Showing posts with label A.R Stevenson lyrics. Show all posts
Showing posts with label A.R Stevenson lyrics. Show all posts

Nee katakshamu napai chupinchavu నీ కటాక్షము నాపై చూపించినావు

నీ కటాక్షము నాపై చూపించినావు
నా ఆయుష్కాలము దయతో పొడిగించినావు
సహాయము చేసినావు - ఎబినెజరై ఇంతవరకు
1.కలిమి లేమి దుఖములలో - కరువు వ్యాధి శోధనలలో
నాతో గడిపావు - ఆదరించావు - ఎబినెజరై ఇంతవరకు
2.ఎడతెగని ప్రయానములో - ఎదురైనా ప్రమాదములో
ముందు నడిచావు - క్షేమమిచ్చావు - ఎబినెజరై ఇంతవరకు
3.శత్రువుల పన్నాగములలో - పడద్రోయు సన్నాహములలో
వెంట నిలిచావు - ధైర్యమిచ్చావు - ఎబినెజరై ఇంతవరకు


Shiramu vanchi pujinchedham Lyrics


శిరము వంచి పూజించెదం - కరములెత్తి ప్రార్ధించెదం
పరమునకు కొనిపోవాలని - ధరకు వచ్చిన రారాజుని
అ.ప : హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా
1. పాపాన్ని శుద్ధిచేయాలని - శాపభారం మోయాలని
రక్షకుడిగా వచ్చిన - మహిమగల రారాజుని
2. మధ్య గోడను కుల్చాలని - తండ్రితో తిరిగి చేర్చాలని
శాంతిదాతగా వచ్చిన - రాజులకు రారాజువని
3. కీడునుండి మళ్లించాలని - దోశఋనమును చెల్లించాలని
గొఱ్ఱేపిల్లగా వచ్చిన - రాజులకు రారాజుని


O nesthama ee shubhavartha Lyrics


ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా
నిను ప్రేమించేవారొకరున్నరనే వాస్తవం తెలియునా
నిను రక్షించువాడు యేసయ్యేననే సత్యం తెలియునా
1. నీవు నమ్మినవారే మోసంతో నీ గుండెనే చీల్చినా
నీ స్వంతజనులే నీ ఆశల మేడలు అన్నియు కూల్చినా
ఊహించనివి జరిగినా - అవమానం మిగిలినా
నిను ఓదార్చేవారొకరున్నరనే వాస్తవం తెలియునా
నీ స్థితి మార్చువాడు యేసయ్యేననే సత్యం తెలియునా
2. నీ కష్టార్జితము అన్యాయము చేయువారికే దక్కినా
నీకున్న స్వాస్థ్యము దోపిడిదారుల చేతికే చిక్కినా
ఉద్యోగమే ఊడినా - వ్యాపారంలో ఓడినా
నిను ఓదార్చేవారొకరున్నరనే వాస్తవం తెలియునా
నీ స్థితి మార్చువాడు యేసయ్యేననే సత్యం తెలియునా


Nee krupa naku chalunu Lyrics


నీ కృప నాకు చాలును- వేరేమి నే కోరను
బలహీనతలోనైనను నీశక్తి పరిపూర్ణమగును
అ.ప: నీలోనే సంతోషము నీవే నా అతిశయము
1 యేసు నీ కృప వాస్తవము నా నమ్మికకు ఆధారము
భారము పెరుగుతుఉన్నా ఆపద త్వరపెడుతున్నా
నీ కృప నాకు చాలును
2 యేసు నీ కృప శాశ్వతము నా రక్షణకు కారణము
శత్రువు తరుముతుఉన్నా మిత్రులు పగబడుతున్నా
నీ కృప నాకు చాలును
3 యేసు నీ కృప అనంతము నా కీర్తనకు ప్రేరణము
హృదయము పగులుతుఉన్నా నిదురే కరువౌతున్నా
నీ కృప నాకు చాలును


