Showing posts with label Ravuri Dhaveedhu. Show all posts
Showing posts with label Ravuri Dhaveedhu. Show all posts

Vandhanam neeke vandhanam parishuddha sirama వందనం నీకే వందనం పరిశుద్ధ శిరమా వందనం నీకే వందనం

Song no: 189
(చాయ: చూడరే క్రీస్తుని)
వందనం నీకే వందనం పరిశుద్ధ శిరమా వందనం నీకే వందనం వందనం బొనరింతు నీ దౌ నందమగు ఘన నామమునకె ||వందనం||

సుందరుఁడ నీ శిరసు హేళనఁ బొందె ముండ్ల కిరీట ముంచగ నెందుఁ జూచిన రక్త బిందులు చిందుచుండెడి గాయములతో గ్రందెనా మోము కుందెనా యి(క నే నెందు( బోవక నిన్నుఁ గొలిచెద నందముగ మహిమ ప్రభువా ||వందనం||

భీకరుఁడ నీ యెదుట సర్వ లోకములు వణికెడు ఘనముఖ మే కరణి నుమి వేయఁబడియె వి కార రూపము నొందికందెను శ్రీకరా శ్రీ శు భాకరా నే నీ ముఖ ప్రకాశము పాడుజేసితి నో కరుణ భాస్కర క్షమించుము ||వందనం||

మించు నీ ముఖ లక్షణము లహ మంచి పెదవుల రంగుఁ జూడఁగఁ గొంచెమైనను గనుపడక కృ శించి దౌడలు క్రుంగిపోవుట నెంచఁగా నాలో చించఁగా ఆ నీ యంచితపు బల శౌర్యములు హ రించి పోయెను మరణ బలమున ||వందనం||

సిలువ యెదుటను నిపుడు నేనిఁక నిలిచి నినుఁ బ్రార్థింతుఁ బ్రభువా ఖలుఁడ నని ననుఁ ద్రోయకుము నే నలసి సొలసిన నిన్ను విడువక పిలిచెద నిన్నేఁ గొలిచెద నీ తల బలిమి చావున వాల్చగను నా యేసు నినుఁ జేతులతో నాపెద ||వందనం||

నిన్ను నేఁ గొనియాడుటకు నిపు డున్న భాషలు చాల విఁక ని న్నెటుల నే నుతియింతునో హో సన్న రక్షక ప్రోవు న న్నెడ బాయకు ఖిన్నునిఁ జేయకు నా కొర కిన్ని బాధల నొందితివి నా యన్న నా జీవంబు నీదే ||వందనం||

మరణ దినమున భయము పడి నీ కొర కెదురు జూడంగఁ గృపతో వరబలుండా నా విరోధుని కరకు శరములఁ ద్రుంచ రావె శూరుఁడా దేవకు మారుఁడా అటు నీ మరణ రూపము సిలువపై నా తరుణమునఁ జూపుము యెహోవా ||వందనం||

Dharuna magu marana varadhi dhatane దారుణ మగు మరణ వారిధి దాఁట నె

Song no:309

దారుణ మగు మరణ వారిధి దాఁట నె వ్వారి శక్యము సోదర ఘోర మగు కెరటములవలె వి స్తారముగ నేరములు పైఁగొని పారు చుండునప్పు డద్దరిఁ జేరు టెట్లు దారిఁ గనరే ||దారుణ||

ఒక్క పెట్టున నెగసి చక్క వెల్ళుద మన నీ రెక్క లక్కఱకు రావు ఎక్కడైనను నోడ గనుఁగొని యెక్కిపోద మని తలంచినఁ జెక్క నిర్మతమైన యోడ లక్కఱకు రావేమి సేతుము ||దారుణ||

మంగళ ధ్వనులతో శృంగారపురము వె లుంగుచున్నది ముందట పొంగి పారుచు మరణ నది త రంగములఁ జెలంగుచున్నది భంగపడకుఁడి మనకు క్రీస్తు సువార్తయను పెను నావ యిదిగో ||దారుణ||

వాద రహితుండైన యాది దేవుఁడు దాని నాధుం డనం బరఁగును బాధ లొందిన నరుల నందరిఁ జేరఁదీసిన క్రీస్తు యేసు నాధుఁడే నావి కుఁ డు క్రైస్తవ వేదమే చుక్కాని దీవికి ||దారుణ||

మానవు లందరు మరణాంబుధిని దాఁట మహనీయ మగు నావ యిదె దీనిలో నెక్కుటకు ముందే మానుగ వాక్యమును విని సు జ్ఞాన మొందినవారు క్రైస్తవ స్నాన మను పత్రికను బొందరె ||దారుణ||

విదితంబుగా నిందు విజ్ఞాన బోదకుల్ వినిపించుదురు వాక్యముఁ గొదగొనిన యాత్మములు తృప్తిఁ గొనును బ్రభు భోజనములోనే హృదయములలో దేవునాత్మ యెపుడు దీపంబై వెలుంగును ||దారుణ||

పలువిధ సంగీత ములతో సాగుచు మనము నలయ కుండఁగఁ బోదు ము బలముగల యీ యలలు దాఁటి పరమ పురద్వారముల వెలుపల గలిసికొని పరిశుద్ధ జనమును గడకు మోక్షము చేరుకొందుము ||దారుణ||

కరుణామయుని సభలోఁ జొరకపోయిన నిత్య నరక మంత మందున మరియు నంత్య దినపు బాధలు విరివిగ వినఁ గోరువారలు మరణ మొందక మును ప్రత్యక్షీ కరుణ మను గ్రంథమను వినరే ||దారుణ||