50
Showing posts with label
Jeeva swaralu 📖
.
Show all posts
Showing posts with label
Jeeva swaralu 📖
.
Show all posts
Kanuchoopu Meralona ye Aasha Leni Vela కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ
307
కనుచూపు మేరలోన
కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ
ఎటు తోచక లోలోన నే కృంగియున్న వేళ
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు } 2
మొదలుపెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా
బెదిరిపోయి నా హృదయం బేలగా మారిపోగా } 2
పని పూర్తి చేయగ బలము లేని వేళ } 2
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా ఆటంకాలన్నిటిని యేసూ తొలగించావు } 2
శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతినే దోచుకోగా
చెదిరిపోయి ఆశల సౌధం నా గొంతు మూగబోగా } 2
స్తుతి పాట పాడగ స్వరము రాని వేళ } 2
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా నోటను నూతన గీతం యేసూ పలికించావు } 2
కపట మిత్రుల మోసం అగ్నిలా కాల్చబోగా
సడలిపోయి నా విశ్వాసం ధైర్యమే లేకపోగా } 2
అడుగేసి సాగగ అనువుకాని వేళ } 2
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా ప్రార్థనకు ఫలమిచ్చి యేసూ నడిపించావు } 2
|| కనుచూపు ||
Kanuchoopu meralona ye aasha leni vela
Etu thochaka lolona ne krungiyunna vela
Nenunnaa neetho antu naa chenthaku cheraavu
Naa kanneeranthaa thudichi nee kougita dhachaavu } 2
Modalupettina kaaryam madhyalo aagipogaa
Bedhiripoyi naa hrudayam belagaa maaripogaa } 2
Pani poorthi cheyaga balamu leni vela } 2
Nenunnaa neetho antu naa chenthaku cheraavu
Naa aatankaalannitini yesu tholaginchaavu } 2
Shramalu thechchina dukham shaanthine dochukogaa
Chediripoyi aashala soudham naa gonthu moogabogaa } 2
Sthuthi paata paadaga swaramu raani vela } 2
Nenunnaa neetho antu naa chenthaku cheraavu
Naa notanu noothan geetham yesu palikinchaavu } 2
Kapata mithrula mosam agnilaa kaalchabogaa
Sadalipoyi naa vishwaasam dhairyame lekapogaa } 2
Adugesi saagaga anuvukaani vela } 2
Nenunnaa neetho antu naa chenthaku cheraavu
Naa praardhanaku phalamichchi yesu nadipinchaavu } 2
|| Kanuchoopu ||
కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ Kanuchupu meralona ye aasha leni vela
Song no: 1
కృపామయుడా – నీలోనా } 2
నివసింప జేసినందున
ఇదిగో నా స్తుతుల సింహాసనం
నీలో నివసింప జేసినందునా
ఇదిగో నా స్తుతుల సింహాసనం
కృపామయుడా…
ఏ అపాయము నా గుడారము
సమీపించనీయక } 2
నా మార్గములన్నిటిలో
నీవే ఆశ్రయమైనందున } 2
|| కృపామయుడా ||
చీకటి నుండి వెలుగులోనికి
నన్ను పిలచిన తేజోమయా } 2
రాజవంశములో
యాజకత్వము చేసెదను } 2
|| కృపామయుడా ||
నీలో నిలిచి ఆత్మ ఫలము
ఫలియించుట కొరకు } 2
నా పైన నిండుగా
ఆత్మ వర్షము కుమ్మరించు } 2
|| కృపామయుడా ||
ఏ యోగ్యత లేని నాకు
జీవ కిరీటమిచ్చుటకు } 2
నీ కృప నను వీడక
శాశ్వత కృపగా మారెను } 2
|| కృపామయుడా ||
Song no: 1
Krupaamayudaa – Neelona } 2
Nivasimpa Jesinanduna
Idigo Naa Sthuthula Simhaasanam
Neelo Nivasimpa Jesinandunaa
Idigo Naa Sthuthula Simhaasanam
Krupaamayudaa…
Ae Apaayamu Naa Gudaaramu
Sameepinchaneeyaka } 2
Naa Maargamulannitilo
Neeve Aashrayamainanduna } 2
|| Krupaamayudaa ||
Cheekati Nundi Velugu Loniki
Nannu Pilachina Thejomayaa } 2
Raaja Vamshamulo
Yaajakathvamu Chesedanu } 2
|| Krupaamayudaa ||
Neelo Nilichi Aathma Phalamu
Phaliyinchuta Koraku } 2
Naa Paina Nindugaa
Aathma Varshamu Kummarinchu } 2
|| Krupaamayudaa ||
Ae Yogyatha Leni Naaku
Jeeva Kireetamichchutaku } 2
Nee Krupa Nanu Veedaka