Kanulu therupumaya Lyrics


కనులు తెరవుమయా నీ క్రియలు చూచునట్లు
బయలుపరచకుంటే అర్ధమగుట ఎట్లు
అ.ప: సిద్ధమైనవన్నీ అనుగ్రహింపనీయుము
దాచబడినమేలు అనుగ్రహించి కాయుము
1. సమీపాన ఉన్న నీ సహాయము
సమయోచితమైన గోప్పజ్ఞానము
కనుగొని బలమొందనీయుము
కలవరపడకుండ కాయుము
2. ఆవరించియున్న అగ్నిస్తంభము
ప్రతిశోధననుండి కాయు హస్తము
కనుగొని జయమొందనీయుము
వెనుకకు పడకుండ కాయుము
3. కాచుకొనియున్న నీదు కోపము
అవిధేయతనుండి వచ్చు శాపము
కనుగొని భయమొందనీయుము
అతిశయపడకుండ కాయుము

Nee vakku vinipimchumayya Lyrics


నీ వాక్కు వినిపించుమయ్యా
నేత్రాలు తెరిపించుమయ్యా
నీ ముఖమును నాకుచూపుము
నీ మహిమకు నన్ను మార్చుము
1 నీతట్టు చూడగా వెలుగు కలుగును
ముఖమునందు సిగ్గు కానరాకపోవును
నీ ముఖదర్శనమే సంతోషమిచ్చును
నీ కటాక్షమే నన్ను విమోచించును
2 నీవైపు తిరుగగా ముసుగు తొలగును
ముఖములందు గొప్పమహిమ ప్రతిఫలించును
నీ ముఖకాంతియే నాకు విజయమిచ్చును
నీ హస్తమే నన్ను రక్షించును


Cheyyadhagina manchedhaina Lyrics


చెయ్యదగిన మంచేదైనా - చెయ్యకుండా వదిలిందైనా
చేయపూనుకో ఈ క్షణమైనా
గుర్తించు బాధ్యత నేడైనా - సాధించు ఆత్మలు కొన్నైనా
1. ఎదుటివాడు వెళ్తూ ఉన్న దారికి అడ్డంగా ఉన్న
రాయుని తొలగించకుంటే ఎలా
నీలో బలముండి కూడా మనసు లేకపోతే ఎలా
తిరిగి రాదు అవకాశం మరల
2. ఎదుటివాడు బాధలో ఉన్న హృదయవేదన కలిగున్నా
ఆప్యాయత చూపకుంటే ఎలా
ఆదరణ వాక్యమైన పలకలేకపోతే ఎలా
తిరిగి రాదు అవకాశం మరల
3. ఎదుటివాడు లేమిలో ఉన్న నీకు సమృద్ధిగా ఉన్నా
జాలిని చుపించకుంటే ఎలా
చిన్నపాటి త్యాగమైనా చేయలేకపోతే ఎలా
తిరిగి రాదు అవకాశం మరల
4. ఎదుటివాడు అన్యుడైయున్న నాశనమునకు పోతున్నా
భారం కలిగుండకుంటే ఎలా
సువార్తను కొందరికైనా పంచలేకపోతే ఎలా
తిరిగి రాదు అవకాశం మరల


Neevundu chotuna Lyrics


నీవుండు చోటున నేనుండులాగున
నన్ను కొనిపోవుటకు రానున్న యేసయ్యా
అ.ప: మార్గమైయున్న నీ ద్వారా తప్ప
తండ్రియోద్దకు ఎవరూ చేరనే లేరయ్యా
1. తండ్రి నీలో ఉండి తనక్రియలు చేయుచుండెను
నిను నమ్మి నేను కూడా గోప్పపనులు చేయగలను
2. తండ్రి ఇంటిలో ఎన్నో నివాసములు కలవు
నా కొరకు స్థలమును నీవు సిద్ధపరచుచున్నావు
3. దాసుడని నన్ను పిలువక స్నేహితుడనన్నావు
నీ పక్కనే కూర్చుండే ధన్యతను గ్రహించావు
4. నీ నామమున ఏది అడిగిన చేస్తావు
సత్యమగు ఆత్మా ద్వారా నన్ను ఆదరిస్తావు


