నూతనమైన ఆనంద రాగాలతో - క్రొత్త క్రొత్త ఊహల పల్లకిలో
ప్రియుడైన యేసుతో విహారములో - ఉప్పొంగెను నా మానసవీణ
నూతన వత్సరము - మన ముందు ఉన్నది
నిత్య నూతన దీవెనలు - మెండుగ ఉన్నవి ఆయనలో
I wish you all - Happy happy new year
we welcome you - 2020
we welcome you - to 2020
- గడచిన వత్సరం సంతోషపురమోలే - క్రొత్త క్రొత్త అనుభవాలు నేర్పగా
పరిశుద్ధతలో సంపూర్ణమగుటకై - కృపలతో సిద్ధపరచబడెదను
మునుపటికంటే అధికమైన మేళ్ళను చేయు - సర్వశక్తుడు మన ముందు నడువగా
జయధ్వనితో సాగిపోదుము - సాతాను దుర్గములు కూల్చుచూ
- నూతన వత్సరం శ్రేయస్కరమైన - ఆశీర్వాదములు ఇవ్వనుండగా
నా తలపై అపరంజి కిరీటము - ప్రభావ గౌరవము నే పొందుకొనెదను
వినువీధిలో సూర్యునికే గుడారము వేసిన - శక్తిమంతుడు మన ముందు నడువగా
ఉత్సాహగానముతో సాగిపోదును - జనులలో ఘనత పొందుచూ
- నూతన వత్సరం వాగ్ధానములను - హృదయముపై ప్రభువు వ్రాయుచుండగా
ఖర్జూర వృక్షమునై మొవ్వువేయుటకు - మందిరములో నాటబడెదను
ఏ తెగులును నా ఇంటిని సమీపించదని - బలశూరుడే మన ముందు నడువగా
స్తుతి ధ్వనితో సాగిపోదును - దేవదారు వృక్షమోలే ఎదుగుచు
|| goto ||
ఆశల వలయంలో లోకబాటలో చిక్కిన ఓమనిషి నీ గతి ఏమౌనో } 2
ఏ క్షణము నీదికాదు ఈ సమయము నీతో రాదు } 2
యేసు నిన్ను పిలచుచున్నాడు తన యొద్దకు రమ్మని } 2
ఆశల వలయంలో పాప బ్రతుకులో చిక్కిన ఓమనిషి నీ గతి ఏమౌనో
- కులం నాది మతం నాదని బావమెందుకు
బలం నాది ధనం ఉందని గర్వమెందుకు } 2
ప్రాణం వున్నా నీ దేహము రేపు మట్టి బొమ్మ రా
మట్టి బొమ్మ చివరి మజిలి ఎన్నటికైనా మట్టిలోకిరా } 2
స్నేహమా.. స్నేహమా.. స్నేహమా.. గమనించుమా
నేస్తమా.. నేస్తమా.. నేస్తమా.. ఆలోచించుమా } 2
ఆశల వలయంలో పాప బ్రతుకులో చిక్కిన ఓమనిషి నీ గతి ఏమౌనో
- అందం ఉంది జ్ఞానం వుందని బావమెందుకు
దేవుడే లేడు నేనే దేవున్నని గర్వమెందుకు } 2
అందమంతా చీకిపోవును ఎన్నటికైనా
నీ యవ్వన అందమంతా ఎప్పటికైనా మట్టిపాలురా } 2
స్నేహమా.. స్నేహమా.. స్నేహమా.. గమనించుమా
నేస్తమా.. నేస్తమా.. నేస్తమా.. ఆలోచించుమా } 2
ఆశల వలయంలో పాప బ్రతుకులో చిక్కిన ఓమనిషి నీ గతి ఏమౌనో
- పాపివైన నీ కోసమే యేసు వచ్చెను
తన రక్తమంతయు ధారపోసేను నీ కోసమే } 2
ఆ రక్తంలో కడగబడితే పరలోకమేరా
పరిశుద్ద సిలువ రక్తమును నిర్లక్ష్య పరిచితే అగ్ని గుండమురా } 2
సోదరా సహోదరి సోదరా గమనించుమా
సోదరా సహోదరి సోదరా ఆలోచించుమా } 2
ఆశల వలయంలో పాప బ్రతుకులో చిక్కిన ఓమనిషి నీ గతి ఏమౌనో
|| ఆశల వలయంలో లోక ||
