Showing posts with label Jushti. Show all posts
Showing posts with label Jushti. Show all posts

Vey vey vey mundhadugey kastamaina kanniti వెయ్ వెయ్ వెయ్ ముందడుగేయ్ కష్టమైన కన్నీటి

వెయ్ వెయ్ వెయ్ ముందడుగేయ్
కష్టమైన - కన్నీటి భారమైన
నిందలైన  - ఇబ్బందులెదురైన
చీకటైన - ఎక్కుపెట్టిన బాణమైన
క్రీస్తు నామమున   - నువు ముందడుగేయ్
వెయ్ వెయ్ వెయ్ ముందడుగేయ్
వెయ్ వెయ్ వెయ్ ముందడుగేయ్

1. ఎప్పుడెప్పుడు ఉదయిస్తుందని - అంధకారంలో నలుగుటకన్నా
యేసుని  ప్రేమ జ్యోతిలో - స్వామి పాదాల గురుతుల్లో
నీ అడుగేస్తూ - యేసు  వైపే చూస్తూ
వెనుదిరిగీ  చూడక - విశ్వాసం వీడక

2. సిరులయందే నిత్య ఆనందముందని   - ఎండమావికై పరుగులకన్నా
యేసుని స్నేహ బంధములో- స్వామి సన్మార్గములో
నీ అడుగేస్తూ - యేసు తోనే ఉంటూ
అతిశయమ్ముతో- పరమును చేరుకో

Kammani bahu kammani challani athi challani కమ్మని బహుకమ్మనీ - చల్లని అతి చల్లనీ


యేసు నీ ప్రేమామృతం
జుంటె తేనె కన్నా మధురం - సర్వ జనులకు సుకృతం
యేసు నీ ప్రేమామృతం

1. ఆశ చూపెను లోకం - మలినమాయెను నా జీవితం
యేసూ నీదు ప్రేమ - దయ చూపెను దీనురాలి పైన
వెలిగెను నాలో నీ ఆత్మ దీపము - కడిగిన ముత్యముగా అయ్యాను నేను

2. నా కురులతో పరిమళమ్ములతో చేసెద నీదు పాద సేవ
నా గుండె గుడిలో కొలువైయున్న నీకు చేసెద నేను మధుర సేవ
ఆరాధింతును నిన్ను అనుదినము - జీవింతును నీకై అనుక్షణము

Keerthinthu nee namamun na prabhuva కీర్తింతు నీ నామమున్ నా ప్రభువా

Song no:

    కీర్తింతు నీ నామమున్ - నా ప్రభువా - సన్నుతింతు నీ నామమున్ } 2
    మనసారా ఎల్లప్పుడూ క్రొత్త గీతముతో నిను నే కొనియాడెదన్ } 2
    కీర్తింతు నీ నామమున్ - నా ప్రభువా - సన్నుతింతు నీ నామమున్ } 2


  1. ప్రతి ఉదయం నీ స్తుతిగానం - దినమంతయు నీ ధ్యానం } 2
    ప్రతి కార్యం నీ మహిమార్థం - సంధ్య వేళలో నీ స్తోత్రగీతం } 2

  2. నీవు చేసిన మేలులన్ లెక్కిస్తూ - వేలాది స్థుతులన్ చెల్లిస్తూ } 2
    ఎనలేని నీ ప్రేమను వర్ణిస్తూ - నిన్నే నేను ఆరాధిస్తూ } 2

  3. అమూల్యమైనదీ నీ నామం - ఇలలో శ్రేష్ఠమైనదీ నీ నామం } 2
    ఉన్నతమైనదీ నీ నామం - నాకై నిలచిన మోక్ష మార్గం } 2

Dhoshivaa prabhu nuvu dhoshivaa దోషివా .... ప్రభూ.... నువు దోషివా

Song no: 
సర్వమానవ పాపపరిహారార్థమై సిలువలో వ్రేలాడిన శ్రీ యేసునాధా

దోషివా .... ప్రభూ.... నువు దోషివా
నీ విధేయతకు నా అవిధేయతకు
మధ్యలో నలిగి, వ్రేలాడిన నిర్దోషివా
దోషివా .... ప్రభూ.... నువు దోషివా

1. ఘోరంబుగా నే చేసిన నేరాలకు నువు పొందిన మరణ శిక్ష
నే నడచిన వక్ర మార్గాలకు నువు పొందిన సిలువ యాతన (2)
కలువరి గిరిలో ఆ ఘోర యాత్ర (2) నే పొందిన రక్షణా పాత్ర

2. నే వేసిన తప్పటడుగులకు - నీవు కార్చిన రక్త పు మడుగులూ
నే చేసిన కపటంబులకు - నీవు పొందిన కొరడా దెబ్బలు (2)
సంపూర్ణ సిద్ది నొసగితివే నాకు (2) - ప్రేమించితివే నన్ను

3. తులువలలో ఓ తులువగా నున్న నా పై నీ దయగల చూపు
పరలోకములో నీతో నుండ భాగ్యంబును నాకు నిచ్చినదే (2)
తుది వరకు నీ దివ్య ప్రేమను పంచ(2) - నీ తుది శ్వాస వీడనంటివే

Chiru dhivvela velugulatho nee dhivya kanthulatho చిరు దివ్వెల వెలుగులతో... నీ దివ్య కాంతులతో


నను బ్రోవ రావయ్యా .... కంటిపాపలా  నను కాన రావయ్యా ...              (2)

యేసయ్యా... యేసయ్యా...
యేసయ్యా...యేసయ్యా...
నను బ్రోవ రావయ్యా... నను కాన రావయ్యా (2)

 లోయలో ... క్రమ్మిన చీకటిలో
 ఇలలో .... నిరాశల వెల్లువలో                      (2)

1. దహించివేస్తున్న అవమానము - కరువైపోయిన సమాధానము (2)
పగిలిన హృదయము - కన్నీటి ధారల సంద్రము (2)
ఎగసి పడుతున్న కెరటము - కానరాని గమ్యము (2)

2. ఏకమైన  లోకము - వేధిస్తున్న విరోధము
దూరమౌతున్న బంధము - తాళలేను  నరకము (2)
ఈదలేని  ప్రవాహము - చేరువైన అగాధము (4)

Loka kalyanam loka kalyanam లోక కళ్యాణం .... లోక కళ్యాణం...


