శోధకుడొస్తాడు సైతాన్ గాడు వాడు
శోధిస్తునే ఉంటాడు మనలను శోధిస్తునే వుంటాడు
దేవుడు వస్తాడు బలవంతుడాయన
జయమిస్తునే ఉంటడు
మనకు జయమిస్తునే ఉంటడు
ఆదివారం వచ్చేసరికి
నిన్ను రానియ్యడు వాడు గుడికి
ఆ వారమంతా నీలో
కలిగేది అంతా చింత
ఆ వారమంతా నీకు
మిగిలేది ఎంతో కొంత
దేవుని ఆశీర్వాదం రాకుండ చేసి
కష్టాల పాలు చేయును
నిన్ను నష్టాల పాలు చేయును
ఆల్ నైట్ వచ్చే సరికి
నిన్ను రానియ్యడు ప్రార్ధనకి
భద్రంగ ఇచ్చును చద్ర
వాడు పొడుపోమ్మంటాడు
మొద్దు నిద్ర
ఆ నిద్రే పెద్ద దరిద్రం
పండుబోతుని చేయును
నిను తిండిబోతుని చేయును
పండుగ వచ్చేసరికి పదపదమాంటడు నిను గుడికి
కొట్టమని చెబుతాడు పోజులు కోయమని చెబుతాడు పోతులు
తినుచు త్రాగుచు తందనాలు ఆడి అవతల పడమంటడు
మళ్ళీ పండక్కే రమ్మంటాడు
ఏమి ఇచ్చి ఋణము
తీర్చగలను స్వామీ
ఎలాగ నిన్ను నేను
సేవించగలను స్వామీ
నాకున్న సర్వం ఇచ్చిన
ఋణము తీరదే
నాకున్న సర్వం ఇచ్చిన అర్పణ తీరదే
నా పాప శిక్షణంత నీవే మోసితివే
నాకొరకై క్రయధనముగా
నీ ప్రాణము నిచ్చితివే
నీలాంటి ప్రేమను
ఎవ్వరు చూపనే లేదు
నీలా ప్రేమించెవారు కనబడనే లేదు
ఎక్కడ వెదికినను దొరకనే లేదు
పలుచోట్ల వెదకినను కనబడనేలేదు
వెండి బంగారములతో
విమోచెనే లేదు కోడెల రక్తముతోనైన
పరిశుద్ధతే లేదు
పరిశుద్ధ రక్తం నాకై చిందించిన దేవా
అమూల్య రక్తముతో విమోచించినావే
ఎక్కడ వెదికినను దొరకనే లేదు
పలుచోట్ల వెదకినను కనబడనే లేదు
ఆలోచించుడి నా యేసు రాక సమీపమాయే
చలికాలము గడిచిపోయెను వర్షకాలము తీరిపొయెను
దేశమంతట పూలు పూసెను పిట్టలన్నీయు కొలహలం చేసెను
వస్తుంది వస్తుంది యేసు రాకడని
త్వరగా వస్తుంది క్రీస్తు రాకడని
ఎటు చూచిన యుద్ద సమాచారము
ఎటు చూచిన కరువు భూకంపములు
జనము మీదికి జనము
రాజ్యము మిదికి రాజ్యము
యేసు రాకడకు ఇవియే సూచనలు
సూచనలెన్నో నేరవేరుచున్నవి
కాలమును నీవు గుర్తించ వేల
ఉరివలే ఆ దినము నీ పైకి వచ్చును
సిద్దపడుమా సంసిద్దముగా ఉండుమా
బ్రతిమాలుచున్నది నాయేసు ప్రేమ
దినదినము నిన్ను బ్రతిమాలుచున్నది " 2 "
వీధి వీధి తిరిగి నీ ఇంటికొచ్చి
పదే పదే నిన్ను బ్రతిమాలుచున్నది " 2 "
పదే పదే నిన్ను బ్రతిమాలుచున్నది
" బ్రతిమాలుచున్నది "
లోక స్నేహము దేవునితో వైరము
ఆ స్నేహము నీవు విడువాలని " 2 "
పరము నుండి దేవుడు ధరణికి వచ్చి
తనతో స్నేహం చేయమనుచు " 2 "
పదే పదే నిన్ను బ్రతిమాలుచు
చేతులు చాచి పిలుచుచున్నాడు " 2 "
" బ్రతిమాలుచున్నది "
పాపిగానే నీవు ఉన్నప్పుడు
క్రీస్తు యేసు నీకొరకే మరణించెను " 2 "
శిక్ష నుండి నిన్ను తప్పించాలని
