Showing posts with label ఎడ్మండ్ హేమిల్టన్ పియర్స్. Show all posts
Showing posts with label ఎడ్మండ్ హేమిల్టన్ పియర్స్. Show all posts

Sri rakshakundu puttaga naakasha శ్రీ రక్షకుండు పుట్టఁగా నాకాశ సైన్యము

Song no: 129

శ్రీ రక్షకుండు పుట్టఁగా నాకాశ సైన్యము ఇహంబున కేతెంచుచు ఈ పాట పాడెను. ‘పరంబునందు స్వామికి మహా ప్రభావము ఇహంబునందు శాంతిని వ్యాపింపనీయుఁడు’.

ఆ రమ్యమైన గానము ఈ వేళ మ్రోగును సంతుష్టులైన భక్తులు ఆ ధ్వని విందురు ప్రయాసపడు ప్రజల దుఃఖంబు తీరఁగా ఆ శ్రావ్యమైన గానము ఈ వేళ విందురు.

పూర్వంబు దూతగానము భువిన్ వినంబడి రెండువేల వర్షములు గతించిపోయెను భూప్రజలు విరోధులై యుద్ధంబు లాడి యా మనోజ్ఞమైన గానము నలక్ష్యపెట్టిరి.

పాపాత్ములారా, వినుఁడి శ్రీ యేసు ప్రభువు విూ పాపభార మంతయు వహింప వచ్చెను తాపత్రయంబు నంతయుఁ దానే వహించును సంపూర్ణ శాంతి సంపద లను గ్రహించును.

సద్భక్తులు స్తుతించిన ఈ సత్యయుగము ఈ వేళ నే నిజంబుగా సవిూప మాయెను ఆ కాలమందు క్షేమము వ్యాపించుచుండును ఆ దివ్య గాన మందఱు పాడుచు నెప్పుడు.