Showing posts with label SS.Brother's. Show all posts
Showing posts with label SS.Brother's. Show all posts

Chesinavu yenno melulu chupinavu yentho premanu చేసినావు ఎన్నో మేలులు చూపినావు ఎంతో ప్రేమను


Song no:

చేసినావు ఎన్నో మేలులు చూపినావు ఎంతో ప్రేమను
ఎలా మరువగలను నీ ప్రేమను
నీవేనయ్యా నా ప్రాణము నీవేనయ్యా నా సర్వము

శోధనలు వెంటాడగా
సోమ్మసిల్లి పడియుండగా
చెంత చేరినావు సేద దీర్చినావు

పాపములో నేనుండగా
పాడై పోవు చుండగా
లేవనెత్తినావు శుద్ధి చేసినావు

ఆపదలో నేనుండగా
నన్నాదుకున్నావయ్యా
ఆదరించినావు దైర్యమిచ్చినావు

Jeevam na paranam neeve yesayya jeevam na sarvam జీవం నా ప్రాణం నీవే యేసయ్యా జీవం నా సర్వం నీవే యేసయ్యా


Song no:

జీవం నా ప్రాణం నీవే యేసయ్యా
జీవం నా సర్వం నీవే యేసయ్యా
నా కున్న సర్వం నీదే
నాలోన ప్రాణం నీదే

అలలేన్ని నాపై ఎగిసివచ్చినా
అంధకారమే దారిమూసినా
అండనీవై నా కుండగా
భయముండునా
నాకు దిగులుండునా

శోధనలు నన్ను చుట్టుముట్టినా
శత్రువు నాపై చెలరేగి వచ్చినా
ఆశ్రయముగ నీవుండగా
భయముండునా
నాకు దిగులుండునా

Jeevamu neeve pranamu neeve yesayya జీవము నీవే ప్రాణము నీవే యేసయ్యా జీవము నిచ్చిన


Song no:

జీవము నీవే
ప్రాణము నీవే యేసయ్యా
జీవము నిచ్చిన
పరమ తండ్రివి నీవయ్యా
మరణము గెలిచి లేచిన యేసయ్యా
మరణపు ముల్లును
విరిచిన యేసయ్యా
హల్లెలూయా ఆరాధన

ఆదియు అంతము నీవే యేసయ్యా
అన్నిటికి ఆధారము నీవే యేసయ్యా

అన్నింటికి ముందున్నది
నీవే యేసయ్యా
అందరిలో ఉన్నావాడవు
నీవే యేసయ్యా

సత్యము మార్గము నీవే యేసయ్యా
జీవము నా సర్వము
నీవే యేసయ్యా

నీతియు సమాధానము
నీవే యేసయ్యా
రక్షణ స్వస్థత నీలో యేసయ్యా

Devudu thodundaga naku dhigulunduna sri yesu దేవుడు తోడుండగా నాకు దిగులుండునా శ్రీ యేసు


Song no:

దేవుడు తోడుండగా
నాకు దిగులుండునా
శ్రీ యేసు తోడుండగా నాకుభయముండునా
నను నడిపించునది ఆయనే
నను రక్షించునది ఆయనే
నను పోషించునది ఆయనే
నను విడిపించినది ఆయనే

గాఢాంధకార లోయలలో
నేను సంచరించినా
మరణపు అంచులలో
నేను పడియుండగా
తన దుడ్డు కర్ర తన దండము నన్నాదరించును

కన్నీటి కెరటాలలో కృంగి నేనుండగా
కష్టాల తీరంలో
అలలెన్నో కొట్టుచూడగా
తన బాహు బలము నా చెయ్యిపట్టి నన్ను రక్షించును

Deva nee thalampulu nakentho priyamainavi దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి ఊహకు అందనివి


Song no:

దేవా నీ తలంపులు
నాకెంతో ప్రియమైనవి
ఊహకు అందనివి ఉన్నతమైనవి

తల్లి గర్భమున
పిండమునై యుండగా
రూపును దిద్దిన పరమ తండ్రివి
ప్రాణం పోసిన ప్రాణ ప్రియుడవు   పేరు పెట్టి పిలిచిన నా దైవమా

పాప శాపములో నే పడియుండగా
ప్రాణము నిచ్చిన పరిశుద్ధుడవు
నను రక్షించిన ప్రాణనాధుర
నీ సేవకై నిలిపిన జీవనాధుడు

Nannu srujiyinchina na thandrike aradhana నను సృజియించిన నాతండ్రికే ఆరాధన నను రక్షించిన


Song no:

నను సృజియించిన
నాతండ్రికే ఆరాధన
నను రక్షించిన
యేసయ్యాకే ఆరాధన
నను నడిపించే
పరిశుద్ధాత్మునికే ఆరాధన
నను పాలించే
త్రియేక దేవునికే ఆరాధన
ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన

1. మట్టిని తీసాడు
    తన రూపును చేశాడు
    ప్రాణం పోసాడు
    జీవించ మన్నాడు
    ఆ తండ్రికే ఆరాధన...