Nee sakalpamlo Lyrics


నీ సంకల్పంలో నేనున్నందున
నను పిలిచి స్వీకరించిన నా దేవా
నన్ను ముందుగా నిర్ణయుంచి
 నీయందు స్వాస్థ్యముగా నన్నేర్పరచి
సమస్తము నామేలుకై జరిగించుచున్నావా
1. తరతరములకు ఉండును నీ సంకల్పములు
సదాకాలము నిలుచును నీ ఆలోచనలు
నిను దేవుడుగా గల జనులు ధన్యులు
పూర్ణ మనస్సుతో నిను సేవించెదను
నిను ప్రేమించెదను - నీ రూపం పొందెదను
2. ఎరిగినవాడవు నీవు మా సంకల్పములు
పరిశోధించి చూచెదవు మా ఆలోచనలు
నిను వెదకినయెడల ప్రత్యక్షమౌదువు
పూర్ణ మనస్సుతో నిను సేవించెదను
నిను ప్రేమించెదను - నీ రూపం పొందెదను
3. నశించిపోవును ఎపుడూ రాజుల సంకల్పములు
వ్యర్ధపరచెదవు నీవు అన్యుల ఆలోచనలు
శరణాగతులకు ధైర్యమిచ్చెదవు పూర్ణ మనస్సుతో నిను సేవించెదను
నిను ప్రేమించెదను - నీ రూపం పొందెదను


Nee visthene yedhaina Lyrics


నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది
నీ చేతి నుండే అన్నీ పొందేది
నీ ఆశీర్వాదమే ఐశ్వర్యంమిచ్చేది
మాకు జీవం ఘనత ఇచ్చేది
1.నీవు క్షమియిస్తే కదా - పాపం పరిహారం అయ్యేద
నీవు బలమిస్తే కదా - శత్రువులపైన విజయం దక్కేది
2.నీవు శేలవిస్తే కదా - క్షేమం సంతోషం దక్కేది
నీవు కరుణిస్తే కదా - కష్టమునకు తగ్గ ఫలితం దక్కేది
3.నీవు వరమిస్తే కదా - సంఘం ఉపయోగం పొందేది
నీవు నడిపిస్తే కదా - కాలు జారకుండా గమ్యం చేరేది


Asrayadhurgama Lyrics


ఆశ్రయదుర్గమా - నా క్షేమాధారమా
సైన్యములకు అధిపతియైన నా దైవమా
అ.ప: ప్రార్ధన వినుమా - స్తుతులను గైకొనుమా
1. నిను ప్రేమించే నీ పిల్లలకు అతిశయ కారణమా
నా శ్రదినమున బాసటయైన రక్షణ కేడెమా
2. నిను ప్రార్ధించే నీ భక్తులకు దీవెన ప్రాంగణమా
నా విజయానికి కారణమైన దక్షిణ హస్తమా
3. నిను సేవించే నీ శిష్యులకు నిజమగు ప్రపకమా
నా అవసరతలో నమ్మకమైన అద్భుత నేస్తమా


Nerchukonutaku Lyrics


నేర్చుకొనుటకు నీ యెద్ద యేసు కూర్చుండి విందునయ్యా
అ.ప: నేర్పించు యేసయ్యా నా మంచి బోధకుడా
1 సూటిగా గుండెలలోకి చొచ్చుకొనిపోవునట్లు
చేటు తెచ్చు పాపములు ఒప్పుకోనజేయునట్లు
2 ఓర్పుతో నా నడవడిని మార్చుకొనగలుగునట్లు
నేర్పుతో శాశ్వతసిరిని కూర్చుకొని వెలుగునట్లు
3 దివ్య జ్ఞాన సంపదలు విడుదలై కురియునట్లు
మర్మమైన సంగతులు వివరముగ తెలియునట్లు


