Showing posts with label Paidimalla Subhakara Rao. Show all posts
Showing posts with label Paidimalla Subhakara Rao. Show all posts

Vadipokamundhey nannu vaduko poddhu valipokamundhey వాడిపోకముందే నన్ను వాడుకో పొద్దు వాలిపోకముందే

Song no:

    వాడిపోకముందే నన్ను వాడుకో
    పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో } 2
    వాడుకో యెసయ్యా - నీ కాడి నే మోస్తా  } 2 ||వాడిపోకముందే||

  1. నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే
    నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే } 2 || వాడుకో ||

  2. నీవిచ్చిన జీవితనికి వెలుగులింక పోకముందే
    నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే } 2  || వాడుకో ||

  3. నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే
     నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే } 2  || వాడుకో ||

  4. నీవిచ్చిన ఆరోగ్యం ఆవిరిగా మారకముందే
     నాకున్న అవకాశం చేజారి పోకముందే } 2  || వాడుకో ||