2. మహిమను విడిచాడు
    మంటి దేహము దాల్చాడు
    ప్రాణం పెట్టాడు
    నిత్య జీవము నిచ్చాడు
    యేసయ్యా కే ఆరాధన...

3. పరిపూర్ణుని చేయుటకై  
    పరిశుద్ధాత్ముడు వచ్చాడు
    అభిషేకించాడు
    నను నడిపించు చున్నాడు
    ఆత్మ దేవునికే ఆరాధన...

Matladumu na prabhuva alakinchuchunnanaya మాట్లాడుము నా ప్రభువా ఆలకించుచున్నానయా


Song no:

మాట్లాడుము నా ప్రభువా ఆలకించుచున్నానయా
నీదు స్వరము వినాలని
నీవలేనే నేను మారాలని
ఆశతో నేనున్నానయా

అలనాడు మోషేతో మాట్లాడితివి
ఆ అగ్నిలో నుండి
వెనుక ముందు ఆవరించి
ముందుకు నడిపితివి

సౌలును దర్శించి
పౌలుగా మార్చితివి
ఆ వెలుగులో నుండి
జీవ కిరీటము పొందుట కొరకై కృపను చూపితివి

Yese na kapari yese na upiri yese na jeevana adhipathi యేసే నా కాపరి యేసే నా ఊపిరి యేసే నా జీవన అధిపతి


Song no:

యేసే నా కాపరి యేసే నా ఊపిరి
యేసే నా జీవన అధిపతి
యేసే నా కాపరి యేసే నా ఊపిరి
యేసే నా జీవన అధిపతి

పచ్చిక బయళ్ళలో పరుండ జేశాడు
శాంతి జలములకు నడిపించుచున్నాడు
నా ప్రాణమునకు సేదదీర్చాడు
తన నీతి మార్గములో నడిపించుచున్నాడు
నిత్య జీవమును నాకు ఇచ్చాడు

గాఢాంధ కారములో వెలుగైయున్నాడు
శత్రువుల యెదుట
విందును నాకిచ్చెను
నూనెతో నా తలనంటి యున్నాడు
బ్రతుకు దినములో
క్షేమము నాకిచ్చెను
అపాయమేదైనను
నా యొద్దకు రానేరాదు

Yehova dhayaludu yesayya krupamayudu యెహోవా దయాళుడు యేసయ్య కృపామయుడు సర్వోన్నతుడా


Song no:

యెహోవా దయాళుడు
యేసయ్య కృపామయుడు
సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడా సమస్తము నీకే నయా

నన్ను ప్రేమించినావు రక్షించినావు కృపచూపినావయా
నా శ్రమలో తోడైయుండి
నన్ను విడిపించి గొప్ప చేసావయ్యా
దీర్ఘాయువు నాకిచ్చావయా
నిరీక్షణ నాలో పుట్టించవయా

నన్ను దర్శించినావు దీవించినావు దయ చూపినావయా
నేను పడియున్న ఊబినుండి
నన్ను లేవనెత్తి శుద్ధి చేసావయా
బండ పైన నన్ను నిలిపావయా
నా అడుగులు స్థిరపరచావయ

Yesayya nee vakyamu nakentho priyamainadhi యేసయ్యా నీ వాక్యము నా కెంతో ప్రియమైనది


Song no:

యేసయ్యా నీ వాక్యము
నా కెంతో ప్రియమైనది
యేసయ్యా నీ మాటలు
నా జిహ్వకు మధురమైనవి
అమూల్యమైనవి అతి శ్రేష్టమైనవి
నేనెంతో కోరదగినవి

కన్నీటితో నే కృంగియుండగా
నీ వాక్యమే నన్నాదరించెను

సొమ్మసిల్లి నే పడియుండగా
నీ మాటలే నాకు బలమునిచ్చెను

Viduvani devudu maruvani dhaivamu vedhaki vacchi pranamicchi విడువని దేవుడు మరువని దైవము వెదకి వచ్చి ప్రాణమిచ్చి