Enthati premanu Lyrics


ఇంతటి ప్రేమను వింతగ చూపను ఎంతటివాడనయా
సంతసమొందుచు జీవితమంతయు స్తోత్రము చేతునయా
అ.ప : కరుణామయా - దయాహృదయా
1. కరగని కఠిన పాషాణం నా హృదయమును గెలిచితివా
తరగని నీదు ప్రేమను చాటను నన్నిల నీవు పిలచితివా
2.ఎండిన మోడు ఈ జీవితం చిగురింపగను చేసితివా
చెరగని నీదు గ్రంధమునందు నా పేరును నీవు రాసితివా


Nannadharinchu vada neke vandhanam Lyrics


నన్నాదరించువాడా నీకే వందనం
కన్నీరు తుడుచువాడా నీదే జీవితం
అ.ప: వందనం వందనం యేసు నీకే వందనం
అంకితం అంకితం నీకోరకే నా జీవితం
1 రహస్యమందు పుట్టినప్పుడు నీ కన్నులు నన్ను చూచెనంటివి
నాకు తలంపు రాకమునుపు నా మనస్సు గ్రహియించుచుంటివి
నన్నెరిగియున్నవాడా నీకే వందనం
భయపడకు అన్నవాడా నీదే జీవితం
2 నా పాపములు ఎన్నటికిని జ్ఞాపకము చేసుకోనంటివి
మేలు చేయుచు నా యవ్వనము క్రొత్తదిగా మార్చివేయుచుంటివి
నన్నిలలో నడుపువాడా నీకే వందనం
సత్యమును తెలుపువాడా నీదే జీవితం
3 నీ రాజ్యమును మొదట వెదకిన అన్నిటిని సమకూర్చెదనంటివి
నీ నామమములో మొర్రపెట్టిన జవాబును అనుగ్రహించుచుంటివి
నన్నెనుకున్నవాడా నీకే వందనం
నాతోనే ఉన్నవాడా నీదే జీవితం


Bhalamaina naa dhurgama Lyrics


బలమైన నా దుర్గమా - స్థిరమైన ప్రాకారమా
నను బలపరచు ప్రేరణమా - నా స్థిరతకు కారణమా
అ.ప: నేను కదిలించబడను - యేసు నీలో ఉన్నాను
1. సమృద్ధిగా నాకు ఆహారము సమకూర్చే దుర్గమా
సజీవులు ఉన్న భూమిమీద నాకున్న ఓ స్వాస్థ్యమా
2. మొరపెట్టగా నా కార్యాలను నెరవేర్చే దుర్గమా
శ్రమదినమున నమ్ముకొనదగిన నాకున్న ఓ శృంగమా
3. నిశ్చింతగా నివసించేందుకు కృపనిచ్చే దుర్గమా
ఇబ్బందిలో దాగియుండుటకు నాకున్న ఓ కేడెమా
4. దౌర్జన్యము చేయువారినుండి రక్షించే దుర్గమా
యుద్ధాలలో కాపాడుటకు నాకున్న ఓ శైలమా


Adharinchi ashirvadhinche Lyrics


ఆదరించి ఆశీర్వదించే మంచిదేవుడు ఇదుగోనండి
రండి రండి రండి రండి రండి రారండి
అనుమానాలు వదిలేయండి
అనుకూల సమయమిదే చేరుకొనండి
1 లోకమందు ఎవరైనా మంచివారికై చూస్తారు
అర్హతలు గమనించి అవకాశాలు ఇస్తారు
ఏమిలేని దీనులైనా యేసు ఆశ్రయమిస్తాడు
యోగ్యతలను లెక్కించడందడి యోగ్యులుగా మర్చేస్తాడండి
2 దేవుళ్ళనువారెవరైనా దుష్టులను శిక్షిస్తారు
నీతిమంతుల రక్షించ దిగివచ్చామని చెబుతారు
పాపులైన వారికొరకు యేసు భువికి వచ్చాడు
దోషములను లెక్కించడండి పావనులుగా చేస్తాడండి
3 కన్నవారు ఎవరైనా మాటవింటే ప్రేమిస్తారు
లోబడని తమ పిల్లలను భారంగా భావిస్తారు
దారితప్పిన వారికైనా యేసు స్వాస్థ్యం ఇస్తాడు
చేతితప్పులు లెక్కించడండి ఇంటిలో చేర్చుకుంటాడండి