Shaashwatha Krupagaa Maarenu } 2
|| Krupaamayudaa ||
కృపామయుడా నీలోనా Krupaamayudaa Neelona
Thodai yundhunani bayapadakumdumani తోడై యుందునని
Song no: 348
తోడైయుందునని భయపడకుండుమని
పలికిన నమ్మదగిన యేసయ్యా } 2
నా క్షేమం నా చేతిలో లేదయా
నీకంటే క్షేమాధారం లేదయా } 2
|| తోడైయుందునని ||
ఉపదేశమును విని ఆఙ్ఞలు గైకొని భక్తితో కొలువనీయుము } 2
దినములు క్షేమముగా నిత్యము సౌఖ్యముగా సాగే ఘనతనీయుము } 2
|| నా క్షేమం ||
దినములు చెడ్డవని భద్రత లేదని నీతిగ బ్రతుకనీయుము } 2
అందరికొరకును ప్రార్థనస్తుతులను చేసే మనసునీయుము } 2
|| నా క్షేమం ||
నెమ్మది పొందుకొని ఆయుష్షు పెంచుకొని సంతోషించనీయుము } 2
పరిశుద్ధముగను నా దేవా నిను ఆరాధించనీయుము } 2
|| నా క్షేమం ||
Song no: 348
Thodaiyundunani Bhayapadakundumani
Palikina Nammadagina Yesayya } 2
Na Ksemaṁ Na Cethilo Ledaya
Nikante Ksemadharaṁ Ledaya } 2
|| Thodaiyundunani ||
Upadesamunu Vini Annalu Gaikoni Bhakthito Koluvaniyumu } 2
Dinamulu Ksemamuga Nityamu Saukhyamuga Sage Ghanataniyumu } 2
|| Na Ksemam ||
Dinamulu Ceddavani Bhadrata Ledani Nithiga Bratukaniyumu } 2
Andarikorakunu Prarthanastutulanu Cese Manasuniyumu } 2
|| Na Ksemam ||
Nemmadi Pondukoni Ayussu Penchukoni Santosincaniyumu } 2
Parisud'dhamuganu Na Deva Ninu Aradhincaniyumu } 2
|| Na Ksemam ||
Yesu neeve kavalayya natho kuda ravalayya యేసు నీవే కావాలయ్యా నాతో కూడ రావాలయ్యా
288
సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడైయుండును
యేసు నీవే కావాలయ్యా నాతో కూడ రావాలయ్యా
ఘనుడ నీ దివ్య సన్నిధి నను ఆదుకునే నా పెన్నిధి
నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా
|| యేసు ||
నీవే నాతో వస్తే దిగులు నాకుండదు
నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు } 2
|| నీవే ||
నీవే నాతో వస్తే కొరత నాకుండదు
నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు } 2
|| నీవే ||
నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు
నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు } 2
|| నీవే ||
Yesu neeve kavalayya.. natho kuda ravalayya…
ghanuda nee divya sannidhi nanu aadhukune naa pennidhi
neeve kavalayya natho ravalayya..
|| Yesu ||
Neeve natho vasthe digulu nakundadu
Neeve aajnapisthe thegulu nannantadu
|| Neeve ||
Neeve natho vaste koratha nakundadu
Neeve aajnapisthe kshayatha nannantadu
|| Neeve ||
Neeve natho vasthe otami nakundadu
Neeve aajnapisthe cheekati nannantadu
|| Neeve ||
యేసు నీవే కావాలయ్యా Yesu neeve kavalayya
Sageti e jeeva yathralo regeti సాగేటి ఈ జీవయాత్రలో రేగేటి
Song no: 111
సాగేటి ఈ జీవయాత్రలో
రేగేటి పెనుతుఫానులెన్నో
ఆదరించవా నీ జీవవాక్కుతో - సేదదీర్చవా నీ చేతి స్పర్శతో
సుడిగుండాలెన్నో లోకసాగరాన
వడిగా నను లాగి పడద్రోసే సమయాన } 2
నడిపించగలిగిన నా చుక్కాని నీవే } 2
విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే } 2
యేసయ్యా ఓ మెస్సీయా - హల్లెలూయా నీకే స్తోత్రమయా } 2
|| సాగేటి ||
వడగాడ్పులెన్నో నా పయనంలోన
నడవనీక సొమ్మసిల్లజేసే సమయాన } 2
తడబాటును సరిచేసే ప్రేమమూర్తి నీవే } 2
కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే } 2
యేసయ్యా ఓ మెస్సీయా - హల్లెలూయా నీకే స్తోత్రమయా } 2
|| సాగేటి ||
అలలా శ్రమలెన్నో బ్రతుకు నావ పైన
చెలరేగి విలవిలలాడించే సమయాన } 2
నిలబెట్టి బలపరచే బలవంతుడ నీవే } 2
కలవరమును తొలగించే కన్నతండ్రి నీవే } 2
యేసయ్యా ఓ మెస్సీయా - హల్లెలూయా నీకే స్తోత్రమయా } 2
|| సాగేటి ||
|| Yese Nija Devudu ||
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)