Song no: 96
- నా యేసయ్యా నా స్తుతియాగము
- ఆత్మతోను మనసుతోను
నేను చేయు విన్నపములు (2)
ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై
విజ్ఞాపన చేయుచున్నావా (2)
విజ్ఞాపన చేయుచున్నావా || నా యేసయ్యా ||
- ప్రార్థన చేసి యాచించగానే
నీ బాహు బలము చూపించినావు (2)
మరణపు ముల్లును విరిచితివా నాకై
మరణ భయము తొలగించితివా (2)
మరణ భయము తొలగించితివా || నా యేసయ్యా ||
- మెలకువ కలిగి ప్రార్థన చేసిన
శోధనలన్నియు తప్పించెదవు (2)
నీ ప్రత్యక్షత నే చూచుటకే నాకై
రారాజుగా దిగి వచ్చెదవు (2)
రారాజుగా దిగి వచ్చెదవు || నా యేసయ్యా ||
నైవేద్యమునై ధూపము వోలె
నీ సన్నిధానము చేరును నిత్యము
చేతువు నాకు సహాయము వెనువెంటనే – వెనువెంటనే (2)