ధైర్యాన్ని, శౌర్యాన్ని నింపెనురా….
తన పక్షము నిలబడిన గెలుపు నీదే రా…. ||2|| || యేసు ||
బలహీనులకు బలమైన దుర్గం, ముక్తి యేసు రక్తము….
వ్యాది బాధలకు విడుదల కలిగించును స్వస్తత యేసు రక్తము…..
శాంతికి స్థావరం శ్రీ యేసుని రక్తం-నీతికి కవచం పరిశుధ్ధుని రక్తం ||2||
మృత్యువునే.. గెలిచిన రక్తము… పాతాలం మూయు రక్తము
నరకాన్ని బంధిచిన జయశాలి అధిపతి రారాజు యేసయ్యే || యేసు ||
పాపికి శరణము యేసు రక్తము, రక్షణ ప్రాకారము…
అపవిత్రాత్మను పారద్రోలును ఖడ్గము యేసు రక్తము….
శత్రువు నిలివడు విరోధి ఎవ్వడు?-ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు ||2||
సాతాన్నే నలగగొట్టిన వాడితలనె చితకకొట్టినా
కొదమ సింహమై మేఘారుడిగా తీర్పు తీర్చవచ్చు రారాజు యేసయ్యే || యేసు ||
విన్నాననుకొంటివి - కాని గ్రహియింపకున్నావా ?
చూసాననుకొంటూనే - తెరువలేకున్నావా
దగ్గరగా ఉంటూనే - దూరాన నిలిచేవా
త్రోవను జారా విడిచి - కుడి ఎడమకు తప్పావా
పాపేచ్చలతోటి - క్రీస్తేసుని మరిచావా
తన గాయములను రేపుటకు - కారకుడైయున్నావా || నిక్కమురా ||
శోధనల పోరుటముతో - సరిపెట్టకు నీ పయనం
కష్టానష్టాలను సాకులు - తప్పించవు నీ గమ్మం
పానార్పణనొందే గాని - సుఖమెరుగకు అది శూన్యం
ప్రేమ విశ్వాసముతోటి - నడిచేదే నీ జీవితం
నీ పరుగును కడముట్టించే - నీదే మంచి పోరాటం
పరభాగ్యము నీవు పొంద - ప్రకటించుము యేసుని వాక్యం || నిక్కమురా ||
Nikkamura lokamu cheddadira takshaname meluko sodara
E lokapu papapu chikatilo nilone velugunu chupumura