Showing posts with label Nee bandhame chalunaya. Show all posts
Showing posts with label Nee bandhame chalunaya. Show all posts

Ardham chesukune aapthudavu neeve అర్ధం చేసుకునే ఆప్తుడవు నీవే బాధను పంచుకునే

Song no:

    అర్ధం చేసుకునే ఆప్తుడవు నీవే బాధను పంచుకునే బంధువు నీవే }2
    ప్రేమను పంచగలిగినా పరమ తండ్రివి నీవె
    సహయం చెయగలిగిన నా హితుడవు నీవే }2
    నీ ప్రేమ చాలయ్య నను కొన్న యేసయ్య
    నీ ప్రేమ చాలయ్య నను కన్న యేసయ్య

    అర్ధం చేసుకునే ఆప్తుడవు నీవే బాధను పంచుకునే బంధువు నీవే }2

  1. కన్నీరు తడిచి కలతలను బాపే
    కలుషాత్ములను కడిగే కరుణాత్ముడవు నీవే }2
    కృపా సత్య సంపూర్ణమై నా హృధిని గెలిచావే }2
    కొనియాడ నా యేసయ్య కోటి కంటాలతో
    కీర్తించే నా యేసయ్య స్తోత్ర గీతాలతో

    ఎందుకింత ప్రేమయ్య నా పైన యేసయ్య }2
    అర్ధం చేసుకునే ఆప్తుడవు నీవే బాధను పంచుకునే బంధువు నీవే

  2. వేదనలు తొలగించి శోధనలు గెలిపించి
    వారసునిగా మార్చి వీరునిగా చేసావే }2
    వాక్యంతో నను నింపి వారధిగా నిలిపావే }2
    విలువైన పిలుపుతో పిలిచి వెన్నంటే ఉన్నావే }2
    ఎంత వింత ప్రేమయ్య నా పైన యేసయ్య }2
    అర్ధం చేసుకునే ఆప్తుడవు నీవే బాధను పంచుకునే బంధువు నీవే }2