Showing posts with label Karthik. Show all posts
Showing posts with label Karthik. Show all posts

Srustini sryjinchina mahimanvithuda సృష్ఠిని సృజించిన మహిమాన్వితుడా

సృష్ఠిని సృజించిన మహిమాన్వితుడా - కూరుపికై కదిలొచ్చిన కరుణామయుడా
నా హృదయ తలుపు తడుతున్న సదయుడా
స్తుతిగానమే నా అర్పణ - నేనౌతును నీ దర్పణ
ఆరాధనా ... ఆరాధనా ... ఆరాధనా నీకే

తల్లి గర్భమందే నన్నెరిగి - ఊపిరూదిన యేసయ్యా.. మృత్యుంజయుడా
ముదిమి వరకు నన్ను నువ్వెత్తుకుంటానని - మాటనిచ్చిన నీతిసూర్యుడా నిత్య తేజుడా
నా తండ్రివి నీవే, కాపరి నీవే ... ప్రేమ స్వరూపుడా
నా ఖ్యాతివి నీవే, ఘనము నీవే ... ఆశ్చర్యకరుడా                ॥ ఆరాధనా ||

అయిదే రొట్టెలు రెండే చేపలు - వేలాది ఆకలి దీర్చిన సమకూర్చు దేవుడా … నా పోషకుడా
జీవపు ఊటలు నాలో పొంగించి - దప్పిక దీర్చిన అతి శ్రేష్ఠుడా… మంచి సమరయుడా
నా జీవాహారము నీవే, నా జీవ జలమూ నీవే... నాదు సజీవుడా
అత్యున్నతుడా నీవే, మహోన్నతుడా నీవే … అద్భుతాకరుడా      ॥ ఆరాధనా ||

గుడ్డి వాడికి చూపు ఇచ్చిన కుంటివాడికి నడకనిచ్చిన - నా యేసయ్యా… స్వస్థ పరుచు దేవుడా
లాజరా అని పిలిచి మరణములో నుండి లేపిన యేసయ్యా అద్భుతాలు చేయువాడా…
విజయవీరుడా
నా మార్గము నీవే, నా దుర్గము నీవే ... నన్ను ఆదరించువాడా
నా క్షేమము నీవే, నా సర్వమూ నీవే ... నా సర్వోన్నతుడా         ॥ ఆరాధనా || 

Chiru dhivvela velugulatho nee dhivya kanthulatho చిరు దివ్వెల వెలుగులతో... నీ దివ్య కాంతులతో


నను బ్రోవ రావయ్యా .... కంటిపాపలా  నను కాన రావయ్యా ...              (2)

యేసయ్యా... యేసయ్యా...
యేసయ్యా...యేసయ్యా...
నను బ్రోవ రావయ్యా... నను కాన రావయ్యా (2)

 లోయలో ... క్రమ్మిన చీకటిలో
 ఇలలో .... నిరాశల వెల్లువలో                      (2)

1. దహించివేస్తున్న అవమానము - కరువైపోయిన సమాధానము (2)
పగిలిన హృదయము - కన్నీటి ధారల సంద్రము (2)
ఎగసి పడుతున్న కెరటము - కానరాని గమ్యము (2)

2. ఏకమైన  లోకము - వేధిస్తున్న విరోధము
దూరమౌతున్న బంధము - తాళలేను  నరకము (2)
ఈదలేని  ప్రవాహము - చేరువైన అగాధము (4)