పరలోక పౌరత్వం ఇవ్వాలని " 2 "
పదే పదే నిన్ను బ్రతిమాలుచు
చేతులు చాచి పిలుచుచున్నాడు " 2 "
" బ్రతిమాలుచున్నది "
ఏయోగ్యత లేని నిన్ను పిలచి
దివ్యమైన తన సేవను అప్పగించెను " 2 "
లోకభోగాలకు బానిస కాక
లోకమంతా సువార్తను ప్రకటించాలని " 2 "
పదే పదే నిన్ను బ్రతిమాలుచు
కన్నీళ్లతో నిన్ను అడుగుచున్నాడు " 2 "
" బ్రతిమాలుచున్నది "
అదిగదిగో అందాల తారా రక్షకుడై పుట్టాడని
చీకటిలో ఉన్నా వారికి వెలుగై తాను ఉన్నాడని ”2”
ఒక వార్త తెలిసెను మనకు , శుభవార్త తెలిసెను మనకు
ఇంకా భయమే భయపడి పారిపోవును మనసా
ఇంకా చీకటి రాజ్యం నీపై ఉండదు తెలుసా “2”
బందకాలను తెంచివేయును యేసుడే ఉన్నాడని
అనాదైనా , అబాగ్యులైనా నేనున్నానని “2” “ఒక వార్త”
అగ్నిలో బాప్థిస్మమియ్యను యేసుడే ఉన్నాడని
సాతను రాజ్యం కూల్చివేయు ప్రభు ఆయనేనని “2”“ఒక వార్త”
అనగనగ ఒక ఊరుంది ఆ ఉరు బేత్లెహేము
బేత్లెహేము ఊరిలోన యోసేపను మనుజుని యింట మరియకన్నియ ఉంది
దైవబలము కలిగిన యువతీ
ఆ కన్య గర్బములోన ఓ బాలుడు ఉదయించాడు
ఆ బాలుడు యేసైయంట వోరైయ్యా దేవా దూత సేలవిచెను వినవాయ్యా
తుర్పు ఎంత వెలుగును నింపే తార ఒకటి నేడు వెలుగుతుంది చూడు(2)
చీకటింకమాయం పాపమంత దూరం (2)
చిన్ని యేసు జగతికింక నేస్తం (అనగనగ)
శాంతి లేదు సుఖము లేదు మనసు చీకటయే బ్రతుకు భారమాయే(2)
శాంతి సమాధానం ప్రేమ కరుణ కోసం (2)
రక్షకుండు నేడు పుట్టినాడు(అనగనగ)
అరుణకాంతి కిరణమై-కరుణ చూపి ధరణిపై
నరుని రూపు దాల్చెను-పరమదేవ తనయుడు
అదే అదే క్రిస్మస్ - హ్యాపీ క్రిస్మస్ (2) ఇదే ఇదే క్రిస్మస్ - మెరీ క్రిస్మస్
యజ్ఞ యాగాదులు-బలికర్మ కాండలు
దోషంబులు కడుగలేవు-దోషుల రక్షింపలేవు (2)
పరిశుద్ధుని రక్తమునందే-పాపులకిల ముక్తి కలుగును
అందుకే అందుకే ..అరుణ
పుణ్యకార్యంబులు - మరి తీర్థయాత్రలు
మోక్షంబును చేర్చలేవు-మనశ్శాంతిని కూర్చలేవు
పరిశుద్ధుని రక్తమునందే-పాపులకిల ముక్తి కలుగును
అందుకే అందుకే ..అరుణ
ఆనందమానందమే
ఈ భువిలో యేసయ్య నీ జననము (2)
సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికి మహిమ ప్రభావము
భూమి మీద తనకిష్టులకు
సమాధానము కలుగును గాక
హల్లెలూయా ||ఆనంద||
తన ప్రజలను వారి పాపమునుండి రక్షించుట
కొరకై యేసు భువికి దిగి వచ్చెను
తన ప్రజలకు రక్షణ జ్ఞానము అనుగ్రహించుటకు
దేవుని జ్ఞానమై వచ్చెను ||సర్వోన్నత||
మరణ ఛాయలు చీకటిలోను కూర్చున్నవారికి
యేసు అరుణోదయమిచ్చెను
పాప శాపము నుండి ప్రజలకు విడుదలనిచ్చుటకు
క్రీస్తు నర రూపము దాల్చెను ||సర్వోన్నత||
ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో (2)
ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో (2) ||ఆహా||
యెషయా ప్రవచనము నేడు రుజువాయే
జన్మించె కుమారుండు కన్య గర్భమందున (2) ||ఆనందమే||
మీకా ప్రవచనము నేడు రుజువాయే
ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున (2) ||ఆనందమే||
తండ్రి వాగ్ధానం నేడు నెరవేరే
దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము (2) ||ఆనందమే||
హృదయ శుద్ధిగలవారే ప్రభుని చూచెదరండి
వర్ణింపతరమా వివరింపతరమా ఈ మహ ఆనందము (2)( ఉల్లా)
ఆచారపండగ కాదు వారసత్వ పండుగ కాదు
పుట్టుకతో మేము క్రైస్తవులం అన్న భావన ఉండరాదు
మారుమనస్సు పొందితేనే దొరెకెను ఈ తరం (2)(ఉల్లా)
దేశమేదైన గాని యేసే నిత్యజీవమని
భావన ప్రజలందరు భక్తి ఆశక్తిగలిగి
కారణ జన్ముడు ఘనుడు యేసుకు స్తోత్రం చెల్లించెదం ( ఉల్లా)
ఇంటింట సందడి ప్రతి ఇంట సందడి – చేయాలి సందడి ఊరంతా సందడి
మనసంతా సందడి మనకెంతో సందడి – జరగాలి సందడి మన క్రీస్మస్ సందడి
ఆనందమే ఎంతో ఆనందమే యేసు నా కొరకే పుట్టిన రోజా
సంతోషమ్ ఎంతో సంతోషమ్ యేసు నా కొరకే వచ్చే ఈ రోజా “2” “ఇంటి”
లోక పాపము భరియించను దైవ పుత్రుడు దిగివచ్చెను
నీతి సూర్యుడు ఉదయించేను లోకమంతా వెలుగోచ్చెను “2” “ఆనందమే”
దేవదూతలే దిగివచ్చెను దేవదేవుని స్తుతీయించును
గొల్లలంతా వచ్చను యేసురాజును పూజించేను “2” “ఆనందమే”
ఈనాడే శుభదినం-ప్రభుయేసుని మహోదయం
దైవసుతుడే ఇలకు దిగివచ్చెనే
హల్లెలూయ హోసన్నా-హోసన్నా హల్లెలూయ (2)
పెరిగే పాపభారం-మనిషి మరిచే మానవత్వం
కలిగే దైవ మార్గం-దారిచూపే యేసు జననం (2)
ఎంతో మధురమయ్యా-మది నిండే ఆ వార్తకు (2)
హల్లెలూయ హోసన్నా-హోసన్నా హల్లెలూయ (2)
సంతోషాల సమయం-సర్వలోకం వెలుగునిండ
అజ్ఞానుల తిమిరం-అణగద్రొక్కే రాజు వచ్చే (2)
అంతా కలసి ఆ ప్రభుని సేవింపగా (2)
హల్లెలూయ హోసన్నా-హోసన్నా హల్లెలూయ (2)
ఈరోజు క్రిస్మస్ వచ్చింది ఎన్నోనో తేచిపెట్టింది కన్నీరు తుడిచి
కలుశాలు భాపే బాలుడు జన్మించాడు
భూవి ప్రజలి దివిలో దుతలి ఈ విశ్వమంతా గొంతేతి పాడిన
ఆ మహిమ వితిడైన దేవునికి ఈ స్తుతి సరిపోదు ఎందరో
కవులు ఎన్నోగీతాలు రచించిన్న మరెందరో గాయకులూ
గాసింనం చేసిన ఆయనను స్తుతిచడానికి ఈ కాలాలు
ఈ గళాలు సరిపోవు మన జాలికి తను ఆర్పనంగా
చిసుకుని అభాయమిచి ఆదుకుని లోక పాపమును
మోసుకుని పోవు దేవుని గోరీ పిలా దినుడై దివి
నుండి భువి దిగి వచిన్న వేల మనకు క్రిస్మస్ పండుగా
క్రిస్మస్ వచ్చింది ఎన్నెనో తెచింది కన్నిరుకష్టాలు తీర్చింది
