Showing posts with label Panthagani Paradhesi. Show all posts
Showing posts with label Panthagani Paradhesi. Show all posts

Kalvari girijeru manasa silva sarasa కల్వరి గిరిజేరు మనసా సిల్వ సరస

Song no: 202

కల్వరి గిరిజేరు మనసా సిల్వ సరస ||కల్వరి||

సిలువపై జూడు మదేమి శ్రీ కరుడు ప్రభుయేసు స్వామి తలను ముండ్ల కిరీటంబదేమి తరచి చూడుమీ ||కల్వరి||

పరులకుపకారంబు సల్ప ధరను వెలసిన వరపాదముల కఱకు మేకులు గొట్టెద రేల కరుణాలవాల ||కల్వరి||

కరముపట్టి దరిని జేర్చి వరములిడి దీవించిన యా కరుణగల చేతులలో చీల గుచ్చెద రేల ||కల్వరి||

ప్రేమ,కృప,నిర్మలత్వమును నీమమును గల మోముపైన పామరులుమి వేసెదరేల పాటించరేల ||కల్వరి||

ఘోర యాతనలును నీదు క్రూరమరణము చూడ గుండె నీరు నీరైపోవదె దేవ క్రూరునికైన ||కల్వరి||

పాపమేమిచేసి యెరుగవు పావన పరమదేవుడవు ఓ పరాత్పర నీకేమి యింత ఉత్కట బాధ ||కల్వరి||

స్వామి మాకై పూటపడను నీ ప్రేమయే కారణము నిజము భూమి యది గుర్తింపగ నిమ్ము పూజ్యుండ దేవ ||కల్వరి||

పావనాత్మ నీవు జావ పాపి కబ్బును నిత్యజీవ మావచన సత్యంబు దెల్పుము మానవాళికిన్ ||కల్వరి||

సిలువ దరికాకర్షించుము ఖలుడను ఘోరపాపిని కలుషములు విడ శక్తినీయుము సిలువ ధ్యానమున ||కల్వరి||

Papakupamunandhu padi munigiyunnavu పాపకూపమునందు పడి మునిగియున్నావు

Song no:308

పాపకూపమునందు పడి మునిగియున్నావు పాటింపవది యెందుకు పాప జన్మము పాపకర్మము పాపపూరితమైన హృదయము ఓపరాని భయంకరోగ్రత శాపములు సమకట్టియుండగ ||పాప||

పరమాత్మ మీదనే గురి నిల్పు మని దెల్పు వరబోధమది నెంచవు నిరత మును రాత్రియును బవలును నిరవు ధనమును ఘనము సౌఖ్యము లరయు చుందువు క్షణము నీవా పరమ ధర్మము సరకుజేయవు ||పాప||

కనివినంగ నుదగని పనికిమాలిన క్రియల దనిసి భ్రమయుచు నుందువు ఘనుల పెద్దల జననీజనకుల ననిశమును నిరసించి మెలగెడు వినయరహితంబైన జీవిత మునకు నేమి ఘటిల్లునోకను ||పాప||

పెరవారలను బ్రియసో దరులుగ బ్రేమింప పరమాత్మపురికొల్పదే పరులపై ద్వేషంబు పగగొని పలుతెరంగుల బాధపఱచుచు ప్రాణహత్య లొనర్చు నీకు పరమ పదము లభింపసాధ్యమె ||పాప||

పాప పరిహారార్థ ప్రాయశ్చిత్తము జేసి ప్రాణమర్పించె నెవరో ఆ పరాత్పరు నాశ్రయించుము శాపభారము బాపిబ్రోచును మాపు రేపునులేని స్వర్గ ప్రాప్తికల్గును నిత్యశుభమగు ||పాప||

పాపభారము క్రింద పడికుందు మీకునే పరగనిత్తును శాంతిని దాపు నకు రండంచు పతితుల దయను బిలచెడు యేసుక్రీస్తును పాపి కాశ్రయుడంచు నమ్మి భక్తితో ప్రార్థించి వేడవే ||పాప||

శరణీయ వరమోక్ష పురమందు ఘనసౌఖ్య పరమానందము లొందుచు వరుల దూతల భక్తగణముల సరసదేవు స్మరించు భాగ్యము గురుడు నీకిడఁగోరి పిలుచుచు కరము జాపెను కౌగిలింపవె ||పాప||





Koniyadadharame ninnu komala hrudhaya కొనియాడఁ దరమె నిన్ను-కోమల హృదయ




Song no: 108

రా – కమాసు
తా – త్రిపుట

కొనియాడఁ దరమె నిన్ను-కోమల హృదయ – కొనియాడఁ దరమె నిన్ను = తనరారు దినకరుఁ – బెనుతారలను మించు – ఘనతేజమున నొప్పు — కాంతిమంతుఁడ వీవు ॥కొనియాడ॥
  1. ఖెరుబులు సెరుపులు – మరి దూతగణములు = నురుతరంబుగఁ గొలువ – నొప్పు శ్రేష్ఠుఁడ వీవు ॥కొనియాడ॥
  2. సర్వలోకంబులఁ – బర్వు దేవుఁడ వయ్యు = నుర్వి స్త్రీ గర్భాన – నుద్భవించితి వీవు ॥కొనియాడ॥
  3. విశ్వమంతయు నేలు – వీరాసనుఁడ వయ్యుఁ = పశ్వాళితోఁ దొట్టిఁ – పండియుంటివి నీవు ॥కొనియాడ॥
  4. దోసంబులను మడియు – దాసాళిఁ గరుణించి = యేసు పేరున జగతి కేగుదెంచితి నీవు ॥కొనియాడ॥
  5. నరులయందునఁ గరుణ = ధర సమాధానంబు = చిరకాలమును మహిమ పరఁగఁ జేయుదు వీవు ॥కొనియాడ॥
  6. ఓ యేసు పాన్పుగ – నా యాత్మఁ జేకొని = శ్రేయముగ బవళించు శ్రీకరవరసుత ॥కొనియాడ॥