Song no: #39
- నృపా! విమోచకా! ప్రభూ వేలాది నోళ్ల నీ కృపా జయప్రభావముల్ నుతింతు నెంతయున్.
- కృపాధికార! దేవ! నీ సాయంబు జేయుమా భవత్ర్పభావ కీర్తులన్ జాటంగ నెల్లెడన్.
- భయంబు చింతఁ బాపును హర్షంబు పాపికి సౌఖ్యంబు జీవశాంతులు నీ నామ మిచ్చును.
- విముక్తి జేయు ఖైదిని పాపంబు బాపును పాపాత్ము శుద్ధుజేఁయును శ్రీయేసు రక్తము.
- జనాళి! పాపు లెల్లరు! శ్రీయేసున్ నమ్ముఁడి కృపావిముక్తులందుఁడి సంపూర్ణ భక్తితో.
- అర్పించె యేసు ప్రాణమున్ నరాళిఁగావను; యజ్ఙంపు దేవు గొఱ్ఱెపై నఘంబు వేయుఁడి.
- సత్కీర్తి స్తోత్ర ప్తేమల నభాన భూమిని సర్వత్ర దేవుఁడొందుగా సద్భక్త పాళిచే.
Song no: #127 226
- దూత పాట పాడుఁడీ రక్షకున్ స్తుతించుఁడీ
ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేము నందునన్
భూజనంబు కెల్లను సౌఖ్యసంభ్ర మాయెను
ఆకసంబునందున మ్రోగు పాట చాటుఁడీ
దూత పాట పపాడుఁడీ రక్షకున్ స్తుతించుఁడీ.
- ఊర్ధ్వలోకమందునఁ గొల్వఁగాను శుద్ధులు
అంత్యకాలమందున కన్యగర్భమందున
బుట్టినట్టి రక్షకా ఓ యిమ్మానుయేల్ ప్రభో
ఓ నరావతారుఁడా నిన్ను నెన్న శక్యమా?
దూత పాట పాడుఁడీ రక్షకున్ స్తుతించుఁడీ
- దావె నీతి సూర్యుఁడా రావె దేవపుత్రుఁడా
నీదు రాకవల్లను లోక సౌఖ్య మాయెను
భూనివాసు లందఱు మృత్యుభీతి గెల్తురు
నిన్ను నమ్మువారికి ఆత్మశుద్ధి కల్గును
దూత పాట పాడుఁడీ రక్షకున్ స్తుతించుఁడీ