వింటిమయ్యా నీ స్వరము కంటిమయ్యా నీ రూపమును
ప్రియప్రభూ నిన్ను గాక వేరెవరిని చూడము వినము
భక్తి మర్మము గొప్పది యెంతో - శరీరుడుగా మారిన దేవా,
దూతలకు కనబడితివి లోకమందు నమ్మబడియున్న దేవా ||వింటి||
ప్రియప్రభూ నిన్ను గాక వేరెవరిని చూడము వినము
భక్తి మర్మము గొప్పది యెంతో - శరీరుడుగా మారిన దేవా,
దూతలకు కనబడితివి లోకమందు నమ్మబడియున్న దేవా ||వింటి||
భయపడవలదని దూతలు తెల్పె - మహా సంతోషకరమైన వార్త,
రక్షకుడు పుట్టెనని - పరమందు మహిమ భువికి శాంతియనిరి ||వింటి||
నరరూపధారివి యైతివి ప్రభువా - అద్భుతములు చేసి యున్నావు,
వేరెవ్వరు చేయలేరు - అద్భుతకరుడ ఘనత కలుగును గాక ||వింటి||
మూగవారికి మాటలిచ్చితివి గ్రుడ్డి కుంటిని బాగు జేసితివి - మృతులను లేపితివి
పరాక్రమ శాలివి నీవే ఓ ప్రభువా ||వింటి||
ప్రేమించి ప్రభువా ప్రాణమిచ్చితివి - అధికారముతో తిరిగి లేచితివి మరణపు ముల్లు విరిచితివి -
సమాధి నిన్ను గెలువక పోయెను ||వింటి||
ఇహము నుండి పరమున కేగి - మా కొరకై నీవు రానైయున్నావు ఆనందముతో కనిపెట్టెదము -
మదియందే నిరీక్షణ కలిగి స్తుతింతుం||వింటి||