ఎంతెంతో సంతోశమియ్యంగా యేసు బాలుడై జన్మించెను ( 2 )
సర్వోనాథం బైనా స్థలములలో మహిమ భూమిపై ఇష్టులకు సమాదానము ( 2 )
పాపల భూమిని పరిశుద్ద పరిచి శుద్ధి కరించగా యేసు ( 2 )
ప్రేమతో ప్రజలను పాలించి పుడమి పై ప్రభవించే ఈ రేయిలో
క్రిస్మస్ యి పలకించ్చవోయి వికసించి విరిసింది హాయి2
మనుజలికి తాను అర్పణం చేయ మేస్సయగా తాను దాల్చే (2)
నీసిధిలో నేడు నిరుపామ తేజుడై నింగిని విడేనుగా ( 2 )
క్రిస్మస్ వచ్చింది ఎన్నెనో తెచింది కన్నిరు కష్టాలు తీర్చింది
ఎంతెంతో సంతోశమియ్యంగా యేసు బాలుడై జన్మించెను ( 2 )
సర్వోనాథం బైనా స్థలములలో మహిమ
భూమిపై ఇష్టులకు సమాదానము ( 2 )
చిన్ని యేసయ్య - చిన్నారి యేసయ్య
జన్మించినావా- నీవు పశుల పాకలో
మరోసారి జన్మించు – మా గుండెలో “ 2”
కన్యమరియ గర్భమందు – కరుణామయ
వెలిశావా ఇలపాపిణి – రక్షింప
ప్రేమా మూర్తివైన నీ ప్రేమను నే కనుపరచ “2”
మరొసారి జన్మించు మా గుండెలో “2”
ధూత ఆన వాళ్లతో గొల్లలు నిన్ను చూశారు
నక్షత్ర గుర్తుతో జ్ఞానులు, నిన్ను వెదికారు
మమాధి నేత్రాలతో – నీ రూపము చూడ
మరొసారి మా గుండెలో జన్మించవా “2”
పాపాచీకటి చేత – ప్రాబలేను ఈ ప్రపంచం
నీ పావన జన్మతో – ప్రకాశించే లోకము
మా అంధకార హృదయాన్ని ప్రకాశింపచేయు
మరొసారి మాగుండెలో జన్మించవా “2”
చీకట్లు తొలగెను యేసుని రాకతో-హోసన్నా హోసన్నా
వెలుగు కలిగెను యేసుని జన్మతో-హోసన్నా హోసన్నా
భువిలో శాంతి నెలకొల్పుటకు - శాంతి రూపుడేసయ్యా
ఇలలో వెలసినాడయ్యా (2)
శాంతి కాంతి ఆ యేసే - జీవనజ్యోతి ఆ యేసే
జీవజలము ఆ యేసే - జీవాహారము ఆ యేసే
హృదయాలను వెలిగించుటకు-సదయుడైన దేవుడు
వెలసే పశుల శాలలో-బాలయేసుగా ..చీకట్లు
ఆశ్చర్యకరుడు ఆ యేసే - ఆలోచనాకర్త ఆ యేసే
నిత్యుడగు తండ్రి ఆ యేసే-సమాధానకర్త ఆ యేసే
హృదయాలను వెలిగించుటకు-సదయుడైన దేవుడు
నరుల కొరకు నరుడాయే నజరేయుడు ..చీకట్లు
జన్మించె నేడు దివ్య బాలుడు నిజంబు బెత్లెహేము పురమునందునా
పాడెదం శుభములంచు హాయిగా - మధురమైన ఈ ఉదయ వేళలో
తలను దాల్చి స్ధలము లేక పొయిన -
తనదు జనులే తనను త్రీసి వేసిన
దైవ ప్రేమ తనలో వక్తమగుటాకు - తరలివెచ్చె తండ్రియే కుమారుడై
పాడి దేవ దూతలాకాశంబున
పాడే మనుజ కోటి భూతలంబున
పాడవోయి నీదు హృదయమందున
ముదము మీద ప్రభువు పవ్వళింపగా
పరము నేల దివ్య రాజు సుతునిగా
పవ్వళించే పశులశాల తోట్టెలో
పవ్వళింప నీదు హృదయమందున
వేచి వుండెనోయి ఈ దినంబున
జో జో లాలి (2)
బాల యేసు లాలి నను గన్న నా తండ్రి లాలి
నా గారాల తనయా లాలి.. జో జో.. జో జో.. జోజో..
