Inthavaraku chudandi mundhu yeppudu ఇంతవరకు చూడని ముందు ఎపుడు జరగని

ఇంతవరకు చూడని ముందు ఎపుడు జరగని
వింత సంగతి యేసు పుట్టుక
బెత్లెహేము అయ్యింది వేదిక
తూర్పునుండి వచ్చింది తారక
అ.ప. : ఎంత గొప్ప కానుక - చింతలింక లేవిక
అంతటా అందుకే పండుగ
పాపియైన మనిషిలో నుండి
నీతిరాజు ఎట్లు వచ్చునండి
పావనాత్మ నిండుకొని దైవశక్తి కమ్ముకొని
కన్యమరియ జన్మనిచ్చెనండి
అల్పమైన నజరేతునుండి
మంచి ఫలము ఎట్లు వచ్చునండి
చెడ్డదాన్ని ఎన్నుకొని గొప్పచేయ పూనుకొని
మేలుకరముగా మార్చెనండి
నరునికై మహిమలో నుండి
మధ్యవర్తి ఎట్లు వచ్చునండి
రక్షకుని వేడుకొని శిక్షమీద వేసుకొని
ఇద్దరిపై చెయ్యి ఉంచెనండి

No comments:

Post a Comment