శాంతి సమాధాన సమాహారం
ప్రేమసువార్తకు మానవ రూపం
శోధన నిరీక్షణకు  సమాధానం
క్రీస్తుని జననం ... ప్రభు యేసుని ఉదయం

1. జగతికై జన్మించె దేవుడై - బెత్లేహేములో బాలుడై
పాకలో పుట్టె పుణ్యుడై  - పరమ పావనుడై
ధరలో వెలసే దీనుడై  (2)  నిత్య జీవ మార్గమై

ఢంకానాదముతో స్తుతిగానముతో - వేనోళ్ళ చాటుదాము రండి ...  
యేసు మనకై పుట్టాడని - దివి నుండి దిగి వచ్చాడని
లోక రక్షకుడు యేసే అని .... రాజాది రాజు క్రీస్తే అని
తాన తాన తందనాన
హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్

2. కల్వరి సిలువలో బలియాగము  -  చేసిన గొప్ప త్యాగము 
మనకై  కార్చిన రక్తము  - దహించివేసెను ప్రతి పాపము
 సర్వలోక విమోచనకై   (2) జరిగిన  ప్రాణార్పనము 

ఢంకానాదముతో స్తుతిగానముతో - వేనోళ్ళ చాటుదాము రండి ...  
యేసు తిరిగి లేచాడని - మనలో మళ్లీ పుట్టాడని
లోక రక్షకుడు యేసే అని .... రాజాది రాజు క్రీస్తే అని
తాన తాన తందనాన
మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్

O naavika o naavika sramalalo sramika ఓ నావికా.... ఓ నావికా.... శ్రమలలో శ్రామికా...


నావికా....   నావికా.... శ్రమలలో శ్రామికా....

ఊసు వింటివా ... వింత గంటివా ...
యేసు సామి ఊసు నీవు వింటివా

హైలెస్సో ... హైలెస్సా
హైలెస్సో ... హైలెస్సా

1. వలేసావు రాతిరంతా  ... ధార పోసావు కష్టమంతా ... (2)
చిక్కలేదు చేప ఒక్కటైనా ... దక్కలేదు ఫలము కొంతైనా (2)

అడుగడుగో యేసు వచ్చెనయ్యా
వరాలెన్నో నీకై తెచ్చెనయ్యా

నింపాడు నీ నావ ... అద్భుత రీతితో ...
తృప్తిపరిచె నీ బ్రతుకు... గొప్ప మేళ్ళతో... 
వెంబడించు యేసును... పూర్ణ శక్తితో ...

యేసే   జగతికి.... సర్వాధికారి...
యేసే నీ నావకి....  చూపించు దారి..
చేస్తాడు నిన్ను.... అసలైన జాలరి   
మనుష్యుల పట్టే జాలరి
 
2. విరిగి నలిగిన మనస్సుతో ... చేసావు నీ సమరం
శయనించక, ఎడతెగక ... ఈదావు   భవసాగరం (2)

అడుగడుగో యేసు వచ్చెనయ్యా
వరాలెన్నో నీకై తెచ్చెనయ్యా

కరుణించాడు నిన్ను ... చల్లని చూపుతో
నిర్మలయ్యే నీ బ్రతుకు ... యేసుని ప్రేమతో
వెంబడించు యేసును... పూర్ణ శక్తితో ...

యేసే   జగతికి... సర్వాధికారి...
యేసే నీ నావకి...  చూపించు దారి
చేస్తాడు నిన్ను... అసలైన జాలరి 
మనుష్యుల పట్టే జాలరి

Margam neeve sathyam neeve jeevam neeve neeve yesu మార్గం నీవే సత్యం నీవే జీవం నీవే నీవే యేసు


నా మార్గం నీవే , నా సత్యం నీవే , నా జీవం నీవే ... నీవే యేసు
నా శ్వాసలోని ఊపిరి నీవే
నా గుండె చేసే చప్పుడు నీవే
నీవే యేసు ... నీవే యేసు ... నీవే యేసు ... నీవే ప్రభూ

1. అనామకుడనైన నన్ను పేరు పెట్టి పిలచితివీ - శిలనైయున్న నాకు సిలువ విలువ నిచ్చితివీ
తండ్రి తనయా .... శుద్ధాత్మా  ...
వందనం ... వందనం...
వందనం ... ప్రభు వందనం

2. తండ్రి తనయునిగా నా తండ్రివైతివీ - నీ రాజ్యవారసునిగా నన్ను హెచ్చించితివీ
తండ్రి తనయా .... శుద్ధాత్మా  ... 
వందనం ... వందనం ...
వందనం ... ప్రభు వందనం 

3. నాలో నీవు నీలో నేను జ్యోతి వోలె - నా జీవితములో నీవు హరివిల్లు వోలె
తండ్రి తనయా .... శుద్ధాత్మా  ... 
వందనం ... వందనం ...
వందనం ... ప్రభు వందనం