జగతిని ఏలే నీవు జననిగనను ఎంచితివి
పేదరాలిని నేను పొత్తిబట్టలు పరచితివి
తల దాచు చోటులేక తల్లడిల్లిపోతిని
వాడ వాడ వెదకినను పశులపాకె నెల వాయె
నింగినేల నీ సొంతమైన ఇసుమంతా చోటు
నీకు లేదాయే తారపు వెలుగులు యిచ్చిన
నీకే చిరుదీపమేనాడు కరువాయె
ఎవరి కొరకు నీవస్తావో వారెవరికి కానరా రాయె
అన్ని ఉన్న దేవుడవు లేనివానిగా జన్మించితివి
నా హృదాయ సీమలో ఆనందగీతిక
పొంగి పారింది మేని పులకించగ
అ.ప. : క్రిస్మస్ గంటలు మ్రోగాయి - క్రీస్తుని జన్మను చాటాయి
ఆశ్చర్యకరుడు నిత్యుడగు దేవుడు
ఈ భువిలో ఉదాయించ పుడమికే పండుగ
ఆ దేవుడే గుండె గదిలో జన్మించ
నా బ్రతుకున అదే నిజమైన పండుగ
గగనాన దూతలు గళమెత్తి పాడ
సమాధాన గీతాలు జనులకు వినిపింప
ఆ యేసు బాలుని ఆ దివ్యరూపుని
మనసున స్మరియింప ఉప్పొంగె నా మది
పరలోక సౌఖ్యం విడనాడి యేసు
దీనుడుగా ఇలకు దిగి వచ్చినాడు
ఆ రాజువోలె తగ్గింపు కలిగి
తన దివ్య సేవలో సాగుటే ధన్యత
నింగిని నేలను ఏకము చేసిన పండుగ
నింగికి నేలకు నిచ్చెన వేసిన పండుగ
అ.ప. : క్రిస్మస్ హాపీ క్రిస్మస్ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
జ్ఞానుల జ్ఞానము వ్యర్ధము చేసిన పండుగ
రాజుల గుండెలో అలజడి రేపిన పండుగ
దీనుల ప్రార్థనకు ఫలముగ వచ్చిన పండుగ
పాపుల కోసము రక్షణ తెచ్చిన పండుగ
యూదుల కలలన్నీ నిజముగ మార్చిన పండుగ
బాధల బ్రతుకులలో నెమ్మది కూర్చిన పండుగ
పండుగ పండుగ వచ్చింది
క్రిస్మస్ పండుగ వచ్చింది(2)
లోకానికి తెచింది శుభవార్త క్రీస్తు పుట్టుక వార్త(2)( పండుగ)
కన్య మరియా గర్బమునందు
దైవ కుమారుడు వెలసినాడు (2)
ఇంత దీనతిదినమో తగింపు గుణమో
నీకై నాకై మన యేసుండు
యేసు జన్మించే హృదయలల్లో
పాపికి రక్షణ దోరికేనులే (2)
పారమ బాగ్యము దోరికేనులే ( పండుగ)
గొప్ప జ్ఞనులు గొల్లలు చేరి
యేసుని సమీపించి వంగి వంగి మొకిరి(2)
రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు
నిన్న నేడు ఉన్నవాడవు
యేసు జన్మించే హృదయలల్లో
పాపికి రక్షణ దోరికేనులే (2) ( పండుగ)
పాకలోన సందడాయే - లోకమంతా పండగాయే
