నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా
నిత్య జీవార్థమైనవి నీ శాసనములు (2)
వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా
నీ ప్రియమైన స్వాస్థ్యమును
రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను
నీ రాజ్య దండముతో || నీతి ||
ప్రతి వాగ్ధానము నా కొరకేనని
ప్రతి స్థలమందు – నా తోడై కాపాడుచున్నావు నీవు (2)
నిత్యమైన కృపతో నను బలపరచి
ఘనతను దీర్గాయువును దయచేయువాడవు (2) || నీతి ||
పరిమళ వాసనగ నేనుండుటకు
పరిశుద్ధ తైలముతో – నన్నభిషేకించి యున్నావు నీవు (2)
ప్రగతి పథములో నను నడిపించి
ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు (2) || నీతి ||
నిత్య సీయోనులో నీతో నిలుచుటకు
నిత్య నిబంధనను – నాతో స్థిరపరచుచున్నావు నీవు (2)
మహిమ కలిగిన పాత్రగ ఉండుటకు
ప్రజ్ఞ వివేకములతో నను నింపువాడవు (2) || నీతి ||
అల్ఫా ఒమేగా అయినా మహిమాన్వితుడా
అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రర్హుడా }2
రాత్రిలో కాంతి కిరణమా పగటి లో కృపానిలయమా
ముదిమి వరకు నన్నాదరించె సత్యవాక్యామా } 1
నాతో స్నేహామై నా సౌక్య మై నను నదిపించె నా ఏసయ్యా } 2 || అల్ఫా ||
కనికర పూర్ణుడా నీ కృప బాహుల్యమే
ఉన్నతముగా నిను ఆరాదించుటకు
అనుక్షనమున నీ ముఖ కాంతిలో నిలిపి
నూతన వసంత ములో చేర్చెను } 2
జీవించెద నీ కొరకే హర్షించెద నీ లోనే } 2 || అల్ఫా ||
తేజోమాయుడా నీదివ్య సంకల్పమే
ఆర్చర్యకమైన వెలుగు లో నడుపుటకు
ఆశ నిరాశ ల వలయాలు తప్పించి
అగ్నిజ్వాలగా ననుచేసెను } 2
నా స్తుతి కీర్తన నీవె స్తుతి ఆరాదన నీకే } 2 || అల్ఫా ||
నిజ స్నేహితుడా నీ స్నేహ మాదుర్యమే
శుభ సూచనగా నను నిలుపుటకు
అంతు లేని ఆగాదాలు దాటింఛి
అందని శిఖరాలు ఎక్కించెను } 2
నా చెలిమి నీ తోనే నా కలిమి నీ లోనే } || అల్ఫా ||
దయగల హృదయుడవు
నీ స్వస్త్యమును ఎన్నడు ఎడబాయవు
ఎడారిలో ఊటలను
జలరాసులలో త్రోవను ఏర్పరచువాడవు
సర్వలోకము నీకు నమస్కరించి
నిన్ను కొనియాడును
"దయగల"
సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవమార్గము
సారము వెదజల్లు నీ జాడలె నాకు జీవన గమనము 2
శ్రేష్టమైన ఉపదేశముతో జీవముగలిగిన సంఘములో
నింపుచున్నావు దీవెనలతో నను నడుపుచున్నావు సమృద్దితో 2
పరిశుద్దుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము
పరిశుద్దుల సహవాసమై నాకు క్షేమధారాము 2
విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా
విసుగక నిత్యము ప్రార్ధింతును నిను నిశ్చలమైన నిరీక్షణతో 2
పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము
పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము 2
ఆశ్రయమైనది నీ నామమే సజీవమైనది నీ త్యాగమే
ఆరాధింతును నా యేసయ్యా నిను నిత్యము కీర్తించి ఘనపరతును
సృష్టికర్తవైన యెహోవా.... నీ చేతి పనియైన నాపై ఎందుకింత ప్రేమ
మంటికి రూపమిచ్చినావు....మహిమలో స్ధానమిచ్చినావు....
నాలో. . . . నిన్ను చూసావు....నీలో. . . . నన్ను దాచావు....
నిస్వార్ధమైన నీ ప్రేమమరణము కంటే బలమైనది నీప్రేమ || సృష్టికర్తవైన ||
ఏ కాంతిలేని నిశిధిలోఏ తోడు లేని విషాదపు విధులలో
ఎన్నో అపాయపు అంచులలోనన్నాదుకున్న నా కన్నాతండ్రివి !!2!!
యేసయ్యా నను అనాధగ విడువక
నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి !!2!! || సృష్టికర్తవైన ||
నిస్సారమైన నా జీవితములోనిట్టూర్పులే నను దినమెల్ల వేదించగా
నశించిపోతున్న నన్ను వెదకి వచ్చినన్నాకర్షించిన ప్రేమ మూర్తివి !!2!!
యేసయ్యా నను కృపతో బలపరచి
ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి !!2!! || సృష్టికర్తవైన ||