Showing posts with label Yesanna. Show all posts
Showing posts with label Yesanna. Show all posts

Yesayya naa priya yepudo nee rakada samayam యేసయ్యా నాప్రియా ఎపుడో నీ రాకడ సమయం

Song no: 09

    యేసయ్యా నా ప్రియా !
    ఎపుడో నీ రాకడ సమయం -2    || యేసయ్యా ||

  1. దురవస్థలలో ఒంటరినై -దుమికి ధూళిగా మారినను -2
    దూరాన నీ ముఖ దర్శనము -ధృవతారగ నాలో వెలిగెనే -2   || యేసయ్యా ||

  2. మరపురాని నిందలలో - మనసున మండే మంటలలో -2
    మమతను చూపిన నీ శిలువను - మరచిపోదునా నీ రాకను -2  || యేసయ్యా ||

  3. ప్రియుడా నిన్ను చూడాలని - ప్రియ నీవలెనే మారాలని  -2
    ప్రియతమా నాకాంక్ష తీరాలని -ప్రియమార నామది కోరెనే  -2      || యేసయ్యా ||

Nenu velle margamu nayesuke theliyunu నేను వెళ్ళేమార్గము నా యేసుకే తెలియును

Song no: 08

    నేను వెళ్ళేమార్గము - నా యేసుకే తెలియును -2
    శోదింప బడిన మీదట - నేను సువర్ణమై మారెదను -2

  1. కడలేని కడలి తీరము - ఎడమాయె కడకు నా బ్రతుకున -2
    గురిలేని తరుణాన వెరవగ - నా దరినే నిలిచేవా నా ప్రభు -2
    నేను వెళ్ళేమార్గము - నాయేసుకే తెలియును

  2. జలములలో బడి నే వెళ్లినా - అవి నా మీద పారవు -2
    అగ్నిలో నేను నడచినా - జ్వాలలు నను కాల్చజాలవు -2
    నేను వెళ్ళేమార్గము - నాయేసుకే తెలియును

  3. విశ్వాస నావ సాగుచు - పయనించు సమయాన నా ప్రభు -2
    సాతాను సుడిగాలి రేపగా - నాయెదుటేనిలిచేవా నా ప్రభు -2
    నేను వెళ్ళేమార్గము - నాయేసుకే తెలియును

Naa priyuda yesayya nee krupa lenidhey నా ప్రియుడా యెసయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేను

Song no: 06

    నా ప్రియుడా యెసయ్యా - నీ కృప లేనిదే నే బ్రతుకలేను
    క్షణమైనా -నే బ్రతుకలేను - 2 నా ప్రియుడా.... ఆ ఆ అ అ -

  1. నీ చేతితోనే నను లేపినావు - నీ చేతిలోనే నను చెక్కుకొంటివి -2
    నీ చేతి నీడలో నను దాచుకొంటివి -2 ॥ నా ప్రియుడా ॥

  2. నీ వాక్కులన్ని వాగ్దానములై - నా వాక్కు పంపి స్వస్థత నిచ్చితివి -2
    నీ వాగ్దానములు మార్పులేనివి -2 ॥ నా ప్రియుడా ॥

  3. ముందెన్నడూ నేను వెళ్ళనీ - నూతనమైన మార్గములన్నిటిలో 2
    నా తోడు నీవై నన్ను నడిపినావు -2 ॥ నా ప్రియుడా ॥

  4. సర్వోన్నతుడా సర్వకృపానిధి - సర్వసంపదలు నీలోనే యున్నవి2
    నీవు నా పక్షమై నిలిచి యున్నావు -2 ॥ నా ప్రియుడా ॥

Prabhuva nee samukhamu nandhu snthoshamu kaladhu ప్రభువా నీ సముఖము నందు సంతోషము కలదు

Song no: 43

    ప్రభువా - నీ సముఖము నందు
    సంతోషము - కలదు
    హల్లెలూయా సదా - పాడెదన్
    హల్లెలూయా సదా - పాడెదన్
    ప్రభువా - నీ సముఖము నందు

