Showing posts with label Nyayadhipathi Ministries. Show all posts
Showing posts with label Nyayadhipathi Ministries. Show all posts

Nithyamaina mahimanu veedi kotla నిత్యమైన మహిమను వీడి కోట్ల

Song no:
HD
    నిత్యమైన మహిమను వీడి - కోట్ల దూత గణములనొదిలి
    నీతిని స్థాపించుటకు - దివి నుండి భువికి వచ్చెను } 2
    భువి నడిబొడ్డున - బేత్లెహేము పురి గడ్డపై
    క్రీస్తు యేసను నరునిగా - మన రాజు జన్మించెను } 2
    హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - మెర్రి మెర్రి క్రిస్మస్
    హ్యాపీ మెర్రి క్రిస్మస్ - హ్యాపీ మెర్రి క్రిస్మస్ || నిత్యమైన ||

  1. దీనులకు రక్షణ వస్త్రము - కప్పు రక్షకుడు
    మరణ ఛాయ నుండి - గొప్ప వెలుగుకు నడిపే మన నాయకుడు } 2
    మహా సంతోషకరమైన - సువర్తమానమును
    దూతలచేత పంపెను - పొలములోని గొల్లలకు } 2

    హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - మెర్రి మెర్రి క్రిస్మస్
    హ్యాపీ మెర్రి క్రిస్మస్ - హ్యాపీ మెర్రి క్రిస్మస్ || నిత్యమైన ||

  2. తూర్పు దేశ జ్ఞానులను సహితము - పిలిచినవాడు
    రాజరికపు పాలనకై రాజులను - సిద్ధపరిచే మన రారాజు } 2
    అత్యానందభరితమైన - క్షణములను చూచుటకు
    నక్షత్రముచే నడిపెను - యూదయ దేశపు రాజుయొద్దకు } 2

    హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - మెర్రి మెర్రి క్రిస్మస్
    హ్యాపీ మెర్రి క్రిస్మస్ - హ్యాపీ మెర్రి క్రిస్మస్ || నిత్యమైన ||

  3. నశించినవారిని సహితము - వెదకి పిలుచుటకు
    దివి నుండి భువికి తండ్రి చేత పంపబడెనే - మన రక్షకుడు } 2
    ఎందరో పాపులను క్షమియించి - పాపుల స్నేహితుడాయెను
    జక్కయ్యలో మార్పు - ఆ దినమే ఆరంభమాయెను } 2

    హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - మెర్రి మెర్రి క్రిస్మస్
    హ్యాపీ మెర్రి క్రిస్మస్ - హ్యాపీ మెర్రి క్రిస్మస్ || నిత్యమైన ||

Aashala valayamlo lokabatalo chikkina ఆశల వలయంలో లోకబాటలో చిక్కిన

Song no:
HD
    ఆశల వలయంలో లోకబాటలో చిక్కిన ఓమనిషి నీ గతి ఏమౌనో } 2
    ఏ క్షణము నీదికాదు ఈ సమయము నీతో రాదు } 2
    యేసు నిన్ను పిలచుచున్నాడు తన యొద్దకు రమ్మని } 2
    ఆశల వలయంలో పాప బ్రతుకులో చిక్కిన ఓమనిషి నీ గతి ఏమౌనో

  1. కులం నాది మతం నాదని బావమెందుకు
    బలం నాది ధనం ఉందని గర్వమెందుకు } 2
    ప్రాణం వున్నా నీ దేహము రేపు మట్టి బొమ్మ రా
    మట్టి బొమ్మ చివరి మజిలి ఎన్నటికైనా మట్టిలోకిరా } 2
    స్నేహమా..  స్నేహమా..  స్నేహమా..  గమనించుమా
    నేస్తమా..  నేస్తమా..  నేస్తమా..  ఆలోచించుమా } 2
    ఆశల వలయంలో పాప బ్రతుకులో చిక్కిన ఓమనిషి నీ గతి ఏమౌనో

  2. అందం ఉంది జ్ఞానం వుందని బావమెందుకు
    దేవుడే లేడు నేనే దేవున్నని గర్వమెందుకు } 2
    అందమంతా చీకిపోవును ఎన్నటికైనా
    నీ యవ్వన అందమంతా ఎప్పటికైనా మట్టిపాలురా } 2
    స్నేహమా.. స్నేహమా.. స్నేహమా.. గమనించుమా
    నేస్తమా.. నేస్తమా.. నేస్తమా.. ఆలోచించుమా } 2
    ఆశల వలయంలో పాప బ్రతుకులో చిక్కిన ఓమనిషి నీ గతి ఏమౌనో

  3. పాపివైన నీ కోసమే యేసు వచ్చెను
    తన రక్తమంతయు ధారపోసేను నీ కోసమే } 2
    ఆ రక్తంలో కడగబడితే పరలోకమేరా
    పరిశుద్ద సిలువ రక్తమును నిర్లక్ష్య పరిచితే అగ్ని గుండమురా } 2
    సోదరా సహోదరి  సోదరా గమనించుమా 
    సోదరా సహోదరి సోదరా ఆలోచించుమా } 2
    ఆశల వలయంలో పాప బ్రతుకులో చిక్కిన ఓమనిషి నీ గతి ఏమౌనో || ఆశల వలయంలో లోక ||
Image result for RwV0cLhBmok