అ.ప: యేసయ్య వచ్చాడు-సంతోషం తెచ్చాడు
దేవుని దగ్గరనుండి కబురు వచ్చింది
లోకముపై తండ్రి ప్రేమ వెల్లడయ్యుంది మనతో
మాట్లాడుటకు మధ్యవర్తిగా
చీకటి ఛాయలలో కాంతి వచ్చింది
నిత్యజీవమునకు దారి సిద్ధమయ్యుంది
మరణం జయుంచుటకు చక్రవర్తిగా
గొర్రెలకాపరుల చుట్టూ మహిమ వచ్చింది
దూతల పాటకు నింగి వేదికయ్యుంది
ధైర్యం కలిగించుటకు ప్రేమముర్తిగా
ప్రభు యేసు క్రీస్తు జన్మించే - పరిపూర్ణ తేజముతో లోకానికి ఇదియే పర్వదినం –
ఇదియే మహోదయం.."2"
పరిశుధుడు పరమాత్ముడు సత్యా సంపూర్ణుడైపరలోక మార్గము చూపుటకు –
తన ప్రేమను తెలుపుటకు..॥ప్రభు యేసు॥
పాపులకై పరమును విడచి - నరరూపధారునిగా పశువుల శాలలో
Ĺమరియ సుతునిగా ఆయన పవళించే.."2"
దూతలు తెల్ప ఆ వార్తను విని ఆ గొర్రెల కాపరులు
అడుగో ప్రభు అని కని ఆరాధించిరి ..॥ప్రభు యేసు॥
తూరుపు తారలు కనుగోనినా - ఆ ముగ్గురు జ్ఞానులు ఓర్పున సాగి
అద్భుత కరుడగు యేసును దర్శించి .."2"
భక్తితో మ్రొక్కి కానుకలిచ్చి - బహు సంతోశించగా మనము
ఇది విని ప్రభుని ఆరాధింతుము..॥ప్రభు యేసు॥
ప్రకాశించే నక్షత్రం – చీకటి విశ్వంలో – ఉదయించేను రక్షకుడు పాపందకారములో
దివి నుండి భూవికేతెంచును – మన కొరకే ఆ ప్రభుయేసుడూ “2”
1.భూవిపై శాపము బాపుటకు వచ్చెను – పాప విమోచన కలిగించుటకు వచ్చెను “2”
మహిమా శరీరము వదిలి – ఇలనరుడై ఉదయించేను
మన కొరకై తాను తగ్గించుకోనెను “2”
2.స్తుతిల నైవేద్యమును గైకొను ఆ దేవుడే
ఉన్నత భాగ్యం వదిలి భూవిపై పుట్టెను “2”
ఇమ్మాను యేలుగా సదాకాలము – మనకు తోడై ఉండే దేవుడు “2”
బాల యేసుని జన్మ దినం
వేడుకైన శుభ దినము
సేవింప రారే జనులారా
ముద్దుల బాలకు ముద్దులిడ ||బాల||
మరియమ్మ ఒడిలో ఆడెడి బాలుని
చిన్నారి చిరునవ్వు లొలికెడి బాలుని (2)
చేకొని లాలింప రారే
జో జోల పాట -లు పాడి ||బాల||
పాపికి పరమ మార్గము జూప
ఏతెంచి ప్రభువు నరునిగా ఇలకు (2)
పశుశాలయందు పవళించే
తమ ప్రేమను జూపింప మనకు ||బాల||
మన జోల పాట -లు ఆలించు బాలుడు
దేవాది దేవుని తనయుడు గనుక (2)
వరముల నొసగి మనకు
దేవుని ప్రియులుగా జేయు ||బాల||