  1. పాపపు ఊబిలో - నేనుండగా
    ప్రేమతో - నన్నాకర్షించితిరే -2
    కల్వారి రక్తంతో - శుద్ధి చేసి -2
    రక్షించి పరిశుద్ధులతో - నిల్పి ॥ ప్రభువా ॥

  2. సముద్ర - తరంగముల వలె
    శోధనలెన్నో- ఎదురైనను -2
    ఆదరణ కర్తచే - ఆదరించి -2
    నీ నిత్య కృపలో - భద్రపరచి ॥ ప్రభువా ॥

    3. సౌందర్య సీయోన్ని - తలంచగా
    ఉప్పొంగుచున్న - హృదయముతో -2
    ఆనందమానంద - మానందమాని -2
    ప్రియునితో నేను పాడెదను ॥ ప్రభువా ॥

Sarvonnathuda neeve naku asraya dhurgamu సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము

Song no: 18
    సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము -2
    ఎవ్వరులేరు - నాకు ఇలలో -2
    ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా -2

  1. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - నిలువలేరని యెహోషువాతో -2
    వాగ్దానము చేసినావు - వాగ్దానా భూమిలో చేర్చినావు -2 ॥ సర్వో ॥

  2. నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు -2
    సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు -2 ॥ సర్వో ॥

  3. నీతి కిరీటం దర్శనముగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు -2
    విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు -2 ॥ సర్వో ॥

Aananda Yaathra Idi Aathmeeya Yaathra ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర


Song no: 2

ఆనంద యాత్ర
ఇది ఆత్మీయ యాత్ర
యేసుతో నూతన
యెరుషలేము యాత్ర
మన.. యేసుతో నూతన
యెరుషలేము యాత్ర              ||ఆనంద యాత్ర||

యేసుని రక్తము
పాపములనుండి విడిపించెను (2)
వేయి నోళ్ళతో స్తుతించినను
తీర్చలేము ఆ ఋణమును (2)    ||ఆనంద యాత్ర||

రాత్రియు పగలును
పాదములకు రాయి తగలకుండా (2)
మనకు పరిచర్య చేయుట కొరకై
దేవదూతలు మనకుండగా (2)     ||ఆనంద యాత్ర||

కృతజ్ఞత లేని వారు
వేలకొలదిగ కూలినను (2)
కృపా వాక్యమునకు సాక్షులమై
కృప వెంబడి కృప పొందెదము (2) ||ఆనంద యాత్ర||

ఆనందం ఆనందం
యేసుని చూచే క్షణం ఆసన్నం
ఆత్మానంద భరితులమై
ఆగమనాకాంక్షతో సాగెదం     ||ఆనంద యాత్ర||

Aananda Yaathra
Idi Aathmeeya Yaathra
Yesutho Noothana
Yerushalemu Yaathra
Mana.. Yesutho Noothana
Yerushalemu Yaathra   ||Aananda Yaathra||

Yesuni Rakthamu
Paapamulanundi Vidipinchenu (2)
Veyi Nollatho Sthuthinchinanu
Theerchalemu Aa Runamunu (2)              ||Aananda Yaathra||

Raathriyu Pagalunu
Paadamulaku Raayi Thagalakunda (2)
Manaku Paricharya Cheyuta Korakai
Deva Doothalu Manakundagaa (2)           ||Aananda Yaathra||

Kruthagnatha Leni Vaaru
Velakoladiga Koolinanu (2)
Krupaa Vaakyamunaku Saakshulamai
Krupa Vembadi Krupa Pondedamu (2)      ||Aananda Yaathra||

Aanandam Aanandam
Yesuni Chooche Kshanam Aasannam (2)
Aathmaananda Bharithulamai
Aagamanaakaankshatho Saagedam (2)    ||Aananda Yaathra||