Showing posts with label Aananda Swaraalu. Show all posts
Showing posts with label Aananda Swaraalu. Show all posts

Muddhu muripala chinnari nanna ముద్దు మురిపాల చిన్నారి నాన్నా

Song no: 90

    ముద్దు మురిపాల చిన్నారి నాన్నా-సద్దు చేయకే నా చిట్టికన్నా
    ఈ మాట వింటే మదిని దాచుకుంటే
    నీ జీవితంలో సిరుల పంటే - ఆనందం కలకాలం నీవెంటే
    జోలాలీ లాలీ జోలాలీ (2)

  1. తల్లిదండ్రులను గౌరవించి - తనవారినెల్లను ప్రేమించి
    శత్రువులను సయితము క్షమించి - పరిచారకుడుగా జీవించి
    దేవాదిదేవుడే అత్యంత దీనుడై
    ఎంతో తగ్గించుకొని మాదిరి చూపించెను
    ఆ యేసుని అడుగులలో నడవాలి నిరతం
    ఆ క్రీస్తుని బోధలలో పెరగాలి సతతం - జోలాలీ లాలీ జోలాలీ (2)

  2. దేవుని ఉపదేశమును మరువక-దయను సత్యమునెన్నడు విడువక
    బుద్ది వివేచనకై వెదకిన - భయభక్తులు యేసునియందుంచిన
    సుఖజీవము కలిగి ధరలో జీవింతువు
    దేవుని దృష్టిలో నీవు కృప సంపాదింతువు
    నిజమైన జ్ఞానానికి యేసే ఆధారం
    పరలోకం చేరేందుకు ఏకైకమార్గం - జోలాలీ లాలీ జోలాలీ (2)

Neevunna na gruhamu anandha nilayamu నీవున్న నా గృహము ఆనంద నిలయము

Song no:


నీవున్ననా గృహము ఆనంద నిలయము
నాకున్న సర్వము ప్రభు నీవిచ్చిన స్వాస్థ్యము
ప్రభు స్తుతియించెదన్ నిను ప్రణుతించెదన్ నేను నా ఇంటివారితో
||నీవున్న||
1.నీవే గృహమును కట్టనిచో పనివారి ప్రయాస వ్యర్థమే
నీవే కరుణ చూపనిచో అనుభవించుట అసాధ్యమే
||ప్రభు||
2.నీవే కావలి కాయనిచో మేల్కొనియుండుట వ్యర్థమే
నీవే తాలిమి చూపనిచో జీవించుట ఇల అసాధ్యమే
||ప్రభు||
3.నీవే కృపగల దేవుడవు మేలులతో తృప్తిపరచెదవు
నీవే సర్వసమర్ధుడవు సమృద్దితో నన్ను నింపెదవు
||ప్రభు||