Song no: 09
యేసయ్యా నా ప్రియా !
ఎపుడో నీ రాకడ సమయం -2 || యేసయ్యా ||
- దురవస్థలలో ఒంటరినై -దుమికి ధూళిగా మారినను -2
దూరాన నీ ముఖ దర్శనము -ధృవతారగ నాలో వెలిగెనే -2 || యేసయ్యా ||
- మరపురాని నిందలలో - మనసున మండే మంటలలో -2
మమతను చూపిన నీ శిలువను - మరచిపోదునా నీ రాకను -2 || యేసయ్యా ||
- ప్రియుడా నిన్ను చూడాలని - ప్రియ నీవలెనే మారాలని -2
ప్రియతమా నాకాంక్ష తీరాలని -ప్రియమార నామది కోరెనే -2 || యేసయ్యా ||
Song no: 08
నేను వెళ్ళేమార్గము - నా యేసుకే తెలియును -2
శోదింప బడిన మీదట - నేను సువర్ణమై మారెదను -2
- కడలేని కడలి తీరము - ఎడమాయె కడకు నా బ్రతుకున -2
గురిలేని తరుణాన వెరవగ - నా దరినే నిలిచేవా నా ప్రభు -2
నేను వెళ్ళేమార్గము - నాయేసుకే తెలియును
- జలములలో బడి నే వెళ్లినా - అవి నా మీద పారవు -2
అగ్నిలో నేను నడచినా - జ్వాలలు నను కాల్చజాలవు -2
నేను వెళ్ళేమార్గము - నాయేసుకే తెలియును
- విశ్వాస నావ సాగుచు - పయనించు సమయాన నా ప్రభు -2
సాతాను సుడిగాలి రేపగా - నాయెదుటేనిలిచేవా నా ప్రభు -2
నేను వెళ్ళేమార్గము - నాయేసుకే తెలియును
Song no: 07
శాశ్వతమైనది నీవు నా యెడ చూపిన కృప -2
అనుక్షణం నను కనుపాప వలె -2 కాచిన కృప || శాశ్వత ||
- నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి -2
నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో -2 || శాశ్వత ||
- తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే -2
నీదు ముఖకాంతియే నన్ను ఆదరించేనులే -2 || శాశ్వత ||
- పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన -2
నా కృప నిను వీడదని అభయమిచ్చితివే -2 || శాశ్వత ||