన

  3. శోధనలెన్నైనా సమస్తమును కోల్పోయిన యోబువంటి విశ్వాసం గమనించుమా
    యధారతకు నిరీక్షించెను రెండంతల దీవెనలు పొందుకొనెను
    సహసము చూపుము సమకూడి జరుగును } 2
    యేసు నందు నిరీక్షించుము } 2

    యేసు నామములోనే స్వస్థత యేసు కృపలోనే భద్రత
    యేసు రక్తములోనే విమోచన యేసే నడిపించును జీవమారాన

    యేసు దేవుని ఆశ్రయించుమా సోదరా సోదరీ ఈ క్షణమే
    విశ్వసించుమా తండ్రిని వేడుమా గొప్పకార్యాలు జరుగును నీ యెదుటే
    స్వస్థత లేక సహాయము లేక సాలిపోయావా

Kavalena yesayya bhahumanamu cheyali కావలెనా యేసయ్య భహుమానము} చేయాలి విలువైన ఉపవాసము


Song no:

కావలెనా యేసయ్య భహుమానము}
చేయాలి విలువైన ఉపవాసము       }॥2॥
మరి సిద్దమవు శ్రీయేసుని ప్రియసంఘమా}       
చిగురించాలి అంజూరపు చెట్టు కొమ్మలా  }॥2॥
                                          ॥కావలెనా॥
             1॰     
నినివే పట్టణము
యెహోవా దృష్టికి ఘోరమాయెను
పాపముతో నిండిపోయెను
సృష్టికర్త యెహోవా యోనాను దర్శించి
నినివే పంపెను
కనికరము చూపించెను
ఘనులేమి అల్పులేమి
నీనెవె దేశపు రాజేమి
పిల్లలేమి పెద్దలేమి ఉపవాసముచేయగా
ఆగింది యెహోవా శాపము }
కురిసింది కరుణావర్షము    }॥2॥                     
                                          ॥కావలెనా॥
            2॰
దేవుని ప్రజలను నశియింపజేయుటకు
దుష్టుడు తలంచెను
కలవరము పుట్టించెను                       
మోర్దుకై వేదనతో
రాజునొద్దకు పంపుట దైవచిత్తమని
ఎస్తేరును సిద్ధపరచెను                   
ఘనులేమి అల్పులేమి
షూషను కోటలో రాణియేమి
పిల్లలేమి పెద్దలేమి ఉపవాసముచేయగా
అణిగింది హామాను గర్వము  }
జరిగింది దేవుని చిత్తము       }॥2॥
                                           ॥కావలెనా॥

Jai Jai yesayya pujyudavu neevayya జై జై జై యేసయ్యా పూజ్యుడవు నీవయ్యా


Song no:

హ్యాప్పీ క్రిస్మస్… మెర్రి క్రిస్మస్…

జై జై జై యేసయ్యా పూజ్యుడవు నీవయ్యా

ఈ లోకానికొచ్చావయ్యా సంతోషం తెచ్చావయ్యా

మాకు సంతోషం తెచ్చావయ్యా (2)

కన్య గర్భమందు నీవు పుట్టావయ్యా

పరిశుద్దునిగా నీవు మా కొరకు వచ్చావయ్యా (2)

పశుల పాకలో పశుల తొట్టిలో పసి బాలుడుగా ఉన్నావయ్యా (2)

హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ (2)        ॥జై జై జై॥

దివినుండి దూత తెచ్చెను ఈ శుభవార్తను

నిశీధి రాత్రియందు ఆ గొల్లలకు (2)

లోక రక్షకుడు జన్మించెనని సంతోషముతో ఆనందముతో (2)

హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ (2)         ॥జై జై జై|