Song no:

విడువని దేవుడు మరువని దైవము
వెదకి వచ్చి ప్రాణమిచ్చి రక్షించెను
తన అర చేతులందు చెక్కుకున్నాడు
తన కనుపాపవలె కాపాడుచున్నాడు

గాఢాంధకారపు లోయలైనను
మరణాంధకారపు బాటలైనను
మనసున జొచ్చి ధైర్యము నిచ్చి
చెయ్యి పట్టి ధరికి చేర్చి
వెలుగులో నడిపే నా దేవుడు

వ్యాధి బాధలు ఎదురైనను
శోధన సమస్యలు వెంటాడినను
హస్తము చాపి బలముతో నింపి
లేవనెత్తి జయముతో నడిపే
సాక్షిగ నిలిపే నా దేవుడు

Saswatham kadhedhi ielalo yedhaina thelusunnanaya శాశ్వతం కాదేది ఇలలో ఏదైనా తెలుసుకున్నానయా ఇప్పుడే యేసయ్యా


Song no:

శాశ్వతం కాదేది ఇలలో ఏదైనా
తెలుసుకున్నానయా
ఇప్పుడే యేసయ్యా
నీ ప్రేమయే శాశ్వతము
నిరతము నన్ను నడుపునది
నీ ప్రేమయే నీ కృపయే
చాలు నాకు యేసయ్యా

ఓడిపోయిన నా బ్రతుకులో జయమునిచ్చినది నీ కృపయే
కృంగియున్న నా బ్రతుకును బలపరిచినది నీ కృపయే

మోడుబారిన నా జీవితమును చిగురింప చేసినది నీ కృపయే
నిష్పలమైన నా జీవితమును ఫలియింప చేసినది నీ కృపయే

Shodhakudosthadu saithan gadu vadu శోధకుడొస్తాడు సైతాన్ గాడు వాడు శోధిస్తునే ఉంటాడు


Song no:

శోధకుడొస్తాడు సైతాన్ గాడు వాడు
శోధిస్తునే ఉంటాడు మనలను శోధిస్తునే వుంటాడు
దేవుడు వస్తాడు బలవంతుడాయన
జయమిస్తునే ఉంటడు
మనకు జయమిస్తునే ఉంటడు

ఆదివారం వచ్చేసరికి
నిన్ను రానియ్యడు వాడు గుడికి
ఆ వారమంతా నీలో
కలిగేది అంతా చింత
ఆ వారమంతా నీకు
మిగిలేది ఎంతో కొంత
దేవుని ఆశీర్వాదం రాకుండ చేసి
కష్టాల పాలు చేయును
నిన్ను నష్టాల పాలు చేయును

ఆల్ నైట్  వచ్చే సరికి
నిన్ను రానియ్యడు ప్రార్ధనకి
భద్రంగ ఇచ్చును చద్ర
వాడు పొడుపోమ్మంటాడు
మొద్దు నిద్ర
ఆ నిద్రే పెద్ద దరిద్రం
పండుబోతుని చేయును
నిను తిండిబోతుని చేయును

పండుగ వచ్చేసరికి పదపదమాంటడు నిను గుడికి
కొట్టమని చెబుతాడు పోజులు కోయమని చెబుతాడు పోతులు
తినుచు త్రాగుచు తందనాలు ఆడి అవతల పడమంటడు
మళ్ళీ పండక్కే రమ్మంటాడు 

Sthuthi geeethame padana ssthuthi aradhana స్తుతి గీతమే పాడనా స్తుతి ఆరాధన చేయనా


Song no:

స్తుతి గీతమే పాడనా
స్తుతి ఆరాధన చేయనా
శ్రీమంతుడనగు షాలేము రాజుకు

బలియు అర్పణ అక్కరలేదని కనికరమునే కోరువాడవని
విరిగిన మనస్సును
నలిగిన హృదయమును
అలక్ష్యము చేయని నాప్రియునికి

మహిమాన్వితుడవు మహోన్నతుడవు
పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు
కృపా సత్య సంపూర్ణునిగా
మా మద్యనివసించుట
మాకై అరుదెంచిన మాప్రభునకు

sadhakalamu nee yandhey na guri nilupuchunnanu సదాకాలము నీ యందే నా గురి నిలుపుచున్నాను


Song no:

సదాకాలము నీ యందే
నా గురి నిలుపుచున్నాను
సర్వోన్నతుని సన్నిదియే
చేరుటయే గురి

ఉన్నవాడవు నీవు అనువాడవు నీవు
లేనివాటిని పిలుచువాడవు
మృతులను సజీవులుగా పిలుచువాడవు పిలుచువాడవు

మొదటి వాడవు నీవు
కడపటి వాడవు
మృతిని గెలిచి లేచినవాడవు
మృతులకు సజీవులకు
తీర్పుతీర్చు వాడవు
తీర్పు తీర్చు వాడవు

Sariyaina nee throvalo nadipinchuma yesayya సరియైన నీ త్రోవలో నడిపించుమా యేసయ్యా


Song no:

సరియైన నీ త్రోవలో
నడిపించుమా యేసయ్యా
నాప్రాణము నీవే నాసర్వము నీవే
నా జీవము నీవే  నా యేసయ్యా

గురిలేని పయనంబులో
గమ్యముగా నీవు నిలిచినావు
అడుగులు తడబడక
నీ అడుగు జాడలో
నను నడుపుము నా యేసయ్యా

సాతాను శోధనలు ఎన్నివచ్చినా
మెలుకువగా ప్రార్ధించే కృపనీయుమా
నా పాదము జారక తొట్రిల్ల నియ్యక
నను నిలుపుమా నా యేసయ్యా

Simhana sinuda yudha gothapu simhama సింహాసనాశీనుడా యూదా గోత్రపు సింహమా


Song no:

సింహాసనాశీనుడా
యూదా గోత్రపు సింహమా
నా స్తుతికి పాత్రుడా
నా హృదయ పాలకా
నిన్నే నిన్నే నిన్నే నిన్నే స్తుతియించెదా
నిన్నే నిన్నే నిన్నే నిన్నే కీర్తించెదా

నీ మాట నా నోట పాటగా
నా బ్రతుకు బాటలో సాగగా
ఆశ్చర్యమే అద్భుతమే

కలవరమే నా మదిలో కదలాడగా కరములెత్తిస్తుతియించగా
కన్నీటి నీ తుడిచితివే 

Ninnu vidichi pogalana deva nithya నిన్ను విడిచి పోగలనా దేవా నిత్య జీవపు


Song no:

నిన్ను విడిచి పోగలనా దేవా
నిత్య జీవపు ఊటవు నీవేగా
నిరతముండు నీ కరుణా నిత్యముండు నీ ప్రేమా

అపవాదికి లోనై అందుడనేనైతి
నీ మాటను మరచితిని దేవా
నే నిన్ను మరచినా
నన్ను మరువలేనయ్యా
నే నిన్ను విడచినా
నన్ను విడువలేదయ్యా

కన్న ప్రేమ కన్న మీనమైన ప్రేమ చూపి
క్షమా ప్రేమ చూపిన యేసయ్యా
శాశ్వత ప్రేమతో నీవు నన్ను ప్రేమించి
విడువక నా యెడల
కృప చూపినావయ్యా

Kruthagnatha sthuthulu ne chellinchalani కృతజ్ఞతాస్తుతులు నే చెల్లించాలని


Song no:

కృతజ్ఞతాస్తుతులు
నే చెల్లించాలని
కృతజ్ఞతా అర్పణలు
నే అర్పించాలని
ఆశతో....నీ సన్నిధికి
ఆశతో... నీ సన్నిధికి వచ్చితి యేసయ్యా

ఏమి లేదు నాయందు ఎంచి చూడ యేసయ్యా
ఏమివ్వగలనయ నా జీవితమర్పింతు

నా జీవితానికి ఆశ్రయమైనావయా
ఆపదలో తోడుండి ఆప్తుడవైనపయా

ఖాళీ పాత్రయైన నన్ను కరుణించినావయా
మట్టి ఘటమునైన నన్ను మహిమతో నింపావయ

Karuna siluda kanikara hrudhayuda karuninchi కరుణాశీలుడా కనికర హృదయుడా కరుణించి


Song no:

కరుణాశీలుడా కనికర హృదయుడా
కరుణించి నను బ్రోవగా
కరములు చాపితిని

నిన్న నేడు ఏకరీతిగ ఉన్నావాడవని
నేడు నిరంతరం
మార్పులేని దేవుడని
మార్పులేని దేవుడ నీవని
నీకే స్తోత్రము చెల్లింతు మనసారా

మోషే చేతులు ఎత్తిన తోడనే
శత్రు సమూహము ఓడిపోయెను
జయమిచ్చిన జయశీలుండ
నీకే స్తోత్రము చెల్లింతు మనసారా