Cheralonaina padutha Lyrics


చేరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట
మరణము వరకు చాటుతా ఏసయ్యను ప్రతి చోట
కరువైనా బరువైనా విడిచిపొను ప్రభుబాట
1 కష్టాల చీకటిలో దారి కనరకపోయినా
నష్టాల వేదనలో ఆశ మరి లేకపోయినా
నా బాధలన్నిటిలో నిరీక్షణతో ఉంటా
నా తండ్రి చిత్తానికై శ్రమలో నే వెతుకుతుంటా
2 అపాయములు బరువై సొమ్మసిల్లి పడిపోయినా
సహాయకులు కరువై దేహమంత చెడిపోయినా
నా బాధలన్నిటిలో నిరీక్షణతో ఉంటా
నా తండ్రి చిత్తానికై శ్రమలో నే వెతుకుతుంటా
3 అవంతరాలెదురై నా నావ నిలిచిపోయునా
ప్రశాంతతే కొదువై నా గుండె చెదరిపొయినా
నా బాధలన్నిటిలో నిరీక్షణతో ఉంటా
నా తండ్రి చిత్తానికై శ్రమలో నే వెతుకుతుంటా


Nee dhina manassutho Lyrics


నీ దీనమనస్సుతో జీవింప నేర్పుము
నీ రూపమునకు నన్ను మార్చుము
వినయముక లిగిన ఘనదైవమా
సాత్వికం నీ శాంతం నాలో కలిగించుమా
1 ఐశ్వర్యమైనా గోప్పపేరైనా నీ కరుణ లేక నేను పొందలేను
సంపాదనున్నా జ్ఞాననిధినైనా నీ సెలవులేక సంతసించలేను
దేనిని గూర్చిన అతిశయం నాకంటకుండ తొలగించు
తగ్గింపును నాలో ఉంచి నీకిష్టముగా బ్రతికించు
2 పరలోకమందున నీకున్న భాగ్యము
పాపులకోసమై తృజియించియుంటివే
సింహాసమున ఆసినుడవు నీవు
దాసుని చూపిన మాదిరి నేనరుసరించి అలవరచును
నీవిల చూపిన మాదిరి నేనుసరించ అలవరచు
గర్వము ఏమాత్రము నాలో లేకుండగను స్థిరపరచు


Parishudduda paramathmuda Lyrics


పరిశుద్ధుడా పరమాత్ముడా
దావీదు చిగురైన యేసు నామధేయుడా
అ.ప: ఐశ్వర్యము జ్ఞానబలము
ఘనతయు మహిమయు నీకే ప్రభూ
1. పరలోకమందున సింహాసనమున
ఆసీనుడైన ఓ దివ్యతేజుడా
సుర్యకాంత పద్మరాగముల పోలియున్నవాడా
గ్రంధమును విప్పగలిగిన సర్వసమర్ధుడా
2. నీ రక్తమిచ్చి దేవుని కొరకు
మమ్మునుకొన్న ఓ జయశీలుడా
రాజులైన యాజకులనుగా చేసియున్నవాడా
మరణించి తిరిగి లేచిన గొప్ప బలాడ్యుడా
3. భూతవర్తమాన భవిష్యత్ కాలమున
జీవించుచున్న ఓ ప్రేమధారుడా
సృష్టియంతా కలుగజేసి ఏలుచున్నవాడా
జీవకోటి పూజలందుకొను సత్యస్వరూపుడా


Nee kante nammadhagina Lyrics


నీకంటే నమ్మదగిన దేవుడెవరయా
నీవుంటే నాతో ఏ భయము లేదయా
మేలుకొరకే అన్నీ జరిగించు యేసయ్యా
కీడువెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా
1. కొట్టబడినవేళ నా గాయం కట్టినావే
బాధించినా స్వస్థపరచేది నీవే
2. అణచబడినవేళ నా తలను ఎత్తినావే
శిక్షించినా గొప్ప చేసేది నీవే
3. విడువబడినవేళ నను చేరదీసినావే
కోపించినా కరుణ చూపేది నీవే