Showing posts with label 𝐒𝐦𝐭.𝐍𝐢𝐬𝐬𝐲 𝐏𝐚𝐮𝐥. Show all posts
Showing posts with label 𝐒𝐦𝐭.𝐍𝐢𝐬𝐬𝐲 𝐏𝐚𝐮𝐥. Show all posts

Ningilona tharavelasi dharichupe నింగిలోన తారవెలసి దారిచూపే

Song no:
HD
    నింగిలోన తారవెలసి దారిచూపే జ్ఞానులకు
    కన్య మరియకు సుతునిగా అవతరించే  రక్షకుడు } 2

    రారండోయ్ రారండోయ్ క్రీస్తు యేసును ఆరాధించేద్దాం
    రారండోయ్ రారండోయ్ క్రీస్తు యేసును పూజించేద్దాం
    నింగిలోన తారవెలసి దారిచూపే జ్ఞానులకు
    కన్య మరియకు సుతునిగా అవతరించే  రక్షకుడు

  1. దావీదుపురములో పుడమికి మధ్యలో జగమేలే రక్షకుడు జన్మించినాడు
    ఆనాడు జ్ఞానులు బంగారు సాంబ్రాణి బోలమును అర్పించి ఆరాధించారు } 2
    పరమును విడచి రిత్తిని గా మారి దాసుని స్వరూపం ధరియించెను
    పాపిని  ప్రేమించి పాపమును ద్వేషించి పాపికి విడుదల నొసగేను

    రారండోయ్ రారండోయ్ క్రీస్తు యేసును ఆరాధించేద్దాం
    రారండోయ్ రారండోయ్ క్రీస్తు యేసును పూజించేద్దాం
    నింగిలోన తారవెలసి దారిచూపే జ్ఞానులకు
    కన్య మరియకు సుతునిగా అవతరించే  రక్షకుడు

  2. పాపికి రక్షణ రోగులకు స్వస్థత పాపక్షమాపణ యేసులోనే
    కీర్తి ప్రతిష్ఠలు సర్వ సంపదలు గుప్తామయున్నవి క్రీస్తులోనే } 2
    ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి మహోన్నతుడు
    అల్ఫయు ఒమేగా ఆది సంభూతుడు ఆరాధ్య దైవం ఆ యేసే

    రారండోయ్ రారండోయ్ క్రీస్తు యేసును ఆరాధించేద్దాం
    రారండోయ్ రారండోయ్ క్రీస్తు యేసును పూజించేద్దాం
    నింగిలోన తారవెలసి దారిచూపే జ్ఞానులకు
    కన్య మరియకు సుతునిగా అవతరించే  రక్షకుడు