Showing posts with label Garikapati Uday Kumar. Show all posts
Showing posts with label Garikapati Uday Kumar. Show all posts

Kreesthu bethlehemulo puttenu christmas sambaraluga క్రీస్తు బేెత్లెహేములో పుట్టెను క్రిస్మస్ సంబరాలుగా తెచ్చెను

Song no:
HD
    క్రీస్తు బేెత్లెహేములో పుట్టెను
    క్రిస్మస్ సంబరాలుగా తెచ్చెను } 2

    నజరేతు వాడా యేసయ్య
    మమ్ములను రక్షింప వచ్చావయ్య } 2
    కృపాసత్య సంపూర్ణుడుగా వచ్చావయ్యా } 2
    భూలోకమంతా ఆనందము
    సంతోష గానాలతో
    క్రిస్మస్ సంబరాలా సంతోషము
    ఆనంద గానాలతో
    ఆనంద గానాలతో.. ఓ...ఓ... || క్రీస్తు బేెత్లెహేములో ||

  1. కన్యక మరియమ్మ గర్భములోను
    పరిశుద్ధుడైన యేసు జన్మించెను } 2
    మానవాళి పాపములను తీసివేయును
    పరలోకము నుండి దిగి వచ్చెను } 2
    సంబరాలే  సంబరాలే
    క్రిస్మస్ పండుగ సంబరాలే
    సంబరాలే  సంబరాలే
    క్రిస్మస్ సందడి సంబరాలే
    లోకాన వెలుగాయెనే..హే...హే..."
    లోకాన వెలుగాయెనే || క్రీస్తు బేెత్లెహేములో ||

  2. సర్వోన్నతమైన స్థలములలోన
    దేవునికి మహిమయే ఎల్లప్పుడు } 2
    ఆయన కిష్టులైన వారందరికీ
    భూమి మీద సమాధానము కలుగును } 2
    సంబరాలే  సంబరాలే
    క్రిస్మస్ పండుగ సంబరాలే
    సంబరాలే  సంబరాలే
    క్రిస్మస్ సందడి సంబరాలే
    లోకాన వెలుగాయెనే ..హే....హే.....
    లోకాన వెలుగాయెనే || క్రీస్తు బేెత్లెహేములో ||

  3. పరలోక రాజ్యము సమీపించెను
    మారుమనస్సు పొందమని
     యేసు చెప్పెను } 2
    చీకటి జనులందరికి వెలుగు కలుగును
    మరణముపై యేసు మనకు
    జయమిచ్చెను } 2
    సంబరాలే  సంబరాలే
    క్రిస్మస్ పండుగ సంబరాలే
    సంబరాలే  సంబరాలే
    క్రిస్మస్ సందడి సంబరాలే
    లోకాన వెలుగాయెనే..హే....హే...
    లోకాన వెలుగాయెనే || క్రీస్తు బేెత్లెహేములో ||

Bethlehemu puramulo yesu puttadu బేత్లెహేము పురములో యేసు పుట్టాడు

Song no:
HD
    బేత్లెహేము పురములో యేసు పుట్టాడు
    మానవాళిని రక్షించుటకు యేసు వచ్చాడు } 2

  1. జిగట ఊబిలో ఉన్నవారిని లేవనెత్తాడు } 2
    అనాదులుగా ఉన్నవారిని చేరదీశాడు } 2
    యేసే రక్షకుడు యేసే దైవము
    యేసే ఆదరణ నిత్యము నిలుచును } 2 || బేత్లెహేము||

  2. నశియించుచున్నవారిని ప్రేమించాడు } 2
    అశాంతిలో ఉన్నవారికి నెమ్మదినిచ్చాడు } 2
    యేసే రక్షకుడు యేసే దైవము
    యేసే ఆదరణ నిత్యము నిలుచును } 2 || బేత్లెహేము||

  3. చెరలో ఉన్న వారిని విడిపించాడు } 2
    చీకటి బ్రతుకులో ఉన్న వారికి వెలుగునిచ్చాడు } 2
    యేసే రక్షకుడు యేసే దైవము
    యేసే ఆదరణ నిత్యము నిలుచును } 2 || బేత్లెహేము||